‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాను ‘వల్గర్’ అన్న ఫిలిం ఫెస్టివల్ జ్యూరీ చైర్మన్, ఎవరు ఎలా స్పందించారు?

ఫొటో సోర్స్, Vivek Agnihotri/Facebook
- రచయిత, వరికూటి రామకృష్ణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
బాలీవుడ్ సినిమా ‘ది కశ్మీర్ ఫైల్స్’ మరొకసారి వార్తల్లోకి వచ్చింది.
గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్ఎఫ్ఐ) చైర్మన్ నడవ్ లపిడ్ తీవ్రంగా విమర్శించారు.
కశ్మీరీ పండితుల వలసల మీద తీసిన ఈ సినిమా ‘వల్గర్’గా ఉందని లపిడ్ అన్నారు. అదొక ‘ప్రాపగాండ మూవీ’ అని వ్యాఖ్యానించారు.
‘అలాంటి సినిమాను ఈ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించడం చూసి జ్యూరీలోని అందరూ షాక్ అయ్యారు’ అని ఆయన అన్నారు.
‘మాకు ఈ సినిమా ఒక ప్రాపగాండ చిత్రంలా అనిపించింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ఫిలిం ఫెస్టివల్‌లో పోటీ పడే అర్హత ఆ సినిమాకు లేదు. ఈ స్టేజీ మీద నిలబడి మీతో నా అభిప్రాయాలను ఇలా నిర్మొహమాటంగా పంచుకుంటున్నందుకు నేనేమీ ఇబ్బంది పడటం లేదు.
భిన్న అభిప్రాయాలను అంగీకరించడానికే ఇలాంటి ఫిలిం ఫెస్టివల్స్‌ను ఏర్పాటు చేస్తారు. జీవితంలోనైనా కళలోనైనా విమర్శ అనేది ఎంతో అవసరం’ అని ఐఎఫ్ఎఫ్ఐ వేదికగా నడవ్ లపిడ్ అన్నారు.
గోవాలో జరుగుతున్న ఈ ఫిలిం ఫెస్టివల్ ముగింపు సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇజ్రాయెల్ డైరెక్టర్ అయిన నడవ్ లపిడ్ చేసిన వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఫొటో సోర్స్, Vivek Agnihotri/Facebook
లాయర్ ప్రశాంత్ భూషణ్ వంటి వాళ్లు నడవ్ లపిడ్ చేసిన వ్యాఖ్యలను ట్విటర్‌లో షేర్ చేస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
‘ది కశ్మీర్ ఫైల్స్ అనే ఒక ప్రాపగాండ సినిమా తీశారు. దాన్ని ప్రమోట్ చేసేందుకు అన్ని రకాలుగా అధికారాన్ని దుర్వినియోగం చేశారు. ఇప్పుడు దానికి ‘వల్గర్’ అనే బహుమతి దక్కింది. కశ్మీరీ ఫైల్స్‌కు ఇది ఎంతో అవమానకరం’ అని సాక్షి జోషి అనే జర్నలిస్ట్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
‘ద్వేషాన్ని ఎప్పటికైనా తిరస్కరిస్తారు...’ అంటూ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం చైర్‌పర్సన్ సుప్రియా శ్రీనాథే అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
‘ది కశ్మీరీ ఫైల్స్’ సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి నడవ్ వ్యాఖ్యలపై స్పందించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
‘అబద్ధాలు ఎన్ని చెప్పినా అవి నిజానికి సాటి రావు...’ అంటూ కశ్మీర్ ఫైల్స్ సినిమాలో నటించిన బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడిన అనుపమ్ ఖేర్, యూదుల జాతి హననం సరైనదైతే కశ్మీరీ పండితుల ఊచకోత కూడా సరైనదే అవుతుందని ఆయన అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
నడవ్ లపిడ్ మీద చర్యలు తీసుకోవాలని బాలీవుడ్ ప్రొడ్యూసర్ అశోక్ పండిట్, కేంద్ర సమాచారశాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్‌ను కోరారు.
‘మా విషాధ గాథను వల్గర్ గా అభివర్ణించిన ఐఎఫ్ఎఫ్ఐ-2022 జ్యూరీ చైర్మన్ మీద తగిన చర్యలు తీసుకోవాలని ఒక కశ్మీరీ పండితునిగా, జాతి హననపు బాధితునిగా కోరుతున్నా’ అంటూ అశోక్ పండిట్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
ఒక జ్యూరీ పని సినిమాలలో మంచి చెడ్డలను ఎంచడమే కానీ బహిరంగంగా ‘రాజకీయ వ్యాఖ్యలు’ చేయడం కాదని కొందరు అంటున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 8
నడవ్ లపిడ్ చేసిన వ్యాఖ్యలను హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఖండించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 9
అయితే ముంబయిలోని ఇజ్రాయెల్ కాన్సులేట్ జనరల్ కోబీ షోషానీ మాత్రం, ది కశ్మీర్ ఫైల్స్ సినిమా మీద తన అభిప్రాయం వేరుగా ఉందని ట్వీట్ చేశారు.
‘నేను ది కశ్మీర్ ఫైల్స్ సినిమా చూశాను. అందులో పని చేసిన వారిని కలిశాను. నడవ్ లపిడ్ అభిప్రాయం కంటే నా అభిప్రాయం భిన్నమైనది. నడవ్ మాట్లాడిన తరువాత నేను ఆయనకు నా అభిప్రాయాన్ని చెప్పాను’ అని ఆయన అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 10
మరోవైపు భారతదేశంలో ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిలాన్ కూడా లపిడ్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
వరస ట్వీట్లతో ఆయన వైఖరిపై విమర్శలు చేశారు. ఒకే రకమైన సమస్య ఎదుర్కొంటున్న రెండు దేశాల సారూప్యాన్ని కూడా లపిడ్ గుర్తించ లేకపోయారని ఆయన అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 11

పోస్ట్ of X ముగిసింది, 12
గతంలోనూ వివాదాలు
బాలీవుడ్ డైరెక్టర్ అగ్నిహోత్రి తీసిన ‘ది కశ్మీర్ ఫైల్స్ ఈ ఏడాది మార్చిలో విడుదలైంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు.
1990లో కశ్మీర్ లోయను విడిచి దేశంలోని అనేక ప్రాంతాలకు వలస వెళ్లిన పండితుల జీవితాల ఆధారంగా ఈ సినిమాను తీశారు.
కశ్మీరీ పండితుల వలసలను ‘జాతి హననంగా’ అనుపమ్ ఖేర్, వివేక్ అగ్నిహోత్రి అభివర్ణించారు.
‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా విడుదలైన నాటి నుంచే దాని మీద విమర్శలు వచ్చాయి. కొన్ని వక్రీకరణలు, కల్పనలతో పాటు అవాస్తవాలను చూపించారని ఆరోపణలు ఉన్నాయి.
అయితే ఇంతకాలం కశ్మీర్ పండితుల ‘ఊచకోత’ గురించి ఎవరూ మాట్లాడలేదని, తాము ఆ విషాధ గాథలను తాము బయటకు తీస్తున్నామని వివేక్ అగ్నిహోత్రి వంటి వారు చెప్పారు.

ఫొటో సోర్స్, Vivek Agnihotri/Facebook
ప్రధాని మోదీ ప్రశంసలు
‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాను ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వంటి వారు మెచ్చుకున్నారు.
బీజేపీ, రైట్ వింగ్ సంస్థలు ఆ సినిమాకు ఎంతో ప్రచారం కల్పించాయి. చాలా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాకు వినోదపు పన్ను రాయితీలు ఇచ్చారు.
సింగపూర్‌లో నిషేధం
ఈ ఏడాది మేలో ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాను సింగపూర్ ప్రభుత్వం నిషేధించింది.
సమాజంలోని భిన్న సముదాయాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా ఆ సినిమా ఉంది అంటూ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు.
‘ఆ సినిమా రెచ్చగొట్టేలా ఉంది. కశ్మీర్‌లో హిందువుల వేధింపులకు కారణం ముస్లింలు అంటూ ఏకపక్షంగా చిత్రీకరించారు’ అంటూ సింగపూర్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
నడవ్ లపిడ్ ఎవరు?

ఫొటో సోర్స్, PIB
ఇజ్రాయెల్ డైరెక్టర్ అయిన నడవ్ లపిడ్ టెల్ అవీవ్‌లో జన్మించారు. టెల్ అవీవ్ యూనివర్సిటీలో ఆయన ఫిలాసఫీ చదువుకున్నారు.
పారిస్‌లో ఫ్రెంచ్ లిటరేచర్ చదువుకున్నారు. జెరూసంలో శామ్ స్పీగెల్ ఫిలిం స్కూల్లో కోర్సు చేశారు.
2011లో నడవ్ లపిడ్ తొలి ఫీచర్ సినిమా ‘పోలీస్ మ్యాన్’ విడుదలైంది. 2016 కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు సంబంధించి ఇంటర్నేషనల్ క్రిటిక్స్ జ్యూరీలో సభ్యునిగా పని చేశారు.
53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా-2022లో జ్యూరీ చైర్మన్‌గా నడవ్ లపిడ్ ఎంపికయ్యారు.
భారతీయ డైరెక్టర్ సుదీప్తో సేన్, ఫ్రాన్స్ ఎడిటర్ పాస్కల్ చావాన్స్, జేవియర్ యాంగులో బార్టరన్, అమెరికాకు చెందిన సినిమా నిర్మాత జింకో గొటోష్ ఈ జ్యూరీలో ఇతర సభ్యులుగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఆ కాలనీలో సీఎం జగన్ 16 వేల పట్టాలిస్తే, 16 ఇళ్లే పూర్తయ్యాయి, ఎందుకు?
- అమరావతిలో రాజధాని నిర్మాణం ఆరు నెలల్లోగా పూర్తిచేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే
- మనం తినే ఉప్పు ఎలా తయారవుతుంది, అది మీ వంటింటి దాకా ఎలా వస్తుంది?
- తియానన్మెన్ స్క్వేర్: మమ్మల్ని చంపకండి అని వేడుకున్న విద్యార్థులపై చైనా ఎలా ఉక్కుపాదం మోపింది?
- తెలంగాణలో ‘దాడుల’ దారెటు ?- వీక్లీ షో విత్ జీఎస్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)