కాంతారా: అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా మీద అసంతృప్తి ఎందుకు?

కాంతార

ఫొటో సోర్స్, facebook/HombaleFilms

    • రచయిత, వరికూటి రామకృష్ణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కాంతారా సినిమా మళ్లీ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

గురువారం ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదలైన ఈ సినిమా మీద చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ‘వరాహరూపం’ అనే పాట.

‘వరాహరూపం’ పాట థియేటర్ వెర్షన్ లేక పోవడం మీద చాలా మంది అమెజాన్ ప్రైమ్‌ను విమర్శిస్తున్నారు. అది లేకుండా ఎందుకు రిలీజ్ చేశారంటూ ప్రశ్నిస్తున్నారు.

కాంతారా సినిమాలో రిషబ్ శెట్టి

ఫొటో సోర్స్, TWIITER/RISHAB SHETTY

థియేటర్ వెర్షన్ ఎందుకు లేదు?

కాంతారా సినిమా థియేటర్ వెర్షన్‌లో ఉన్న ‘వరాహరూపం’ పాటకు చాలా మంచి స్పందన వచ్చింది. అయితే ఆ పాటలో ఉపయోగించిన సంగీతం తమ పాట నుంచి కాపీ చేశారని కేరళకు చెందిన ‘థైక్కుడమ్ బ్రిడ్జ్’ అనే బ్యాండ్ కోర్టుకు వెళ్లింది.

దాంతో కాంతారా సినిమాలో ‘వరాహరూపం’ పాటను తొలగించాల్సిందిగా కేరళలోని ఒక జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ‘వరాహరూపం’ థియేటర్ వర్సెన్ లేకుండానే అమెజాన్ ప్రైమ్‌లో కాంతారా సినిమా విడుదలైంది.

‘నవరసం’ అనే తమ పాటకు ‘వరాహరూపం’ అనేది కాపీ అని థైక్కుడమ్ బ్రిడ్జ్ బ్యాండ్ చెబుతోంది. ఒక పాట నుంచి ప్రేరణ పొందడం వేరు, సంగీతాన్ని కాపీ కొట్టడం వేరు అని అది వాదిస్తోంది.

తమ పాటను కాపీ కొట్టడమే కాకుండా దానికి క్రెడిట్ తమకు ఇవ్వలేదని థైక్కుడమ్ బ్రిడ్జ్ తెలిపింది.

భూత కోల కళాకారుడు

ఫొటో సోర్స్, FACEBOOK/SMITHA RAO

సినిమా ప్రియుల అసంతృప్తి

‘వరాహరూపం’ థియేటర్ వెర్షన్ తొలగించడాన్ని వెన్నెల, ప్రస్థానం, రిపబ్లిక్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన దేవ కట్టా విమర్శించారు.

‘థైక్కుడమ్ బ్రిడ్జ్‌కు చెందిన నవరసానికి కాంతారా సినిమాలోని వరాహరూపాన్ని కాపీ అని చెప్పినప్పుడు... ఒకే రాగంలో రెండు పాటలు ఉండకూడదు కదా? ఆ లెక్కన చూస్తే సగం పాటలను కాపీనే అనాల్సి ఉంటుంది.

‘కాపీ’ అనే కారణంతో అంత అద్భుతమైన పాటను అమెజాన్ తీసేయాల్సి రావడం చాలా నిరాశను కలిగించింది’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

‘వరాహరూపం’ థియేటర్ వెర్షన్ పాటను సినిమాలో యాడ్ చేయాలని అమెజాన్ ప్రైమ్‌ను కొందరు కోరుతున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

‘వరాహరూపం’ అనే ఆత్మ లేకుండా ‘కాంతారా’ సినిమాను విడుదల చేశారంటూ కొందరు ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

కాపీ రైట్స్ సమస్యను పరిష్కరించుకొని కాంతారా సినిమాను ఓటీటీలో విడుదల చేయొచ్చు కదా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 4

థైక్కుడమ్ బ్రిడ్జ్ వాళ్లకు డబ్బులు చెల్లించి, క్రెడిట్ ఇచ్చి ‘వరాహరూపం’ పాటను మళ్లీ తీసుకురావాలని కొందరు కోరుతున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 5

భూత కోల ఆరాధన

ఫొటో సోర్స్, Twitter/Taran Adarsh

గతంలోనూ వివాదం

గతంలోనూ కాంతారా సినిమాలోని ‘భూత కోల’ కేంద్రంగా వివాదాలు ముసురుకున్నాయి. ‘భూత కోల’ ఆరాధన పద్ధతి హిందూ మతంలో భాగామా? కాదా? అనే దాని మీద నాడు చర్చ జరిగింది.

కాంతారా సినిమా దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి ఒక ఇంటర్వ్యూలో భాగంగా 'భూత కోల' అనేది 'హిందూ సంస్కృతి'లో భాగం అంటూ వ్యాఖ్యానించడం నాడు విమర్శలకు తావిచ్చింది.

'భూత కోల' అనేది 'హిందూ ధర్మం'లో భాగం కాదు అని కన్నడ నటుడు చేతన్ కుమార్ అనడంతో ఆయన మీద కేసు కూడా నమోదైంది.

ఇదొక ఆరాధన పద్ధతి. కర్ణాటకలోని దక్షిణ కన్నడ, ఉడుపి‌తో పాటు కేరళలోని కాసరగోడ్ తదితర ప్రాంతాలలోనూ ఇది ప్రధానంగా కనిపిస్తుంది. తులు సముదాయానికి చెందిన ప్రజలు 'భూత కోల' ఆరాధన ద్వారా స్థానిక దైవ శక్తులను ఆరాధిస్తారు.

నాట్యం ద్వారా దైవ శక్తులను ఆరాధించడం 'భూత కోల' పద్ధతిలో ప్రధానంగా ఉంటుంది.

భూతం అంటే శక్తి... కోల అంటే వేడుక లేదా ఆట.

'భయం వల్ల శక్తులను పూజించడం మొదలైంది. తమకు ప్రమాదకరంగా ఉన్న పులులు, పాములు అంటే మనిషికి భయం పెరిగింది.

అడవి పందులు పంటలను నాశనం చేయడం కూడా వారిలో భయాన్ని రేకెత్తించింది. అందుకే పులులు(పిలిచండి), అడవి పందుల(పంజుర్లి)ను ఆరాధించడం ప్రారంభించారు. తమ ప్రాణాలకు, పంటలకు రక్షణ కలిపించమని వేడుకున్నారు.

సముద్రం నుంచి కాపాడమని, పశువులను బాగా చూడమని, రోగాలకు దూరంగా ఉంచని ఇలా అనేక కోరికలతో శక్తులను ఆరాధించేవారు' అని భూత కోల నృత్యం చేసే అభిలాశ్ ఇండికా టుడే అనే వెబ్‌సైట్‌కు తెలిపారు.

నాలుగు శక్తులు’

అభిలాశ్ చౌతా చెప్పిన ప్రకారం... 'భూత కోల' ఆరాధన పద్ధతిలో ప్రధానంగా నాలుగు రకాల శక్తులు కనిపిస్తాయి.

ఒకటి మానవులు కేంద్రంగా ఉండే శక్తులు... ఇవి ప్రధానంగా భూస్వాముల అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల నుంచి వచ్చాయి. భూస్వాములను ఎదిరించిన వారిని దైవ శక్తులుగా కొలవడం ప్రారంభించారు. దీనికి ఉదాహరణ కోటి-చెన్నయ్య.

అన్యాయం, అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడిన వారిని కూడా ఆరాధిస్తారు. దీనికి ఉదాహరణ కల్కుడా-కల్లుర్తి.

రెండు జంతువుల కేంద్రంగా ఉండే శక్తులు... ఇవి ప్రధానంగా మనుషులకు, పంటలకు ప్రమాదకరంగా ఉండే జంతువుల ఆరాధన ఇందులో ఉంటుంది. అడవి పందులు(పంజుర్లి), ఎద్దులు(నందిగోన), పులులు(పిలిచండి).

మూడు ప్రకృతి కేంద్రంగా ఉండే శక్తులు... గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్నిని ఇందులో ఆరాధిస్తారు.

నాలుగు పురాణాల కేంద్రంగా ఉండే శక్తులు... వీరభద్ర, గులిగ వంటివి ఇందులో ఉంటాయి.

వరాహరూపం పాటపై కేసును కొట్టేసిన కోర్టు.. ఓటీటీలో థియేటర్ వెర్షన్ యాడ్ అవుతుందా?

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 6

కాగా, నవంబర్ 25వ తేదీ శుక్రవారం కేరళ కోర్టు వరాహరూపం పాట కాపీ అంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిందని ‘లైవ్ లా’ ట్వీట్ చేసింది.

అంటే పాటను తొలగించాలన్న గత ఉత్తర్వులు ఇప్పుడు అమలులో ఉండవు.

కానీ, ఈ విషయం తమ పరిధిలో లేదన్న కారణంతో కోర్టు కేసు కొట్టేసిందని తెలుస్తోంది.

మరి, స్థానిక కోర్టు తాజా తీర్పుపై ‘థైక్కుడమ్ బ్రిడ్జ్‌’ హైకోర్టుకు వెళుతుందా? ఈలోపు అమెజాన్ ప్రైమ్‌లో థియేటర్ వెర్షన్ కాంతారా ప్రదర్శన జరుగుతుందా? అన్న అంశాలపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)