Kantara BhootaKola : భూత కోల హిందూ సంస్కృతిలో భాగం కాదా? ఏమిటి ఈ వివాదం

కాంతారా సినిమా పోస్టర్

ఫొటో సోర్స్, Twiiter/Rishab Shetty

    • రచయిత, వరికూటి రామకృష్ణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కాంతారా సినిమా ఇంకా వార్తల్లోనే ఉంది. ఆ సినిమాలో చూపించిన 'భూత కోల' అనే ఆరాధన పద్ధతి చుట్టూ ఇప్పుడు వివాదం నడుస్తోంది.

'భూత కోల' అనేది 'హిందూ ధర్మం'లో భాగం కాదు అని వ్యాఖ్యానించిన కన్నడ నటుడు చేతన్ కుమార్ మీద తాజాగా కేసు నమోదైంది.

'విద్వేషాలను రెచ్చగొడుతున్నారు' అంటూ ఐపీసీ సెక్షన్ 505(2) కింద బెంగళూరు పోలీసులు కేసు బుక్ చేశారు.

అసలు చేతన్ కుమార్ ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారు?

కొద్ది రోజుల కిందట కాంతారా సినిమా దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి ఒక ఇంటర్వ్యూలో భాగంగా 'భూత కోల' అనేది 'హిందూ సంస్కృతి'లో భాగం అంటూ వ్యాఖ్యానించారు.

దానికి కౌంటర్‌గా అది 'హిందూ సంస్కృతి' కాదంటూ చేతన్ కుమార్ ట్వీట్ చేశారు.

60 ఏళ్లు దాటిన 'భూత కోల' కళాకారులకు నెలకు రూ.2,000 పెన్షన్ ఇస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ఈ నెల 20న ప్రకటించింది.

ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేస్తూ 'భూత కోల' అనేది 'హిందూ ధర్మం'లో భాగం అంటూ బెంగళూరు సెంట్రల్ ఎంపీ, బీజేపీ నేత పీసీ మోహన్ కూడా అన్నారు.

అలా 'భూత కోల' చుట్టూ వివాదం మొదలైంది.

కాంతారా సినిమాలో రిషబ్ శెట్టి

ఫొటో సోర్స్, Twitter/Rishab Shetty

రిషబ్ శెట్టి ఏమన్నారు?

కాంతారా సినిమా విడుదల సందర్భంగా ఇటీవల తమిళ ఫిలిం చానెల్ వికటన్‌తో రిషబ్ శెట్టి మాట్లాడారు. అందులో పంజుర్లి... అంటే అడవి పంది ఆకారంలోకి మారే ఒక దైవశక్తి గురించి ఆయనను ప్రశ్నించారు. 'హిందూ దైవం'గానే దాన్ని సినిమాలో చూపించారా అని అడిగారు.

ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తూ...'ఆ దేవతలు మన సంస్కృతిలో తప్పకుండా భాగమే. హిందూ సంస్కృతి, హిందూ సంప్రదాయాల్లో అది భాగమే. నేను హిందువుని కాబట్టి వాటిని నేను నమ్ముతాను, నా మతాన్ని నేను గౌరవిస్తాను.

ఇతరులు చెప్పేదాన్ని నేను తప్పు అనను. కానీ సినిమాలో మేం చూపించింది మాత్రం హిందూ ధర్మంలో ఉంది' అని రిషబ్ శెట్టి చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

కన్నడ నటుడు చేతన్ కుమార్

ఫొటో సోర్స్, Facebook/Chetan Kumar

చేతన్ కుమార్ ఏమన్నారు?

'భూత కోల' అనేది 'హిందూ ధర్మం'లో భాగం అంటూ రిషబ్ శెట్టి చేసిన వ్యాఖ్యలను కన్నడ నటుడు చేతన్ కుమార్ ఖండించారు.

'భూత కోల హిందూ ధర్మంలో భాగం అంటూ డైరెక్టర్ రిషబ్ శెట్టి చెప్పడమనేది అబద్ధం.

మా పంబడ లేదా పరవాల బహుజన సంపద్రాయాలు వైదిక బ్రాహ్మణ హిందుత్వం కన్నా ప్రాచీనమైనవి.

ఆదివాసీల సంస్కృతిని సినిమాలోనూ సినిమా బయట ఉన్నది ఉన్నట్లుగా చూపించాలని కోరుకుంటున్నాం' అంటూ చేతన్ కుమార్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

సోషల్ మీడియాలో వాదనలు

ఈ నేపథ్యంలో 'భూత కోల' అనేది 'హిందూ సంప్రదాయం'లో భాగమా? కాదా? అనే దాని మీద సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

కొందరు అది 'హిందూ సంస్కృతి'లో భాగమే అంటూ ఉంటే మరికొందరు 'కాదు' అని వాదిస్తున్నారు.

'భూత లేదా దైవ ఆరాధన అనేది మన పూర్వీకులను, శక్తులను, ప్రకృతిని ఆరాధించే ఆదివాసీ సంప్రదాయం.

సూర్యచంద్రుల మాదిరిగానే సత్యం, ధర్మం అనే వాటికి ఈ సంస్కృతిలో అత్యంత ప్రాధాన్యం ఉంటుంది.

ఇదంతా హిందూ సంప్రదాయమే' అంటూ కెప్టెన్ బ్రిజేష్ చౌతా అనే ట్విటర్ యూజర్ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

అయితే భూత కోల పద్ధతిని ‘బ్రాహ్మణులు చిన్న చూపు చూసేవారు’ అని తనకు ఇంటర్వ్యూల ద్వారా తెలిసిందని గ్రీష్మ కథార్ అనే జర్నలిస్టు అన్నారు. తాను చూసిన ఇంగ్లిష్ ఆర్కైవ్స్‌లో ఆ పద్ధతిని 'ఆటవికం' అంటూ పేర్కొన్నారని ఆమె పోస్టు చేశారు.

'భూత కోల పద్ధతిలో మాంసం వాడటాన్ని స్థానిక బ్రాహ్మణులు నీచంగా చూశారని నాకు తెలిసింది.

తులు జాతికి చెందని బ్రాహ్మణులు ఆదివాసీల పద్ధతుల్లో జోక్యం చేసుకోవడనేది చాలా వరకు లేదు. ఎందుకంటే ఈ పద్ధతిని వారు ‘గలీజు’గా చూశారు.

కానీ 1960ల తరువాత మార్పు వచ్చింది. ఆదివాసీలను లక్ష్యంగా చేసుకుంటూ ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థలు వెలిశాయి. అవి ప్రతిదానికి హిందూ గుర్తింపును ఇచ్చి హిందుత్వ కిందకు తీసుకు రావడం మొదలు పెట్టారు.

ఇది తులునాడులోనే కాదు అన్ని చోట్లా జరుగుతోంది’ గ్రీష్మా కథూర్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

భూత కోల

ఫొటో సోర్స్, Facebook/Smitha Rao

'భూత కోల' అంటే ఏంటి?

ఇదొక ఆరాధన పద్ధతి. కర్ణాటకలోని దక్షిణ కన్నడ, ఉడుపి‌తో పాటు కేరళలోని కాసరగోడ్ తదితర ప్రాంతాలలోనూ ఇది ప్రధానంగా కనిపిస్తుంది. తులు సముదాయానికి చెందిన ప్రజలు 'భూత కోల' ఆరాధన ద్వారా స్థానిక దైవ శక్తులను ఆరాధిస్తారు.

నాట్యం ద్వారా దైవ శక్తులను ఆరాధించడం 'భూత కోల' పద్ధతిలో ప్రధానంగా ఉంటుంది.

భూతం అంటే శక్తి... కోల అంటే వేడుక లేదా ఆట.

'భయం వల్ల శక్తులను పూజించడం మొదలైంది. తమకు ప్రమాదకరంగా ఉన్న పులులు, పాములు అంటే మనిషికి భయం పెరిగింది.

అడవి పందులు పంటలను నాశనం చేయడం కూడా వారిలో భయాన్ని రేకెత్తించింది. అందుకే పులులు(పిలిచండి), అడవి పందుల(పంజుర్లి)ను ఆరాధించడం ప్రారంభించారు. తమ ప్రాణాలకు, పంటలకు రక్షణ కలిపించమని వేడుకున్నారు.

సముద్రం నుంచి కాపాడమని, పశువులను బాగా చూడమని, రోగాలకు దూరంగా ఉంచని ఇలా అనేక కోరికలతో శక్తులను ఆరాధించేవారు' అని భూత కోల నృత్యం చేసే అభిలాశ్ ఇండికా టుడే అనే వెబ్‌సైట్‌కు తెలిపారు.

నాలుగు శక్తులు’

అభిలాశ్ చౌతా చెప్పిన ప్రకారం... 'భూత కోల' ఆరాధన పద్ధతిలో ప్రధానంగా నాలుగు రకాల శక్తులు కనిపిస్తాయి.

ఒకటి మానవులు కేంద్రంగా ఉండే శక్తులు... ఇవి ప్రధానంగా భూస్వాముల అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల నుంచి వచ్చాయి. భూస్వాములను ఎదిరించిన వారిని దైవ శక్తులుగా కొలవడం ప్రారంభించారు. దీనికి ఉదాహరణ కోటి-చెన్నయ్య.

అన్యాయం, అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడిన వారిని కూడా ఆరాధిస్తారు. దీనికి ఉదాహరణ కల్కుడా-కల్లుర్తి.

రెండు జంతువుల కేంద్రంగా ఉండే శక్తులు... ఇవి ప్రధానంగా మనుషులకు, పంటలకు ప్రమాదకరంగా ఉండే జంతువుల ఆరాధన ఇందులో ఉంటుంది. అడవి పందులు(పంజుర్లి), ఎద్దులు(నందిగోన), పులులు(పిలిచండి).

మూడు ప్రకృతి కేంద్రంగా ఉండే శక్తులు... గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్నిని ఇందులో ఆరాధిస్తారు.

నాలుగు పురాణాల కేంద్రంగా ఉండే శక్తులు... వీరభద్ర, గులిగ వంటివి ఇందులో ఉంటాయి.

ఆదిపురుష్‌లో ప్రభాస్

ఫొటో సోర్స్, Facebook/Prabhas

పొన్నియన్ సెల్వన్, ఆదిపురుష్‌లపైనా విమర్శలు

ఇటీవలే విడుదలైన పొన్నియన్ సెల్వన్-1 చిత్రంలో ప్రధాన పాత్ర రాజరాజ చోళుడు కేంద్రంగా కూడా వివాదం తలెత్తింది.

రాజరాజ చోళున్ని హిందువుగా చూపించారని, కానీ ఆయన కాలంలో హిందూ మతం లేదని తమిళ దర్శకుడు వెట్రిమారన్ అనడం చర్చనీయాంశమైంది. ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా ఆయన వ్యాఖ్యలను సమర్థించారు.

అయితే కొందరు వెట్రిమారన్ వ్యాఖ్యలను ఖండించారు. గొప్పగొప్ప దేవాలయాలు నిర్మించిన రాజరాజ చోళుడు హిందువు కాక మరేం అవుతారని ప్రశ్నించారు.

అలాగే 'ఆదిపురుష్' సినిమా టీజర్‌లో రాముడు, రావణాసురుడు, ఆంజనేయుడు పాత్రలను చిత్రీకరించిన తీరు మీద కూడా విమర్శలు వచ్చాయి.

వీడియో క్యాప్షన్, కాంతార మూవీ రివ్యూ: ఒక హీరోకి ఈ కథ చెప్పి ఒప్పించడం కష్టం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)