జనగామ జిల్లా: స్కూలు పిల్లలే నిర్వహిస్తున్న ‘స్కూల్ బ్యాంక్ ఆఫ్ చిల్పూర్‌’

వీడియో క్యాప్షన్, విద్యార్థుల్లో బ్యాంకింగ్‌పై అవగాహన కల్పించే ప్రయత్నమన్న పాఠశాల యాజమాన్యం
జనగామ జిల్లా: స్కూలు పిల్లలే నిర్వహిస్తున్న ‘స్కూల్ బ్యాంక్ ఆఫ్ చిల్పూర్‌’
    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

జనగామ జిల్లా చిల్పూర్ జెడ్పీ హైస్కూల్ లో విద్యార్థులకోసం విద్యార్థులే నిర్వహిస్తున్న ‘స్కూల్ బ్యాంక్ ఆఫ్ చిల్పూర్’ ఇది. ఈ బ్యాంక్ నిర్వహణ అంతా ఇక్కడి గర్ల్స్ స్టూడెంట్స్ చేతులమీదుగా జరుగుతోంది.

పాఠ్యపుస్తకాల్లోని బ్యాంకింగ్ పాఠాలపై ప్రయోగాత్మక అవగాహన కల్పించడం ఈ స్కూల్ బ్యాంక్ ఏర్పాటు ఉద్దేశ్యమని చిల్పూర్ హైస్కూల్ టీచర్స్ చెబుతున్నారు.

స్కూల్ పనిదినాల్లో ప్రతి రోజూ మూడు సార్లు ఈ బ్యాంక్ పనిచేస్తుంది.

స్కూల్ బ్యాంక్ ఆఫ్ చిల్పూర్ లో విద్యార్థుల డిపాజిట్ డబ్బులను ఈ స్కూల్ పేరుమీద తెరిచిన స్థానిక పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతా లో జమ చేస్తున్నారు.

స్కూలు పిల్లలే నిర్వహిస్తున్న ‘స్కూల్ బ్యాంక్ ఆఫ్ చిల్పూర్‌’
ఫొటో క్యాప్షన్, నెల రోజుల్లోపే రూ.32 వేలు ఈ బ్యాంకులో జమ అయ్యాయని టీచర్లు చెప్పారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)