రాజమౌళి: ఎన్‌వైఎఫ్‌సీ ఉత్తమ దర్శకునిగా ఆర్ఆర్ఆర్ డైరెక్టర్

రాజమౌళి దంపతులు

ఫొటో సోర్స్, S S Karthikeya/Twitter

ఆర్ఆర్ఆర్ మూవీ మరొకసారి వార్తల్లో నిలిచింది. ఇందుకు ప్రధానంగా మూడు కారణాలున్నాయి.

ఒకటి... న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ నుంచి ఉత్తమ దర్శకుడు అవార్డును రాజమౌళి అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను ఆయనకు ఈ అవార్డు వచ్చింది.

జూనియర్ ఎన్టీఆర్

ఫొటో సోర్స్, RRR Movie/Facebook

రెండు... ఉత్తమ నటునిగా ఆస్కార్ అవార్డు పొందగల నటుల జాబితాను హాలీవుడ్ ఫిలిం మ్యాగజైన్ వెరైటీ విడుదల చేసింది. అందులో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో నటనకు గాను ఆయనకు ఆస్కార్ అవార్డు రావొచ్చని వెరైటీ మ్యాగజైన్ అంచనా వేస్తోంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

మూడు... అమెరికాలోని లాస్ ఏంజలీస్‌లో గల అతి పెద్ద ‘ఐమ్యాక్స్’ టీసీఎల్ చైనీస్ థియేటర్‌లో ఆర్ఆర్‌ఆర్‌ను త్వరలోనే ప్రదర్శించనున్నారు. మొత్తం సీటింగ్ సామర్థ్యం 932 కాగా... 98 సెకండ్లలో అన్ని టికెట్లు అమ్ముడు పోయినట్లు ఆర్ఆర్ఆర్ సినిమా బృందం వెల్లడించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

ఇంతేకాదు ఈ నెల 11న గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుక జరగనుంది. ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో ఆర్ఆర్ఆర్ సినిమా నామినేట్ అయింది. అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటునాటు’ పాట నామినేట్ అయినట్లు నాడు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ జ్యూరీ ప్రకటించింది.

ఇక సినిమా రంగంలో అత్యున్నత అవార్డులుగా పరిగణించే ఆస్కార్‌కు సైతం ఆర్ఆర్ఆర్ సినిమా నామినేట్ అయింది. బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ‘నాటునాటు’ పాట ఆస్కార్ బరిలో నిలిచింది. ఈ ఏడాది మార్చిలో ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది.

గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక కోసం అమెరికాలోని లాస్ ఏంజలీస్‌కు బయలుదేరినట్లు నటుడు రామ్‌చరణ్ భార్య కొణిదెల ఉపాసన ట్విటర్ ద్వారా తెలిపారు. న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డు తీసుకున్న రాజమౌళి ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)