చిరంజీవి: ‘2024 ఎన్నికల్లో నేను ప్రేక్షకుడిని మాత్రమే’

సినిమాలతో బిజీగా గడుపుతూ రాజకీయంగా ప్రేక్షకుడిగా ఉండడం తప్ప అంతకుమించి తానేమీ చేయదలచుకోలేదని నటుడు చిరంజీవి అన్నారు.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. మొదలైన హాకీ వరల్డ్ కప్ ప్రారంభ వేడుకలు

    హాకీ వరల్డ్ కప్ ప్రారంభ వేడుకలు

    ఫొటో సోర్స్, Odisha Sports/Twitter

    ఒడిశాలో హాకీ వరల్డ్ కప్ ప్రారంభ వేడుకలు మొదలయ్యాయి.

    కటక్‌లోని బరబాటీ స్టేడియంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి.

    బాలీవుడ్ నటులు రణ్‌వీర్ సింగ్, దిశా పటానీ, సంగీత దర్శకుడు ప్రీతం, సింగర్ నీతి మోహన్, సింగర్ బెన్నీ దయాల్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

    ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ కూడా హాజరయ్యారు.

    మెన్స్ హాకీ వరల్డ్ కప్-2023 ఈ నెల 13 నుంచి 29 వరకు జరగనుంది.

  3. బ్రేకింగ్ న్యూస్, అఫ్గానిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి... సుమారు 20 మంది మృతి

    బ్రేకింగ్ న్యూస్

    అఫ్గానిస్తాన్‌లోని విదేశాంగశాఖ కార్యాలయం వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో సుమారు 20 మంది చనిపోయారని తాలిబాన్ పాలకులు వెల్లడించింది.

    ప్రస్తుతం ఈ దాడికి ఏ సంస్థా బాధ్యతను తీసుకోలేదు.

    గత కొంతకాలంగా అఫ్గానిస్తాన్‌లో జరిగిన అనేక దాడులకు ఇస్లామిక్ స్టేట్ బాధ్యత తీసుకుంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. షమీమా బేగం: 15 ఏళ్ల వయసులో సిరియాకు పారిపోయి ఇస్లామిక్ స్టేట్ గ్రూపులో చేరిన యువతి.. ఇప్పుడు ఏమంటున్నారు?

  5. విశాఖపట్నంలో వందే భారత్ రైలు మీద రాళ్ల దాడి

    ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో వందే భారత్ రైలు మీద రాళ్లు విసిరారు.

    ప్రధానమంత్రి నరేంద్రమోదీ జనవరి 19వ తేదీన ఈ రైలును లాంఛనంగా ప్రారంభించాల్సి ఉంది.

    ట్రయల్ రన్ కోసం విశాఖ వచ్చిన వందే భారత్ ఎక్స్ప్రెస్ పై కొందరు ఆకతాయిలు రాళ్లు దాడి చేశారని రైల్వే ఎన్‌సీసీ విభాగం అధికారులు తెలిపారు.

    ప్రస్తుతం వందే భారత్ విశాఖ ఎన్‌సీసీ ప్రాంగణంలోనే ఉందని చెప్పారు.

    దీనిపై రామ్మూర్తి పంతులుపేట లేదా కంచరపాలెంకు చెందిన వ్యక్తులు రాళ్లు విసిరి ఉంటారని, దీనిపై దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.

    వందే భారత్ రైలులోని ఒ బోగీ అద్దం దెబ్బతిన్నదని డివిజనల్ రైల్వే మేనేజర్ తెలిపారు.

    వందే భారత్ రైలు
    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  6. మెగలొడాన్: తిమింగలాలనే మింగేసే అతి పెద్ద షార్క్.. ఆ సొరచేప కోరను వెదికి పట్టుకున్న 9 ఏళ్ల బాలిక

  7. చిరంజీవి: ‘2024 ఎన్నికల్లో నేను ప్రేక్షకుడిని మాత్రమే’

    నటుడు చిరంజీవి

    ఫొటో సోర్స్, Twitter/Bobby

    సినిమాలతో బిజీగా గడుపుతూ రాజకీయంగా ప్రేక్షకుడిగా ఉండడం తప్ప అంతకుమించి తానేమీ చేయదలచుకోలేదని నటుడు చిరంజీవి అన్నారు.

    ఆయన నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా విడుదల సందర్భంగా మీడియా చానెళ్లతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

    ‘ప్రస్తుతం నిత్యం పనిచేసుకుంటూ విరామం లేకుండా ముందుకు సాగుతున్నా. ఫ్యాన్స్ కూడా నా సినిమాలు చూస్తూ మరింత బిజీగా ఉండాలని కోరుకుంటున్నా. నన్ను సోదరుడిగా చూసిన జగన్‌కు కృతజ్ఞుడిగా ఉంటా. ఈ సమయంలో నేను ప్రేక్షకుడిని మాత్రమే.

    నేను పక్క రాష్ట్రంలో ఉంటున్నా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను నేను పెద్దగా ఫాలో కావడం లేదు’ అని చిరంజీవి అన్నారు.

    2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.

    2012లో రాజ్యసభకు ఎన్నికై, కేంద్రంలో పర్యాటక మంత్రిగానూ పనిచేశారు. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత రాజకీయాల్లో చిరంజీవి స్తబ్దుగా ఉంటూ వచ్చారు. రాజ్యసభ పదవీకాలం ముగిసిన తర్వాత దాదాపుగా రాజకీయాలకు దూరమయ్యారు.

  8. అమెరికా: సాంకేతిక లోపంతో వందల విమానాలు రద్దు

    టేకాఫ్ అవుతున్న విమానం

    ఫొటో సోర్స్, MSP Airport/Twitter

    ఫొటో క్యాప్షన్, (ఫైల్ ఫొటో)

    అమెరికాలో సాంకేతిక లోపం కారణంగా వందల విమానాలు రద్దయ్యాయని వార్తలు వస్తున్నాయి.

    విమానప్రయాణాలను నియంత్రించే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌ఏఏ)‌కు చెందిన ‘నోటిస్ టు ఎయిర్ మిషన్స్’(నోటమ్) అనే వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడం ఇందుకు కారణం.

    విమానసర్వీసులను ట్రాక్ చేసే ‘ఫ్లైట్ అవేర్’ ప్రకారం ఇప్పటి వరకు అమెరికా వ్యాప్తంగా సుమారు 400 విమాన సర్వీసులు రద్దు అయినట్లు అంచనా. 1,150 విమానాలు ఆలస్యం అయ్యాయి.

    ‘నోటమ్’ వ్యవస్థ ద్వారా విమాన పైలెట్స్‌కు ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తుంటారు.

    నోటమ్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని ఎఫ్‌ఏఏ తెలిపింది. కొంత మేరకు నోటమ్ పని చేస్తోందని, అయితే ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదని తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. క్లిటొరొమెగాలీ: యోనిలో క్లిటోరిస్ సైజును సర్జరీతో తగ్గించుకున్న ఓ యువతి కథ

  10. తెలంగాణ సీఎస్‌గా శాంతి కుమారి

    ముఖ్యమంత్రి కేసీఆర్‌తో శాంతి కుమారి

    ఫొటో సోర్స్, Telangana CMO

    తెలంగాణ ముఖ్యకార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి శాంతికుమారి నియమితులయ్యారు.

    1989 బ్యాచ్‌కు చెందిన శాంతికుమారి ప్రస్తుతం అటవీ, పర్యావరణశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

    అయితే మరొక సీనియర్ ఐఏఎస్ అధికారి రామకృష్ణరావు సీఎస్ అవుతారంటూ వార్తలు వచ్చాయి. కానీ చివరకు శాంతికుమారిని ప్రభుత్వం సీఎస్‌గా నియమించింది.

    నిన్నటి వరకు సీఎస్‌గా ఉన్న సోమేశ్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోవాలంటూ హై కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి.

    రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం కేటాయించింది. అయితే కేంద్రం నిర్ణయాన్ని ఆయన క్యాట్‌లో సవాలు చేశారు. నాడు సోమేశ్ కుమార్ తెలంగాణలోనే ఉండేలా క్యాట్ ఆదేశాలు జారీ చేసింది.

    ఆ తరువాత క్యాట్ ఉత్తర్వుల మీద కేంద్రం హై కోర్టుకు వెళ్లింది. విచారణలో ఉన్న ఈ కేసు మీద నిన్న హై కోర్టు తీర్పునిచ్చింది.

    ఉత్తర్వులు

    ఫొటో సోర్స్, Telangana CMO

  11. తెలంగాణ కొత్త చీఫ్ సెక్రటరీగా రామకృష్ణారావు?

    ఐఏఎస్ రామకృష్ణారావు

    ఫొటో సోర్స్, UGC

    తెలంగాణ కొత్త చీఫ్ సెక్రటరీగా ఐఏఎస్ రామకృష్ణారావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

    ఆయన పేరుతోపాటు శాంతి కుమారి. రజత్ కుమార్. అరవింద్ కుమార్ పేర్లు కూడా వినిపించాయి.

    తెలంగాణ వచ్చినప్పటి నుంచీ ఆర్థిక శాఖను రామకృష్ణా రావే చూస్తున్నారు. ఆయన కేసీఆర్‌కు సన్నిహితుడే కాకుండా, సీనియర్ల జాబితాలో ఒకే ఒక్క తెలంగాణ వ్యక్తి రామకృష్ణా రావు.

    మరో ఐఏఎస్ రాణి కుముదిని పేరు కూడా వినిపించినప్పటికీ, సీనియర్ అయినా సర్వీస్ లేకపోవడంతో ఆమెను రామకృష్ణ రావుకు ఇంఛార్జ్ సీఎస్‌గా నియమించే అవకాశం ఉంది.

    నిన్నటి వరకు తెలంగాణకు చీఫ్ సెక్రటరీగా వ్యవహరించిన సోమేశ్ కుమార్ ఆంధ్రప్రదేశ్‌కు సీఎస్‌గా వెళ్లాలని హైకోర్టు తీర్పునించ్చింది.

  12. RRR: 'నాటు నాటు' పాటకు గోల్డెన్ గ్లోబ్ 2023 అవార్డ్

    RRR

    ఫొటో సోర్స్, RRR movie

    ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ 2023 అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డ్ లభించింది.

    జనవరి 11న లాస్ ఏంజిల్స్‌లో 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుక జరిగింది. ఈ వేడుకకు రాజమౌళి, కీరవాణి, జూ. ఎన్‌టీఆర్, రామ్ చరణ్, రమా రాజమౌళి హాజరయ్యారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది