కైకాల సత్యనారాయణ: ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్ వంటి హీరోలతో తెరపై పోరాడిన విలన్

కైకాల సత్యనారాయణ

ఫొటో సోర్స్, Twitter

    • రచయిత, ఎస్.వి. సూర్యప్రకాశరావు
    • హోదా, సీనియర్ జర్నలిస్ట్, బీబీసీ కోసం

తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన మరొక మహోజ్వల నట శిఖరం కనుమరుగయింది. సుమారు 70 సంవత్సరాలు ప్రముఖంగా తెలుగు సినీరంగాన్ని ప్రభావితం చేసిన కైకాల సత్యనారాయణ ఈ రోజు కన్ను మూయటంతో తెలుగు సినీ రంగ చరిత్రలో ఎన్‌టీఆర్ ఏఎన్ఆర్ తరంతో మొదలైన అధ్యాయం ముగిసింది.

ఆ తరంలోనే సూపర్ స్టార్ కృష్ణ మరణించిన విషాదం నుంచి ఇంకా చిత్ర పరిశ్రమ తేరుకోకముందే కైకాల సత్యనారాయణ కూడా ఈ జీవిత రంగం నుంచి నిష్క్రమించారు. సినీ రంగంలో నటులకు సంబంధించిన స్వర్ణయుగం ముగిసింది.

ఎందుకంటే కళ కోసం నటన మీద అనురక్తితో సినీ రంగ ప్రవేశం కోసం కొన్ని విలువలకు కట్టుబడి ఉదాత్తమైన పాత్రలు పోషించిన అగ్ర నటుల శకం అది. కృష్ణా జిల్లా కౌతవరంలో 1935లో జన్మించిన సత్యనారాయణ నవరసాలను అద్భుతంగా పోషించిన బ్రిలియంట్ యాక్టర్.

బ్రిలియంట్ ఎలా అంటే ఒక పాత్రను అధ్యయనం చేసి, సంభాషణలను స్వచ్ఛమైన ఉచ్చారణతో రక్తి కట్టించగలిగిన మహా నటుల కోవలో సత్యనారాయణ అగ్రశ్రేణికి చెందిన వారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

డీఎల్ నారాయణ నిర్మాణంలో సిపాయి కూతురు చిత్రంలో హీరోగా రంగ ప్రవేశం చేసినా ఆయన హీరోగా కొనసాగాలేకపోయారు. కానీ విలన్‌లలో హీరోగా తరువాత గుణచిత్ర నటుడి (charactor artist) గా హీరోలతో సమానమైన గుర్తింపు పొందిన నటుడు సత్యనారాయణ.

కృష్ణంరాజు, చిరంజీవి వంటి నటులు హీరోలుగా రాణించినా.. హీరోగా ప్రవేశించిన సత్యనారాయణకు హీరోగా అవకాశాలు రాని అగ్రనటుల ప్రభంజన యుగం అది. హీరోలుగా మేమిద్దరం ఉన్నాం కదా నువ్వు విలన్‌గా ప్రయత్నించు అని అక్కినేని నాగేశ్వరరావు తనకు సలహా ఇచ్చారని సత్యనారాయణ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

సత్యనారాయణ పేరు చెబితే హీరోయిన్‌లను భయపెట్టే విలన్ పాత్రలు, కృష్ణ పాత్రలో నటిస్తున్న ఎన్‌టీఆర్‌ను ఎదుర్కొనే దుర్యోధనుడు, దుష్ట నాయకుడు, సైంధవుడు వంటి పాత్రలు గుర్తుకు వస్తాయి.

కరుణ రసానికి పెద్ద పీట వేస్తూ సంసారసాగరం, శారద వంటి చిత్రాలలో ఎన్నో పాత్రలు చేశారు. తాయారమ్మ బంగారయ్య, పార్వతీ పరమేశ్వరులు, యమగోల, యమలీల, వంటి చిత్రాలలో హాస్యరసం స్ఫురణకు వస్తాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

హిందీ జంజీర్‌లో ప్రాణ్ పోషించిన పాత్రను తెలుగు నిప్పులాంటి మనిషిలో సత్యనారాయణ అద్భుతంగా పోషించారు. ప్రాణ్ తనను స్వయంగా అభినందించారని సత్యనారాయణ ఒకసారి చెప్పారు.

చిరంజీవి హీరోగా రమా ఫిల్మ్స్ పతాకం కింద ఆయన తమ్ముడు నిర్మించిన కొదమ సింహంలో ప్రాణ్ చేత ఒక మంచి పాత్ర ధరింపజేసి ఆయన పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు సత్యనారాయణ.

ఎస్‌వీ రంగారావు తరువాత సత్యనారాయణే గుణచిత్రపాత్రలకు దిక్కయ్యారు. అయితే ఎస్‌వీ రంగారావు ప్రభావం తనమీద రాకుండా తన సొంత శైలిని అలవరుచుకోవటం, ఆయనను తిరుగులేని నటుడుగా చిత్రారాంగాన్ని ఏలటానికి దోహదపడింది.

చిత్రరంగంలో ఉంటూనే 1996లో పార్లమెంటు సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

సినిమాల్లో ఎన్‌టీఆర్‌తో విలన్‌గా నటించినా ఆయనకు, ఆయన కుటుంబానికి అత్యంత ఆప్తులయారు. దానవీర శూర కర్ణ, కురుక్షేత్రం చిత్రాలని ఎన్‌టీఆర్, కృష్ణ పోటాపోటీగా తీసినప్పుడు రెండు చిత్రాలలో నటించిన ఏకైక నటుడు సత్యనారాయణే.

దానవీర శూరకర్ణలో భీముడు, కురుక్షేత్రంలో దుర్యోధనుడు పాత్రాలను అద్భుతంగా పోషించారు.

ఒకసారి మద్రాసులో నిజమైన రౌడీలు ఆయనను బెదిరించినప్పుడు ఎలా తెలివిగా తప్పించుకున్నది ఒక ఇంటర్వ్యూలో వివరించారు.

ఇప్పటికీ తన పాత్రల సంభాషణలు గుర్తుపెట్టుకుని చెప్పగలిగే నటుడు ఆయన. ఒక ఎన్‌టీఆర్, ఒక ఏఎన్‌ఆర్, ఒక ఘంటసాల ఎలాగో ఒకే ఒక సత్యనారాయణ అంతే.

నోట్: అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం.

ఇవి కూడా చదవండి: