Ben Affleck, Jennifer Lopez: 2003లో నిశ్చితార్థం చేసుకున్న జెన్నిఫర్ లోపెజ్, బెన్ ఆఫ్లెక్.. 19 ఏళ్ల తర్వాత పెళ్లి

బెన్ ఆఫ్లెక్, జెన్నిఫర్ లోపెజ్

ఫొటో సోర్స్, Reuters

హాలీవుడ్ తారలు జెన్నిఫర్ లోపెజ్, బెన్ ఆఫ్లెక్ లాస్‌వేగస్‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని లోపెజ్ ధ్రువీకరించారు.

‘‘మేం పెళ్లి చేసుకున్నాం. ప్రేమ ఎంతో అందమైనది. మధురమైనది. మేం ఈ క్షణాల కోసం ఎంతో ఎదురుచూశాం’’అని తన అభిమానుల వెబ్‌సైట్ ఆన్‌దజేఎల్‌వోలో ఆమె రాసుకొచ్చారు.

2003లోనే వీరిద్దరికీ మొదట నిశ్చితార్థమైంది. అయితే, 2004 జనవరిలో దీన్ని రద్దు చేసుకున్నారు.

వీరిద్దరూ మళ్లీ కలవబోతున్నారని గత ఏడాది తెలియడంతో అభిమానులు వేడుక చేసుకున్నారు. వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు ప్రేమను వ్యక్తంచేసేవారు.

బెన్ ఆఫ్లెక్, జెన్నిఫర్ లోపెజ్

ఫొటో సోర్స్, Getty Images

పేరు మార్పు..

పెళ్లి తర్వాత జెన్నిఫర్ లోపెజ్ తన పేరును ‘‘జెన్నిఫర్ ఆఫ్లెక్’’గా మార్చుకోవాలని భావించినట్లు నెవాడాలోని క్లార్క్ కౌంటీ క్లర్క్స్ ఆఫీస్ రికార్డుల్లో ఉంది.

పెళ్లి కోసం గత శనివారం వీరు లాస్‌వేగస్‌కు వెళ్లినట్లు ఆన్‌దజేఎల్‌వోలో జెన్నిఫర్ లోపెజ్ చెప్పారు. మరో నాలుగు జంటలతో కలిసి పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు.

‘‘మనకు కావాల్సింది ప్రేమ మాత్రమేనని వారంతా చెప్పారు. అది నిజమే కదా’’అని ఆమె అన్నారు.

‘‘అలాంటి ప్రేమ కావాల్సినంత దొరకడం చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఐదుగురు అద్భుతమైన పిల్లలతో జీవితం ఊహించుకుంటే చాలా గొప్పగా అనిపిస్తోంది. ఇలాంటి జీవితం కోసమే నేను ఎదురుచూస్తున్నా’’అని ఆమె చెప్పారు.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది

జెన్నిఫర్ పెళ్లి బట్టల్లో మురిసిపోతున్న ఫోటోను ఆమె హెయిర్ డ్రెస్సర్ క్రిస్ ఆపిల్టన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

మరోవైపు పెళ్లి తర్వాత ఉంగరాన్ని చూపిస్తూ జెన్నిఫర్ కూడా ఒక సెల్ఫీని పోస్ట్ చేశారు.

వీడియో క్యాప్షన్, విల్ స్మిత్ భార్యకు వచ్చిన 'జుట్టు రాలిపోయే జబ్బు' అలపీషియా లక్షణాలేంటి?

ఎలా కలిశారు?

ఈ జంటను అభిమానులు బెన్నిఫర్‌గా పిలుస్తుంటారు. వీరు మొదట 2002లో గిగ్లీ సినిమా సెట్స్‌పై కలిశారు. 2003లో వీరికి నిశ్చితార్ధమైంది. అయితే, విపరీతంగా ఈ జంట మీడియా దృష్టికి ఆకర్షించింది. ఆ తర్వాత ఏడాదికే తాము విడిపోతున్నట్లు వీరు ప్రకటించారు.

అయితే, మళ్లీ కలిసిన తరువాత వీరు తరచూ ఆన్‌లైన్‌లో ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. దీంతో బెన్నిఫర్ 2.0గా అభిమానులు వీరిని పిలవడం మొదలుపెట్టారు.

ఇది జెన్నిఫర్ నాలుగో పెళ్లి. చివరగా ఆమె గాయకుడు మార్క్ ఆంటొనీ (2004 నుంచి 2014)ని పెళ్లి చేసుకున్నారు. వీరికి కవలలు జన్మించారు.

మరోవైపు బెన్ ఆఫ్లెక్ కూడా జెన్నిఫర్ గార్నర్(2005 నుంచి 2018)ను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)