కిమ్ కర్దాషియన్: తల్లి సెక్స్‌ టేప్‌ ప్రకటన చూసిన ఆరేళ్ల కొడుకు.. ఆ తర్వాత..

కిమ్ కర్దాషియన్‌కు టాబ్లెట్ స్క్రీన్ చూపుతున్న సెయింట్ వెస్ట్

ఫొటో సోర్స్, 'KARDASHIANS', FULWELL 73

ఫొటో క్యాప్షన్, షోలో సెయింట్ వెస్ట్ తనకు కనిపించిన రోబ్లాక్స్ సెక్స్ టేప్ రూమ్‌ను తన తల్లికి చూపుతున్న దృశ్యం
    • రచయిత, జో టైడీ
    • హోదా, సైబర్ రిపోర్టర్

అమెరికాలో పాపులర్ నటి, సెలెబ్రిటీ కిమ్ కర్దాషియన్‌ సెక్స్ టేప్ ప్రకటన ఒకదానిని ఆమె కుమారుడు అనుకోకుండా చూడటం, దానిని తీసుకెళ్లి తన తల్లికే చూపించడం, ఇదంతా ఒక రియాలిటీ షోలో ప్రసారం కావడం చర్చనీయాంశం అయ్యింది. ఇదంతా రియాలిటీ షోలో భాగంగా చేశారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే, ఈ రియాలిటీ షో సీన్‌ ఫేక్ కాదని కర్దాషియన్ సన్నిహిత వర్గాలు చెప్పాయి.

రోబ్లాక్స్ గేమ్‌ ఆడుకుంటుండగా కిమ్ కర్దాషియాన్ కొడుకు సెయింట్ వెస్ట్‌కు తల్లి ఫొటోతో ఒక సెక్స్ టేప్ అడ్వర్టైజ్‌మెంట్‌ కనిపించింది.

ఆ సీన్‌లో ఆరేళ్ల వయసున్న సెయింట్ వెస్ట్.. అనుకోకుండా కనిపించిన 'కిమ్ కర్దాషియన్ ఎక్స్‌పీరియెన్స్' రూమ్‌ను తన తల్లికి చూపుతాడు.

ఆ రూమ్‌ను తాము తొలగించామని, దానిని సృష్టించిన వ్యక్తిని నిషేధించామని, ఎలాంటి సెక్స్ టేప్ అక్కడ లేదని రోబ్లాక్స్ చెప్పింది.

ఆ రూమ్ లైవ్‌లో ఉన్న అతి కొద్ది సమయంలో కేవలం ఒక డజను మంది ప్లేయర్లు మాత్రమే దానిని కనుగొన్నారని కూడా ఆ సంస్థ పేర్కొంది.

వీడియో క్యాప్షన్, యాంకర్ సుమను ఎలాంటి ఆధారం లేకుండా బీఎస్ రెడ్డి ఎలా గాల్లో నిలబెట్టారు?

'యాక్టివ్‌గా సెర్చ్ చేశారు'

ఆ రూమ్‌ను కనుగొన్న వారిలో సెయింట్ వెస్ట్ ఒకరుగా ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని సోషల్ మీడియా పోస్టుల్లోనూ, కొన్ని వార్తా కథనాల్లోనూ కొందరు అభిప్రాయపడ్డారు.

జోంబాడీ అనే బాగా తెలిసిన, స్వతంత్ర రోబ్లాక్స్ డెవలపర్ బీబీసీతో మాట్లాడుతూ.. ''అలాంటి గేమ్‌ 'అనుకోకుండా' తారసపడే అవకాశం అత్యంత స్పల్పం'' అని చెప్పారు.

''అటువంటి గేమ్‌ సెయింట్‌కు తారసపడటానికి రెండు అవకాశాలున్నాయి. అతడు కానీ, అతడి కుటుంబం కానీ అలాంటి గేమ్ కోసం యాక్టివ్‌గా సెర్చ్ చేసి ఉండటం, లేదంటే ఆ రూమ్‌నే సృష్టించి ఉండటం ఒకటి. వారి సహచరుల బృందంలో ఎవరో ఒకరు ఆ రూమ్‌ను సృష్టించి, దానిని నేరుగా ఆ బాలుడికి షేర్ చేసి ఉండటం మరొకటి'' అని విశ్లేషించారు.

కర్దాషియన్లు కానీ, ప్రొడక్షన్ కంపెనీ అయిన ఫుల్‌వెల్ 73 కానీ దీనిపై అధికారికంగా స్పందించలేదు. కానీ కర్దాషియన్ కుటుంబానికి సన్నిహితులైన ఒకరు.. అది నకిలీ సీన్‌ కాదని గట్టిగా చెప్పారు.

కిమ్ కర్దాషియన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కిమ్ కర్దాషియన్ తన కొత్త షో ఫస్ట్ ఎపిసోడ్ విజయంవతం కావటం పట్ల ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు

రోబ్లాక్స్‌.. రోజూ 5 కోట్ల మంది ప్లేయర్లు

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజూ 5 కోట్ల మంది ప్లేయర్లు ఎక్స్‌ప్లోర్ చేయటానికి, మినీ గేమ్స్ ఆడటానికి, తమ సొంత ఎక్స్‌పీరియెన్స్‌లు క్రియేట్ చేయటానికి రోబ్లాక్స్‌లో లాగిన్ అవుతుంటారు.

ప్లేయర్లు సృష్టించిన ఎక్స్‌పీరియెన్స్‌లు, మినీ గేమ్‌లు లక్షలాదిగా ఉన్నాయి. ప్రతి రోజూ కొత్త ఫీచర్లు యాడ్ అవుతుంటాయి.

అత్యంత పాపులర్ ఎక్స్‌పీరియన్స్‌లను రోబ్లాక్స్ ప్లేయర్లకు హోం స్క్రీన్ ద్వారా చూపుతారు. మిగతా ఎక్స్‌పీరియెన్స్‌ను సెర్చ్ బటన్ ద్వారా వెదికి పట్టుకోవచ్చు.

ఈ జోన్లలో అత్యధిక జోన్లను ప్లేయర్లకు అడ్వర్టైజ్ చేయరు. వాటికి ఎక్కువగా విజిటర్లూ రారు.

సుదీర్ఘ కాలంగా నడుస్తున్న 'కీప్ అప్ విత్ ది కర్దాషియన్స్' రియాలిటీ షోను పునఃప్రారంభిస్తూ కొత్తగా ప్రారంభించిన 'ద కర్దాషియన్స్' షో ఫస్ట్ ఎపిసోడ్‌లోని డ్రామాకు.. సెయింట్ వెస్ట్ ఈ రోబ్లాక్స్ రూమ్‌ని కనుక్కోవటం కేంద్ర బిందువుగా ఉంది.

టాబ్లెట్ స్క్రీన్‌ని బ్లర్ చేశారు. అయితే తనకు ఏం కనిపించిందనే దానిని కిమ్ కర్దాషియన్ ఒక ఇంటర్వ్యూయర్‌కు వివరిస్తారు: ''నా ఏడుపు ముఖం ఫొటో ఉంది. దానివైపు చూసినపుడు 'కిమ్ కొత్త సెక్స్ టేప్' అనే అసలు ఏమాత్రం తగనిదేదో చెప్తోంది. ఇది నా పాత సెక్స్ టేప్‌కు సంబంధించి రిలీజ్ చేయని ఫుటేజ్ కావచ్చునేమో'' అని చెప్పారామె.

కిమ్ కర్దాషియన్ సెక్స్ టేప్ ఒకటి 2007లో ఆన్‌లైన్‌లో పబ్లిష్ అయింది.

వీడియో క్యాప్షన్, "తల్లిదండ్రులు మమ్మల్ని ట్రాన్స్‌జెండర్లుగా గుర్తిస్తే, మేం ఇలా వీధిన పడం"

రోబ్లాక్స్ మీద కేసు వేస్తానంటూ కర్దాషియన్ హెచ్చరిక

ఈ ఎపిసోడ్ చివర్లో కర్దాషియన్ కఠినమైన భాషలో మాట్లాడుతూ రోబ్లాక్స్‌ మీద కేసు వేస్తానని హెచ్చరిస్తారు. ''వారిని నేలమట్టం చేయటానికి కావలసిన సమయం, డబ్బు, వనరులు'' తన దగ్గరున్నాయని తన లాయర్‌తో చెప్తారు.

రోబ్లాక్స్‌ సంస్థను 2,400 కోట్ల డాలర్ల విలువైన సంస్థగా లెక్కగట్టారు. ఈ ఉదంతానికి సంబంధించి 2021 సెప్టెంబర్‌లో తమ మోడరేటర్లు అప్రమత్తమైన వెంటనే ఆ కంటెంట్ మీద చర్యలు చేపట్టామని ఆ సంస్థ చెప్తోంది.

ఈ షోను గత వారంలో అమెరికాలో హులు చానల్‌లో, మిగతా చోట్ల డిస్నీ ప్లస్ చానల్‌లో ప్రసారం చేశారు.

కిమ్ కర్దాషియన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కిమ్ కర్దాషియన్

కర్దాషియన్ షో విజయోత్సవం

ఆ కంపెనీ మీద కేసు వేసినట్లు ఎలాంటి రికార్డూ అందుబాటులో లేదు.

''ఆ టేప్‌కు సంబంధించి టెక్ట్స్ రూపంలోని ప్రస్తావన మా ఫిల్టర్లు పసిగట్టగానే దానిని వేగంగా తొలగించాం. అదృష్టవశాత్తూ ప్లాట్‌ఫామ్ మీద కేవలం ఓ డజను మందికి మాత్రమే అది కనిపించింది. దీనికి సంబంధించిన ఎక్స్‌పీరియెన్స్‌ను కూడా మేం వేగంగా తొలగించాం. ఈ సంఘటనలో ప్రమేయమున్న కమ్యూనిటీ డెవలపర్‌ను నిషేధించాం'' అని రోబ్లాక్స్ వివరించింది.

ఆ రూమ్‌ను క్రియేట్ చేసిందెవరు, దానిని తొలగించటానికి ముందు కచ్చితంగా ఎంతమంది ప్లేయర్లు ఆ రూమ్‌లోకి ప్రవేశించారు, దాని గురించి కంపెనీకి సమాచారం ఎలా అందింది అనే విషయాలను రోబ్లాక్స్ చెప్పలేదు.

ఈ అంశంపై వ్యాఖ్యానించాలన్న వినతులకు హులు చానల్ స్పందించలేదు. కర్దాషియన్స్ షో విజయోత్సవాన్ని ఆ చానల్ జరుపుకుంది. స్ట్రీమింగ్ సర్వీస్ చరిత్రలో అతిపెద్ద అమెరికా ప్రీమియర్ ఈ షోనే.

''మీరంతా వీక్షించినందుకు నేను ఎంతో కృతజ్ఞురాలిని'' అని కిమ్ కర్దాషియన్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)