కిమ్ కర్దాషియన్: ఆన్‌లైన్‌లో అత్యంత ప్రమాదకరమైన ప్రముఖురాలు ఎలా అయ్యారు?

కిమ్ కర్దాషియన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కిమ్ కర్దాషియన్

ఆన్‌లైన్‌లో ప్రజలు అత్యధికంగా వెతికే ప్రముఖులు ఎవరో ప్రతియేటా కొన్ని సంస్థలు ప్రకటిస్తుంటాయి.

అలాగే, ఆన్‌లైన్‌లో వెతికే అత్యంత ప్రమాదకర ప్రముఖులు ఎవరో మరికొన్ని సంస్థలు ప్రకటిస్తుంటాయి.

ఈ ఏడాది ఇంగ్లాండ్‌లో ఆన్‌లైన్‌లో వెతికే అత్యంత ప్రమాదకర ప్రముఖులుగా కిమ్ కర్దాషియన్ నిలిచారు. ఈమె ఇంగ్లాండ్‌లోని రియాల్టీ షో టీవీ స్టార్.

కిమ్ కర్దాషియన్ పేరు ఎన్ని సైట్లలో ఉందో, సెర్చ్ ఇంజిన్ ఫలితాలు ఎలా ఉన్నాయో సైబర్ సెక్యూరిటీ సంస్థ 'మెకఫీ' లెక్కగట్టింది.

మోడల్ నయోమీ క్యాంబెల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మోడల్ నయోమీ క్యాంబెల్

ఈ జాబితాలో సూపర్ మోడల్ నయోమీ క్యాంబెల్ రెండో స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో కిమ్ సోదరి కౌర్నీ కర్దాషియన్ వచ్చారు.

గతేడాది ఆన్‌లైన్‌లో వెతికే అత్యంత ప్రమాదకరమైన ప్రముఖులుగా కరెగ్ డేవిడ్ నిలిచారు.

గాయకుడు అడిలె, లవ్ ఐస్‌లాండ్ వ్యాఖ్యాత కరోలైన్ ప్లాక్ వరసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.

'ఆరెంట్ హిజ్ ద న్యూ బ్లాక్' సినిమా నటి రూబీ రోస్ ఈ ఏడాది అమెరికాలోని ఆన్‌లైన్‌లో వెతికే అత్యంత ప్రమాదకర ప్రముఖుల జాబితాలో మొదటి స్థాన్నాన్ని ఆక్రమించారు.

రూబీ రోస్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, రూబీ రోస్

ప్రముఖుల పేర్లను ఉపయోగిస్తూ యూజర్లను ప్రమాదకర వెబ్ సైట్లలోకి తీసుకెళ్లేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తుంటారు అని మెకఫీ తెలిపింది.

మాల్వేర్‌ను ఇన్స్‌స్టాల్ చేయడానికి లేదా వ్యక్తిగత సమాచారం, పాస్వర్డ్‌లను దొంగిలించడానికి ఇలాంటి సైట్లు నేరగాళ్లకు ఉపయోగపడతాయి.

కెమ్ సెటినీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇంగ్లాండ్‌లో ఈ జాబితాలో ఉన్న ఏకైక పురుష ప్రముఖుడు కెమ్ సెటినీ

'పాప్‌కల్చర్, సోషల్ మీడియాతో తీవ్రంగా ప్రభావితమైన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం’ అని మెకఫీ సైంటిస్ట్ రాజ్ సమాని అన్నారు.

''ఆన్‌లైన్ వేదికగా అపరిమితమైన వినోదభరిత కార్యక్రమాలను మనం ఎంచుకోవచ్చు. వివిధ రకాల పరికరాలతో మనం వాటికి అనుసంధానం అవుతున్నాం'' అని ఆయన తెలిపారు.

కిమ్ కర్దాషియన్ ప్రభావం, వ్యాపార సంస్థల ప్రచారం మూలంగా ప్రజలు ఆమె గురించి శోధించడానికి ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఆన్‌లైన్‌లో సురక్షితంగా సెర్చ్ చేయాలంటో ఏం చేయాలో మెకఫీ తెలిపింది.

విశ్వసనీయమైన సైట్ల నుంచే వీడియోలు చూడాలని, వినియోగదారుల నమ్మకం చూరగొన్న సైట్లపైనే క్లిక్ చేయాలని సూచించింది.

కంప్యూటర్‌లోని ఆప్స్, యాంటీ వైరస్‌లను అప్‌డేట్ చేయాలని తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)