సాయి పల్లవి: కశ్మీరీ పండిట్‌లు, గోహత్యలు, ముస్లింలపై దాడులపై విరాటపర్వం హీరోయిన్ ఏమన్నారు? ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు ఏమంటున్నారు

ఫొటో సోర్స్, Sai pallavi/fb
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
నటి సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది.
కశ్మీర్లో పండితులను చంపడం, ఆవు పేరుతో ముస్లింలను చంపడం - ఈ రెండింటికీ తేడా ఏముంది అంటూ ఆమె ప్రశ్నించారు.
విరాట పర్వం సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో భాగంగా గ్రేట్ ఆంధ్ర యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్య చేశారు.

సాయిపల్లవిపై చర్యలు తీసుకోవాలంటూ బజరంగ్ దళ్ నాయకులు కొందరు హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
గోరక్షులను సాయిపల్లవి కశ్మీర్ ఉగ్రవాదులతో పోల్చారని ఆరోపిస్తూ బజరంగ్ దళ్ నాయకులు ఈ ఫిర్యాదు చేశారు.
బజరంగ్ దళ్ చేసిన ఈ ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు.

ఫొటో సోర్స్, venu udugula/fb
ఇంతకీ ఆమె ఏమన్నారు?
‘నక్సల్ యూనిఫాం వేసుకుని గన్ పట్టుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? మీరు ఇమాజిన్ చేసుకున్నారా అడవుల్లో వీళ్ల లైఫ్ ఇలా ఉంటుందా అని? పోనీ కనీసం వారి మీద ఏమైనా జాలి కలిగిందా మీకు?’ అని యూట్యూబ్ చానల్ అడిగిన ప్రశ్నకు సాయి పల్లవి ఏమన్నారంటే..
‘అది ఒక ఐడియాలజీ కదండీ. కొందరికి శాంతి అంటే ఒక అభిప్రాయం ఉంటుంది. నాకు హింస సరైనది కాదని ఒక అభిప్రాయం. హింసాయుతంగా ఉంటేనే సమస్యను పరిష్కరించగలమని ఈరోజుల్లో నేను అనుకోను. కానీ వాళ్ల టైంలో తమ కష్టాన్ని చెప్పుకోవడానికి.. చట్టం, తప్పు ఒప్పులను పట్టించుకోనప్పుడు, ఎక్కడకు వెళ్లాలో తెలియని వాళ్లు ఒక గ్రూపుగా ఏర్పడి పోరాడారు. మేమే మంచి చేస్తాం అనే మైండ్ సెట్ వాళ్లది. వాళ్లు కరెక్టా తప్పా అని చెప్పే పరిస్థితుల్లో మనం లేం. అది వేరే కాలంలో జరిగింది.
నేను కాసేపటి ముందు చెప్పాను. పాకిస్తాన్‌లో ఉన్న వాళ్లు మన సైనికులు అందర్నీ టెర్రరిస్టులు అనుకుంటారు. ఎందుకంటే మన సైనికులు వాళ్లకు హాని చేస్తున్నారని వారు అనుకుంటారు. మనకు వాళ్లు టెర్రరిస్టుల్లా కనపడతారు. అంటే ఇక్కడం దృక్కోణం మారిపోతుంది. హింస అనేది అర్థం చేసుకోవడం నాకు చాలా కష్టం.
ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పడం చాలా కష్టం. ఆ సమయంలో ఉన్న పరిస్థితుల్లో నక్సలైట్లు అందరూ ఒక సిద్ధాంతాన్ని నమ్మారు. ఇలా చేస్తేనే తమకు న్యాయం జరుగుతుంది అని అనుకున్నారు. ఇలా చేస్తేనే మా పిల్లలకు మా కుటుంబాలకూ మంచి జరుగుతుంది అని అనుకన్న సమయం అది’ అన్నారామె.

ఫొటో సోర్స్, Sai pallavi/fb
‘మీ విద్యార్థి జీవితంలో కొంచెమైనా వామపక్ష ఉద్యమాలు చూసి ఉంటారు కదా’ అని యూట్యూబ్ చానల్ అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం వివాదాస్పదమైంది.
‘‘నేను పెరిగిన జీవన విధానం చాలా న్యూట్రల్‌గా ఉంది. అందుకే నేను రెండు వాదనలనూ (లెఫ్ట్, రైట్) న్యూట్రల్‌గా చూస్తున్నాను. నేను లెఫ్ట్ లేదా రైట్ కుటుంబాల నుంచి వచ్చి ఉంటే నాకు ఒక సైడ్ ఏర్పడి, ఒకరికి అనుకూల అభిప్రాయాలు ఉండేవేమో. కానీ నేను ఒక నూట్రల్ ఫ్యామిలో పెరిగాను. వాళ్లు ఒకటే నేర్పారు. నువ్వొక మంచి మనిషిగా ఉండు అని నేర్పారు. ఎవరైనా ఇంకెవర్నైనా ఇబ్బంది పెడితే ఆ ఇబ్బంది పడేవాళ్లను రక్షించాలి. అణిచివేయబడుతోన్న వాళ్లను రక్షించాలి. వాళ్లు పెద్దవాళ్లా చిన్నవాళ్లా అని చూడకూడదు. నేను అలాంటి నూట్రల్ వాతావరణంలో పెరిగాను. నేను లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ విన్నాను. ఎవరు కరెక్టు ఎవరు తప్పు అనేది ఎప్పడూ చెప్పలేం.
కొన్ని రోజుల మందు కశ్మీరీ ఫైల్స్ వచ్చింది కదా. అందులో ఆ సమయంలో అక్కడున్న కశ్మీరీ పండితులను వాళ్లు ఎలా చంపారో చూపించారు. ఇప్పుడు కోవిడ్ సమయంలో.. ఒకవేళ మీరు మత ఘర్షణలను చూస్తే... ఈ మధ్య ఒకరు బండిలో ఆవును తీసుకెళ్తున్నారు. ఆ బండి నడిపై వ్యక్తి ముస్లిం. కొందరు జనాలు అతన్ని కొట్టి జై శ్రీరాం జై శ్రీరాం అన్నారు. అప్పుడు జరిగినదానికీ, ఇప్పుడు జరిగిన దానికీ తేడా ఏముంది?
మతం వాతావరణంలో మనం మంచిగా ఉండాలి. మనం మంచి వ్యక్తిగా ఉంటే.. ఎవర్నీ హర్ట్ చేయం. మనిషిపై ఒత్తిడి పెట్టం. న్యాయం ఉండని వైపు ఉంటే మీరు మంచి మనిషి కాదు. న్యాయంతో వెళ్తే మంచి మనిషి. మంచి మనిషిగా ఉంటే మీరెక్కడున్నా నూట్రల్ అయిపోతారు’’ అని సాయిపల్లవి చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ ఇంటర్వ్యూలో ఆమె కశ్మీర్ పండితుల ఊచకోతను ఆవు పేరుతో జరిగే మూక హత్యలను పోల్చడంపై సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా చర్చ జరుగుతోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ముఖ్యంగా సంఘ్ పరివార్‌కు సంబంధించిన వారు సాయి పల్లవిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం #SaiPallavi ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3

పోస్ట్ of X ముగిసింది, 4
సాయి పల్లవిని విమర్శించే వారు, ఆమె అన్న మాటలనే కాకుండా, ఆమె శరీర భాగాలపై అభ్యంతరకమైన వ్యాఖ్యలు చేస్తూ విమర్శిస్తున్నారు.
ఇక ఆమె చెప్పిన దాంట్లో తప్పేమీ లేదనీ, రెండు అంశాల్లోని తప్పును ఆమె ఎండగట్టారు అని మరికొందరు సాయి పల్లవికి అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
నిజానికి సాయి పల్లవి తరచూ వివాదాల్లో ఉండే మనిషి కాదు. తన పని తాను చేయడం తప్ప పెద్దగా ఇతర వ్యవహారాల్లో మాట్లాడిన ఛాయలూ లేవు. పొట్టి బట్టలు వేసుకోకపోవడం, మేకప్ లేకుండా మొటిమలతో సినిమాల్లో నటించడం వంటి అంశాలంతో ఆమె ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
ఫిదా సినిమాలో తెలంగాణ యాసతో ఆకట్టుకున్నారు. గతంలో వంద కోట్ల వ్యూస్ దాటిన తమిళ పాట రౌడీ బేబీ గురించి సోషల్ మీడియాలో ధనుష్‌తో సమానంగా సాయి పల్లవిని గుర్తించలేదంటూ చర్చ జరిగింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
అప్పుడు కూడా ఆమె పెదవి విప్పలేదు. తాజాగా గ్రేట్ ఆంధ్ర ఇంటర్వ్యూలో విరాట పర్వం సినిమా మావోయిస్టు నేపథ్యంలోనిది కాబట్టి, మావోయిజం గురించి ఆమె అవగాహన తెలుసుకునేలా రిపోర్టర్ ప్రశ్న అడిగిన నేపథ్యంలో మొదటిసారి ఆమె వివాదంలో చిక్కుకున్నారు.

ఫొటో సోర్స్, Sai pallavi/fb
జార్జియాలో ఎంబీబీఎస్ చదివిన సాయి పల్లవిది ఊటీ సమీపంలోని కొత్తగిరి దగ్గర ఒక చిన్న ఊరు. తమిళనాడే అయినా, బడగ ఆమె మాతృ భాష. సాయి పల్లవి, బడగ తెగకు చెందిన అమ్మాయి.
తండ్రి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. తల్లి గృహిణి, డ్యాన్సర్ కూడా. ఆమె కుటుంబ సభ్యులు పుట్టపర్తి సత్యసాయి భక్తులు కాబట్టి ఆమెకు సాయి పేరు కలిపారు.
సాయి పల్లవి కూడా దైవ భక్తి ఉన్న అమ్మాయే. సాయి పల్లవి కవల పిల్లల్లో ఒకరు.
తల్లి ప్రోత్సాహంతో నేర్చుకున్న డ్యాన్సుతో స్కూల్ ప్రదర్శనలు ఇవ్వడంతో చిన్న చిన్న సినిమా ఆఫర్లు వచ్చాయి. అలా కంగనా, మీరా జాస్మిన్ పక్కన చిన్న పాత్రల్లో నటించారు సాయి పల్లవి.
8వ తరగతి నుంచే నటన మొదలైంది. ఆ తరువాత తమిళంలో స్టార్ విజయ్, తెలుగులో ఈటీవీ డ్యాన్స్ షోలల్లో సాయి పల్లవి పాల్గొన్నారు. లెక్కలు అంటే భయంతో... ఆ క్లాసు ఎగ్గొట్టొచ్చనే చిన్నప్పుడు సినిమాల్లో చిన్న వేషాలకు వెళ్లినట్టు చెప్పుకొచ్చారు.

ఫొటో సోర్స్, Sai pallavi/fb
అయితే, సినిమా హీరోయిన్ కెరీర్ చాలా తక్కువ నిడివి ఉంటుంది. కాబట్టి, కచ్చితంగా చదువుకోవాల్సిందే అని ఆమె తండ్రి చెప్పడంతో సినిమాల వైపు వెళ్లకుండా ఎంబీబీఎస్ కోసం జార్జియా వెళ్లారు. జార్జియాలో చదువుతుండగానే ప్రేమమ్ సినిమాలో దర్శకుడు అల్ఫోన్స్ అవకాశం ఇచ్చారు. సెలవుల్లో మాత్రమే నటించే షరతుపై తండ్రి ఒప్పుకున్నారని పలు ఇంటర్వ్యూల్లో సాయి పల్లవి చెప్పారు.
ప్రేమమ్ సినిమాతో ఆమెకు తమిళ, మలయాళంలోనే కాకుండా దక్షిణాదిన పేరు లభించింది. దక్షిణాది సినిమాలు చూసే ఉత్తరాది ప్రేక్షకులు కూడా ప్రేమమ్‌లో సాయి పల్లవిని ప్రత్యేకంగా గుర్తించారు.
ప్రేమమ్ తరువాత ఫిదా, ఎంసీఏ, మారి, పడిపడి లేచే మనసు, ఎన్జీకే, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వాల్లో తెలుగు ప్రేక్షకులకు కనిపించింది.
సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా కనిపించని సాయి పల్లవి, త్వరలో తెరపై ఆరేళ్ల పాపకు తల్లిగా కనిపించబోతున్నారు. సాధారణంగా ఫామ్‌లో ఉన్న హీరోయిన్స్ ఒప్పుకోని విధంగా తల్లి పాత్రలకు ఒప్పుకోవడం ప్రత్యేకం.

ఫొటో సోర్స్, Sai pallavi/fb
సాయి పల్లవి వివిధ అంశాలపై కాస్త లోతుగా మాట్లాడతారు. తాను స్వయంగా దేవుని భక్తురాలు అని చెప్పుకున్న ఆమె... నాస్తికత్వంపై చేసిన మాటలు వింటే ఆమె ఆలోచనల వైఖరిని తెలుసుకోవచ్చు.
''దేవున్ని నమ్మే వారికి దేవుడే సర్వస్వంగా కనిపిస్తారు. నమ్మని వారికి ఏం లేదు. ఇప్పుడు నాకు ప్రేక్షకుల ప్రేమ దొరుకుతుంది. ఇది కొంత కాలం తరువాత ఉండకపోవచ్చు. ఇక్కడ తెలుగునాట నాకు ఆదరణ ఉంది. తమిళనాడులో నేనంత ఫేమస్ కాదు. విదేశాలకు వెళ్తే నేను అందరిలో ఒకరిని. ఈ పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ శాశ్వతం కాదు. కాలం, స్థలంతో ఇవన్నీ మారుతుంటాయి'' అంటూ అదే గ్రేట్ ఆంధ్ర ఇంటర్వ్యూలో చెప్పారు సాయి పల్లవి.
ఇవి కూడా చదవండి:
- 'అగ్నిపథ్' పథకంతో ప్రయోజనం ఎవరికి? ఇండియన్ ఆర్మీకి మేలు ఎంత? అగ్నివీర్లకు మేలు ఎంత?
- సాద్ అన్సారీ ఎవరు? నూపుర్ శర్మ వ్యాఖ్యల వివాదంలో ఈ ముస్లిం యువకుడిని ఎందుకు అరెస్టు చేశారు?
- బిట్ కాయిన్ ఎందుకు ఇంత వేగంగా కుప్పకూలుతోంది?
- అచ్చం మీలాగే ఉండే, మీలాగే ఆలోచించే డిజిటల్ ట్విన్ రూపొందిస్తే.. ఆ తర్వాత ఏం జరుగుతుంది?
- 68 అడుగుల లోతులో 5 రోజులు నరకయాతన.. పదేళ్ల మూగ బాలుడిని ఎలా రక్షించారంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)