The Lady of Heaven: 'మొహమ్మద్ ప్రవక్త కూతురు కథ' సినిమాను పలు ముస్లిం దేశాలు ఎందుకు నిషేధిస్తున్నాయి? బ్రిటన్‌ థియేటర్లలో ప్రదర్శన రద్దుపై ప్రజల స్పందన ఏమిటి?

లేడీ ఆఫ్ హెవెన్

ఫొటో సోర్స్, AFP

బ్రిటిష్ సినిమా 'ద లేడీ ఆఫ్ హెవెన్' దైవదూషణాత్మకంగా ఉందంటూ మొరాకో ప్రభుత్వం తాజాగా నిషేధించింది. ఆ సినిమా ఇస్లాం సత్యాలను తప్పుగా చిత్రీకరిస్తోందని మొరాకో మత మండలి సుప్రీం ఉలేమా కౌన్సిల్ ఖండించింది.

మొహమ్మద్ ప్రవక్త కూతురు లేడీ ఫాతిమా కథ అని నిర్మాతలు చెప్తున్న ఈ సినిమాను ఇప్పటికే ఈజిప్ట్, పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్ దేశాలు కూడా నిషేధించాయి.

ఈ సినిమా ద్వేషపూరిత పక్షపాతంతో ఉందని, దీని నిర్మాతలు పేరుప్రఖ్యాతులు కోరుకుంటున్నారని, ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తున్నారని, మత ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారని సుప్రీం ఉలేమా కౌన్సిల్ తప్పుపట్టినట్లు మొరాకో ప్రభుత్వ మీడియా చెప్పింది.

మరోవైపు గత వారంలో బ్రిటన్‌లో పలుచోట్ల కొందరు నిరసనలు చేపట్టటంతో తమ థియేటర్లన్నిటిలో ఈ సినిమా ప్రదర్శనను రద్దు చేస్తున్నట్లు సినీవరల్డ్ సంస్థ తెలిపింది. కొన్ని థియేటర్ల బయట నిరసనకారులు ఆందోళనకు దిగటంతో.. ''మా సిబ్బంది, కస్టమర్ల భద్రత రీత్యా ఈ నిర్ణయం'' తీసుకున్నట్లు సినీవరల్డ్ చెప్పింది.

బ్రిటన్‌లోని థియేటర్ల నుంచి 'ద లేడీ ఆఫ్ హెవెన్' సినిమాను తొలగించాలంటూ ఒక పిటిషన్ మీద 1,20,000 మందికి పైగా జనం సంతకాలు చేశారు. ఈ సినిమా 'దైవదూషణ' చేస్తోందని, మతవివక్షతో కూడుకుని ఉందని బోల్టన్ మసీదుల మండలి తప్పుపట్టింది.

అయితే.. ''బ్రిటిష్ ప్రజలు ఏం చూడవచ్చు, ఏం చూడకూడదు, ఏం చర్చించవచ్చు, ఏం చర్చించకూడదు అనే దానిని ఏ ఒక్కరూ ఆదేశించకూడదు'' అని ఈ సినిమా నిర్మాత మాలిక్ ష్లిబాక్ పేర్కొన్నారు.

బ్రిటన్‌లో నిరసనలు

ఫొటో సోర్స్, @ABX_BAKR

ఫొటో క్యాప్షన్, బ్రిటన్‌లో థియేటర్ల వద్ద కొద్ది మంది నిరసనలు చేపట్టారు

'గౌరవనీయ వ్యక్తులను అగౌరవపరుస్తోంది'

ఈ సినిమాను జూన్ 3వ తేదీన బ్రిటన్‌లో థియేటర్లలో విడుదల చేశారు. మొహమ్మద్ ప్రవక్త కుమార్తె ఫాతిమా కథను ఈ మూవీ చెప్తుందని నిర్మాతలు పేర్కొన్నారు.

ఈ సినిమాలో మొహమ్మద్ ప్రవక్తను చూపించటాన్ని కొన్ని బృందాలు విమర్శించాయి. అలా చిత్రీకరించటాన్ని ఇస్లాంలో అవమానంగా భావిస్తారు. అలాగే తొలినాటి సున్నీ ఇస్లాం మతంలో ముఖ్యమైన వ్యక్తుల చిత్రీకరణను కూడా ఆ బృందాలు తప్పుపట్టాయి.

బోల్టన్, బర్మింగ్‌హామ్, షెఫీల్డ్‌లలో నిరసనలు జరగటంతో సినీవరల్డ్ థియేటర్ల నుంచి ఈ సినిమాను తొలగించారు. బోల్టన్‌లో థియేటర్ బయట 100 మందికి పైగా నిరసన చేశారని బోల్టన్ న్యూస్ తెలిపింది.

బర్మింగ్‌హామ్‌లో ఒక సినీవరల్డ్ థియేటర్ బయట 200 మంది ముస్లింలు ఈ సినిమాకు వ్యతిరేకంగా నిరసన చేపట్టినట్లు ముస్లిం వార్తా వెబ్‌సైట్ 5Pillars ట్విటర్‌లో ఒక ఫొటోను షేర్ చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

'బెదిరిపోయి లొంగిపోయారు'

తమ థియేటర్ల నుంచి ఈ సినిమాను తొలగించాలన్న సినీవరల్డ్ నిర్ణయాన్ని నిర్మాత ష్లిబాక్ విమర్శించారు. నిరసనకారుల డిమాండ్లకు ఆ సంస్థ బెదిరిపోయి తలవంచిందని విమర్శించారు. ''ఇప్పుడిక వారు ఎప్పుడు బాధపడినా, ఏ కాస్త కోపం వచ్చినా ఇదే పని చేస్తారు'' అని ఆయన బీబీసీతో వ్యాఖ్యానించారు.

బ్రిటన్‌లో లక్షలాది మంది ముస్లింలు ఉన్నారని.. వారందరి అభిప్రాయాలకు నిరసనకారులు ప్రాతినిధ్యం వహించటం లేదని పేర్కొన్నారు.

''మనం దీనికి బెదిరిపోయి లొంగిపోకూడదు. మనం సహనం ఉన్నవారిమని, విభిన్న అభిప్రాయాలు, వైఖరులను మనం ఆమోదిస్తామని, వాటితో విభేదించటాన్ని సంతోషంగా అంగీకరిస్తామని, కానీ సెన్సార్‌షిప్ అనేది ఉండటానికి వీలు లేదని మనం వారికి చెప్పాలి'' అన్నారాయన.

ఈ సినిమాను పూర్తిగా మూసివేయటంలో నిరసనకారులు విఫలమవుతారన్నారు. ''బ్రిటన్ వ్యాప్తంగా చాలా చాలా మంది జనం ఈ సినిమా గురించి ఇప్పుడే మొదటిసారి విన్నారు. అది మాకు బాగా కలిసివస్తుంది'' అని చెప్పారు.

బ్రిటన్‌ నిరసనలు
ఫొటో క్యాప్షన్, బ్రిటన్‌లో పలు థియేటర్లలో సినిమా ప్రదర్శన కొనసాగుతోంది

'చాలా ప్రమాదకరమైన దారి'

బ్రిటన్‌లో సినీవరల్డ్ థియేటర్ల నుంచి ఈ సినిమాను తొలగించాలన్న నిర్ణయాన్ని ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్ కూడా విమర్శించారు.

''ఎవరైనా చెప్పాలనుకున్న విషయం మీకు నచ్చకపోవచ్చు. కానీ చెప్పే హక్కు వారికి ఉంది'' అని ఆయన ఒక టీవీ చానల్‌తో మాట్లాడుతూ పేర్కొన్నారు.

బ్రిటన్‌లో దైవదూషణ చట్టాలేవీ లేవని జావిద్ గుర్తుచేశారు. ఆ దారిలో ప్రయాణించటం అత్యంత ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.

''ఈ దేశంలో మనకు వాక్‌స్వాతంత్ర్యం ఉంది. భావ ప్రకటనా స్వాతంత్ర్యం ఉంది. అది ప్రాధమిక విలువ'' అన్నారు.

ఈ సినిమా విభజన పూరితంగా ఉందని ముస్లిం కౌన్సిల్ ఆఫ్ బ్రిటన్‌ అభివర్ణించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

వ్యతిరేకతకు ప్రధాన కారణం ఏమిటి?

''ఈ సినిమా పట్ల వ్యతిరేకత ప్రధానంగా మొహమ్మద్ ప్రవక్తను చిత్రీకరించిన తీరు గురించి కాదు. ఈ సినిమాలో ఆయనను చిత్రీకరిస్తూ ఒక సీజీఐ ఉన్నా కూడా అది ప్రధాన కారణం కాదు'' అని బీబీసీ రిలీజియన్ ఎడిటర్ అలీమ్ మక్బూల్ పేర్కొన్నారు.

ఈ సినిమా రచయిత షియా ముస్లిం మత పెద్ద అయిన యాసర్ అల్-హబీబ్. తొలినాటి సున్నీ ఇస్లాంలో ప్రముఖులు, పూజ్యులు కొందరిని చిత్రీకరించిన తీరు మీద ప్రధానంగా విమర్శ కేంద్రీకృతమై ఉంది.

తొలినాటి సున్నీ ఇస్లాం ప్రముఖుల చర్యలకు, ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ చర్యలకు మధ్య పోలికలు ఉన్నాయన్నట్లుగా హబీబ్ చిత్రీకరణ ఉందని చెప్తున్నారు.

ఈ సినిమాను నిషేధించాలని తాము కోరుకుంటున్నప్పటికీ.. తమ ప్రదర్శనలు శాంతియుతంగా జరిగాయని బ్రిటన్‌లో ఈ నిరసనలకు నాయకత్వం వహించిన వారు అంటున్నారు. కానీ.. వారి ప్రవర్తన బెదిరించే విధంగా ఉందని, సినిమా ప్రదర్శనను నిలిపివేస్తే మేలని థియేటర్ల సంస్థలు భావించాయి.

ఈ పరిణామం పట్ల చాలా ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. అలా మండిపడుతున్న వారిలో ముస్లింలు కూడా ఉన్నారు. దైవదూషణ పేరుతో సెన్సార్‌షిప్‌ను సాధారణం చేసే రీతిలో చాలా తక్కువ మంది జనం తమ అభీష్టాన్ని రుద్దటంలో సఫలమయ్యారని వారు మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)