పార్వతి ఒడిలో శివుడు సేదతీరే అరుదైన శివాలయం విశేషాలు తెలుసా?

వీడియో క్యాప్షన్, ఈ ఆలయంలో శివుడు మానవ రూపంలో పార్వతి ఒడిలో సేద తీరురూ కనిపిస్తాడు.

చుట్టూ కొండలు, పచ్చటి పొలాలు మధ్యలో తిరుపతి నుంచి నాగలాపురం మీదుగా చెన్నై వెళ్లే ఒక హైవే. ఆ పక్కనే రంగురంగుల గోపురం ఉన్న ఒక ఆలయం. ఆ ఆలయంలోకి వెళ్తే గర్భగుడిలో.. పార్వతీ దేవి ఒడిలో విశ్రాంతి తీసుకుంటున్న స్థితిలో శివుడి విగ్రహం కనిపిస్తుంది.

శివాలయాల్లో ఎక్కడైనా శివుడు మనకు లింగాకారంలో మాత్రమే కనిపిస్తాడు. కానీ ఈ ఆలయంలో శివుడు ఇలా మానవ రూపంలో మిగతా దేవీ దేవతల్లాగే కనిపించడం ఇక్కడ మాత్రమే ఉంది.

ఈ ఆలయం తిరుపతికి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఆంధ్రప్రదేశ్ సరిహద్దులకు చివర్లోని సురుటిపల్లి గ్రామంలో మరో ఒకటిన్నర కిలోమీటరు వెళ్తే తమిళనాడు వస్తుందనగా రోడ్డు పక్కనే ఆ ఆలయం కనిపిస్తుంది. తమిళనాడులో మొదట వచ్చే ఊతుకోట పట్టణం ఈ ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది.

ఈ ఆలయంలోని శివుడి పేరు పళ్లికొండేశ్వరుడు. పళ్లికొండు అంటే తమిళంలో పడుకోవడం.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)