స్పేస్‌ఎక్స్‌: నింగిలోకి వెళ్లిన కొద్దిసేపటికే పేలిన 'స్టార్‌షిప్‌'.. ఎలాన్ మస్క్ ఏమన్నారు?

స్టార్‌షిప్

ఫొటో సోర్స్, Reuters

ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ తయారుచేసిన అత్యంత శక్తిమంతమైన అంతరిక్ష రాకెట్ ‘స్టార్‌షిప్’ అమెరికాలోని టెక్సాస్‌లో ప్రయోగించిన కొద్ది సేపటికే పేలిపోయింది.

ఏప్రిల్ 20 గురువారం స్టార్‌షిప్ టెస్ట్ లాంచ్ చేశాక నింగిలోకి ప్రయోగించిన కొద్దిసేపటికే అది పేలిపోయింది.

రాకెట్ ప్రయోగానికి ముందు ఉత్కంఠభరిత వాతావరణం ఏర్పడింది. ప్రయోగానికి రెండు సెకన్ల ముందు దానిని నిలిపివేశారు. కొన్ని నిమిషాల తర్వాత మళ్లీ ప్రయోగాన్ని చేపట్టారు.

బూస్టర్ వేరుపడటానికి ప్రయత్నించినప్పుడు రాకెట్ వ్యవస్థలు విఫలమయ్యాయి. దీంతో స్టార్‌షిప్ పేలిపోయింది.

లాంచ్ చేసిన 75 సెకన్ల తర్వాత స్టార్‌షిప్ కెమెరా నుంచి ఫోటోలు విడుదలయ్యాయి.

ఆ చిత్రాలలో 33 ఇంజిన్‌లలో 27 ఇంజిన్లలో మాత్రమే లైట్లు వెలగడం కనిపించింది.

రాకెట్ నియంత్రణ కోల్పోవడం మొదలైన తర్వాత, స్టార్‌షిప్‌ను నియంత్రిస్తున్న బృందం దాన్ని పేల్చివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది.

స్పేస్ ఎక్స్

ఫొటో సోర్స్, SpaceX

భవిష్యత్తులో గ్రహాంతర ప్రయాణానికి స్టార్‌షిప్ బాటలు వేస్తుందని స్పేస్ ఎక్స్ చెబుతోంది.

అంతరిక్ష ప్రయాణంలో ఈ రాకెట్ విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదని సంస్థ భావిస్తోంది.

‘స్టార్ షిప్’ను పూర్తిగా తిరిగి వినియోగించుకోవడానికి అనువైన రవాణా వ్యవస్థగా స్పేస్ ఎక్స్ అభివృద్ధి చేస్తోంది.

స్టార్‌షిప్

ఫొటో సోర్స్, SpaceX

స్టార్‌షిప్

ఫొటో సోర్స్, Reuters

స్టార్‌షిప్

ఫొటో సోర్స్, Reuters

స్టార్‌షిప్

ఫొటో సోర్స్, EPA

స్టార్‌షిప్

ఫొటో సోర్స్, EPA

చాలా నేర్చుకున్నాం: ఎలాన్ మస్క్

స్టార్‌షిప్ ప్రయోగంపై ఎలాన్ మస్క్ ట్విటర్‌లో స్పందించారు.

''స్టార్‌షిప్ అద్భుతమైన టెస్ట్ లాంచ్‌లో భాగమైన స్పేస్‌ఎక్స్‌ బృందానికి అభినందనలు.

కొన్ని నెలల్లో చేయబోయే తదుపరి టెస్ట్ లాంచ్ కోసం చాలా నేర్చుకున్నాం'' అని ఎలాన్ మస్క్ రాశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

"మా టీంలు డేటాను సమీక్షించడం, తదుపరి ప్రయోగం కోసం పని చేయడం కొనసాగిస్తాయి" అని స్పేస్‌ఎక్స్ తెలిపింది.

"ఇలాంటి పరీక్షలతో నేర్చుకోవడం ద్వారానే విజయం దరిచేరుతుంది. నేటి పరీక్ష స్టార్‌షిప్ విశ్వసనీయతను మెరుగుపరచడంలో మాకు సహాయపడుతుంది" అని స్పేస్‌ఎక్స్ చెప్పింది.

ఈ సందర్భంగా తన ఉద్యోగులకు కూడా సంస్థ శుభాకాంక్షలు చెప్పింది.

మరో రాకెట్ సిద్ధం

''కీలక సమయంలో రాకెట్ దిగువ సగంలోని సూపర్ హెవీ బూస్టర్ షిప్ పైభాగం నుంచి విడిపోయి అంతరిక్షంలోకి వెళ్లాల్సి ఉంది. అయితే అది విడిపోలేదు. ఆపై స్టార్‌‌షిప్ నియంత్రణ కోల్పోవడం మొదలైంది. ఆ సమయంలో కంప్యూటర్‌లు స్టార్‌షిప్‌ను పేల్చివేయడాన్నే పరిష్కారంగా సూచించి ఉంటాయి" అని బీబీసీ సైన్స్ కరస్పాండెంట్ జొనాథన్ ఆమోస్ వివరించారు.

ఈ ప్రయోగంతో ఇంత దూరం వచ్చినందుకు స్పేస్‌ఎక్స్ ఉత్సాహంగా ఉండొచ్చని ఆయన తెలిపారు. "వారైతే స్పష్టంగా ఉన్నారు. చాలా డేటాను పొందారు" అన్నారు. తొలి ప్రయత్నంలో వారు సాధించిన దాని గురించి వారు ఆశ్చర్యపోవచ్చని చెప్పారు.

వారు ఇప్పటికే మరొక రాకెట్‌ను దాదాపు సిద్ధంగా ఉంచారని జొనాథన్ తెలిపారు.

స్టార్‌షిప్ ప్రయోగంపై నాసా చీఫ్ బిల్ నెల్సన్ స్పేస్‌ఎక్స్‌‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు.

"చరిత్రలో ప్రతి గొప్ప విజయానికి కొంత రిస్క్‌ ఉంటుంది. అప్పుడే గొప్ప విజయాలు దరిచేరుతాయి.

తదుపరి ఫ్లైట్ టెస్టు, అంతకుమించి స్పేస్‌ఎక్స్‌ నేర్చుకునే వాటి కోసం ఎదురుచూస్తున్నా" అని ఆయన తెలిపారు.

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ జోసెఫ్ అష్‌బాచెర్ కూడా స్పేస్‌ఎక్స్‌ను అభినందించారు. ఈ రోజు ప్రయోగం ఆకట్టుకునే దశ అని ఆయన అభివర్ణించారు.

"పైకి వెళ్లడం ఒక అద్భుతమైన విజయం! గొప్ప పాఠాలు నేర్చుకున్నా. స్పేస్‌ఎక్స్‌ త్వరగా సమస్యలను పరిష్కరిస్తుందని, త్వరలో లాంచ్‌ప్యాడ్‌కి తిరిగి వస్తుందని విశ్వసిస్తున్నా" అని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)