తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు .. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాలలో ఎన్నికలు ఎప్పుడంటే

Revanth Reddy, KCR, Kishan Reddy

ఫొటో సోర్స్, facebook

దేశంలోని అయిదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది.

తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలోని మొత్తం 679 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఈ మేరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు.

ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. తెలంగాణలో పోలింగ్ నవంబర్ 30న నిర్వహిస్తారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

తెలంగాణలో ఎన్నికలు ఒకే దశలో జరుగుతాయి.

ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాలలోనూ ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3నే ఉంటుంది.

Voter

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

నోటిఫికేషన్ తేదీ: నవంబర్ 3, 2023

నామినేషన్ల ప్రారంభం: నవంబర్ 3, 2023

నామినేషన్ల దాఖలుకు తుది గడువు: నవంబర్ 10

నామినేషన్ల పరిశీలన గడువు: నవంబర్ 13

నామినేషన్ల ఉపసంహరణ గడువు: నవంబర్ 15

పోలింగ్ తేదీ: నవంబర్ 30

ఓట్ల లెక్కింపు: డిసెంబర్ 3

Rajasthan election schedule 2023

ఫొటో సోర్స్, Getty Images

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

నోటిఫికేషన్ తేదీ: అక్టోబర్ 30, 2023

నామినేషన్ల ప్రారంభం: అక్టోబర్ 30, 2023

నామినేషన్ల దాఖలుకు తుది గడువు: నవంబర్ 6

నామినేషన్ల పరిశీలన గడువు: నవంబర్ 7

నామినేషన్ల ఉపసంహరణ గడువు: నవంబర్ 9

పోలింగ్ తేదీ: నవంబర్ 23

ఓట్ల లెక్కింపు: డిసెంబర్ 3

Voters

ఫొటో సోర్స్, Getty Images

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

నోటిఫికేషన్ తేదీ: అక్టోబర్ 21, 2023

నామినేషన్ల ప్రారంభం: అక్టోబర్ 21, 2023

నామినేషన్ల దాఖలుకు తుది గడువు: అక్టోబర్ 30

నామినేషన్ల పరిశీలన గడువు: అక్టోబర్ 31

నామినేషన్ల ఉపసంహరణ గడువు: నవంబర్ 2

పోలింగ్ తేదీ: నవంబర్ 17

ఓట్ల లెక్కింపు: డిసెంబర్ 3

Chhattisgarh election schedule 2023

ఫొటో సోర్స్, Getty Images

ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (రెండు దశలు)

మొదటి దశ

నోటిఫికేషన్ తేదీ: అక్టోబర్ 13, 2023

నామినేషన్ల ప్రారంభం: అక్టోబర్ 13, 2023

నామినేషన్ల దాఖలుకు తుది గడువు: అక్టోబర్ 20

నామినేషన్ల పరిశీలన గడువు: అక్టోబర్ 21

నామినేషన్ల ఉపసంహరణ గడువు: అక్టోబర్ 23

పోలింగ్ తేదీ: నవంబర్ 7

ఓట్ల లెక్కింపు: డిసెంబర్ 3

రెండో దశ

నోటిఫికేషన్ తేదీ: అక్టోబర్ 21, 2023

నామినేషన్ల ప్రారంభం: అక్టోబర్ 21, 2023

నామినేషన్ల దాఖలుకు తుది గడువు: అక్టోబర్ 30

నామినేషన్ల పరిశీలన గడువు: అక్టోబర్ 31

నామినేషన్ల ఉపసంహరణ గడువు: నవంబర్ 2

పోలింగ్ తేదీ: నవంబర్ 17

ఓట్ల లెక్కింపు: డిసెంబర్ 3

Mizoram election schedule 2023

ఫొటో సోర్స్, Getty Images

మిజోరం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

నోటిఫికేషన్ తేదీ: అక్టోబర్ 13, 2023

నామినేషన్ల ప్రారంభం: అక్టోబర్ 13, 2023

నామినేషన్ల దాఖలుకు తుది గడువు: అక్టోబర్ 20, 2023

నామినేషన్ల పరిశీలన గడువు: అక్టోబర్ 21, 2023

నామినేషన్ల ఉపసంహరణ గడువు: అక్టోబర్ 23, 2023

పోలింగ్ తేదీ: నవంబర్ 7

ఓట్ల లెక్కింపు: డిసెంబర్ 3

telangana assembly

ఫొటో సోర్స్, Getty Images

ఏ రాష్ట్ర అసెంబ్లీ గడువు ఎప్పటి వరకు?

తెలంగాణ అసెంబ్లీ గడువు 2024 జనవరి 16 వరకు ఉంది.

రాజస్థాన్ అసెంబ్లీ గడువు 2024 జనవరి 14 వరకు ఉంది.

మధ్యప్రదేశ్ అసెంబ్లీ గడువు 2024 జనవరి 6 వరకు ఉంది.

ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ గడువు 2024 జనవరి 3తో ముగియనుంది.

మిజోరం ప్రస్తుత అసెంబ్లీ కాలం 2023 డిసెంబర్ 17తో ముగియనుంది.

Voter

ఫొటో సోర్స్, Getty Images

ఎక్కడ ఎంతమంది ఓటర్లు?

తెలంగాణ: 3.17 కోట్లు

రాజస్థాన్: 5.25 కోట్లు

మధ్యప్రదేశ్: 5.8 కోట్లు

ఛత్తీస్‌గఢ్: 2.03 కోట్లు

మిజోరం: 8.52 లక్షలు

Telangana

ఫొటో సోర్స్, ECI

ఏ రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు

తెలంగాణ: మొత్తం 119 నియోజకవర్గాలు. ఇందులో ఎస్సీ రిజర్వ్‌డ్ 19, ఎస్టీ రిజర్వ్‌డ్ 12

రాజస్థాన్: మొత్తం నియోజకవర్గాలు 200, ఇందులో ఎస్సీ రిజర్వ్‌డ్ 25, ఎస్టీ రిజర్వ్‌డ్ 34

మధ్యప్రదేశ్: మొత్తం నియోజకవర్గాలు 230, ఇందులో.. ఎస్సీ రిజర్వ్‌డ్ 35, ఎస్టీ రిజర్వ్‌డ్ 47 నియోజకవర్గాలు

ఛత్తీస్‌గఢ్: మొత్తం నియోజకవర్గాలు 90.. అందులో ఎస్సీ రిజర్వ్‌డ్ 10, ఎస్టీ రిజర్వ్‌డ్ 29 నియోజకవర్గాలు

మిజోరం: మొత్తం నియోజకవర్గాలు 40.. అందులో ఎస్టీ నియోజకవర్గాలు 39 కాగా ఒకటి జనరల్ నియోజకవర్గం. ఈ రాష్ట్రంలో ఎస్టీ నియోజకవర్గాలు లేవు.

తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?

తెలంగాణలో 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఏడాది నవంబరు 12న ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసి ఆ రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభించింది.

2018 నవంబరు 12 నుంచి 19 వరకు నామినేషన్లు స్వీకరించారు.

అనంతరం డిసెంబర్ 7న ఒకే దశలో పోలింగ్ నిర్వహించారు.

డిసెంబర్ 13న ఓట్లు లెక్కించారు.

2018లోనూ తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి.

అప్పట్లో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాలలో ఒకే దశలో పోలింగ్ జరగ్గా ఒక్క ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు దశలలో పోలింగ్ నిర్వహించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)