గజ్వేల్, కామారెడ్డిల నుంచి కేసీఆర్ పోటీ.. ఆ ఎనిమిది ‘సిట్టింగ్’ స్థానాల్లో అభ్యర్థులను ఎందుకు మార్చారు?

ఫొటో సోర్స్, BRS
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ అభ్యర్థులను ప్రకటించారు.
అసెంబ్లీలో మొత్తం 119 స్థానాలు ఉండగా ఒకేసారి 115 స్థానాలకు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు.
నర్సాపూర్, నాంపల్లి, జనగామ, గోషామహల్ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు.
ప్రస్తుత జాబితా ప్రకారం, ఎనిమిది నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో వేరే అభ్యర్థులను ప్రకటించారు.
మొత్తం 115 స్థానాల్లో 39 స్థానాలు రెడ్లకు ఇచ్చారు. అంటే 34 శాతం స్థానాలు రెడ్లకు కేటాయించారు.

ఫొటో సోర్స్, BRS
తెలంగాణ ఎన్నికలు: అభ్యర్థుల జాబితా ఇదీ
1. సిర్పూర్ – కోనేరు కోనప్ప
2. చెన్నూరు (ఎస్సీ) – బాల్క సుమన్
3. బెల్లంపల్లి (ఎస్సీ )– దుర్గం చెన్నయ్య
4. మంచిర్యాల – నడిపల్లి దివాకర రావు
5. ఆసిఫాబాద్ (ఎస్టీ) – కోవ లక్ష్మి
6. ఖానాపూర్ (ఎస్టీ) – భూక్య జాన్సన్ రాథోడ్ నాయక్
7. ఆదిలాబాద్ – జోగు రామన్న
8. బోథ్ (ఎస్టీ) – అనిల్ జాదవ్
9. నిర్మల్ – అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
10. ముథోల్ – గడ్డిగారి విఠల్ రెడ్డి
11. ఆర్మూరు – ఆశన్నగారి జీవన్ రెడ్డి
12. బోధన్ – మహమ్మద్ షకీల్ ఆమిర్
13. జుక్కల్ (ఎస్సీ )– హన్మంత్ షిండే
14. బాన్సువాడ – పోచారం శ్రీనివాస రెడ్డి
15. ఎల్లారెడ్డి – జాజల సురేందర్
16. కామారెడ్డి – కె.చంద్రశేఖర రావు (ముఖ్యమంత్రి కేసీఆర్)
17. నిజామాబాద్ అర్బన్ – బిగాల గణేశ్ గుప్త
18. నిజామాబాద్ రూరల్ – బాజిరెడ్డి గోవర్దన్
19. బాల్కొండ – వేముల ప్రశాంత్ రెడ్డి
20. కోరుట్ల – కల్వకుంట్ల సంజయ్
21. జగిత్యాల – ఎం సంజయ్ కుమార్
22. ధర్మపురి (ఎస్సీ )– కొప్పుల ఈశ్వర్
23. రామగుండం – కోరుకంటి చందర్
24. మంథని – పుట్టా మధు
25. పెద్దపల్లి – దాసరి మనోహర్ రెడ్డి
26. కరీంనగర్ – గంగుల కమలాకర్
27. చొప్పదండి (ఎస్సీ) – సుంకే రవిశంకర్
28. వేములవాడ – చల్మెడ లక్ష్మీ నరసింహారావు
29. సిరిసిల్ల – కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)
30. మానకొండూరు (ఎస్సీ) – ఈరుపుల బాలకిషన్ (రసమయి)
31. హుజూరాబద్ – పాడి కౌశిక్ రెడ్డి
32. హుస్నాబాద్ – వొడితెల సతీశ్ కుమార్
33. సిద్ధిపేట – తన్నీరు హరీశ్ రావు
34. మెదక్ – పద్మా దేవేందర్ రెడ్డి
35. నారాయణఖేడ్ – మహారెడ్డి భూపాల రెడ్డి
36. ఆందోల్ (ఎస్సీ )– చంటి క్రాంతి కిరణ్
37. నర్సాపూర్ – ప్రకటించలేదు
38. జహీరాబాద్ (ఎస్సీ )– కోనింటి మాణిక్ రావు
39. సంగారెడ్డి – చింతా ప్రభాకర్
40. పఠాన్ చెఱువు – గూడెం మహిపాల్ రెడ్డి
41. దుబ్బాక – కొత్త ప్రభాకర రెడ్డి
42. గజ్వేల్ - కె.చంద్రశేఖర రావు (ముఖ్యమంత్రి కేసీఆర్)
43. మేడ్చల్ - చామకూర మల్లారెడ్డి
44. మల్కాజ్ గిరి – మైనంపల్లి హనుమంత రావు
45. కుత్బుల్లాపూర్ – కూన పాండు వివేకానంద్
46. కూకట్ పల్లి – మాధవరం కృష్ణా రావు
47. ఉప్పల్ – బండారు లక్ష్మా రెడ్డి
48. ఇబ్రహీంపట్నం – మంచిరెడ్డి కిషన్ రెడ్డి
49. ఎల్బీ నగర్ – దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
50. మహేశ్వరం – పటోళ్ల సబితా ఇంద్రా రెడ్డి
51. రాజేంద్ర నగర్ – తోల్కంటి ప్రకాశ్ గౌడ్
52. శేరిలింగంపల్లి – అరికెపూడి గాంధీ
53. చేవెళ్ల ఎస్సీ – కాలే యాదయ్య
54. పరిగి – కొప్పుల మహేశ్ రెడ్డి
55. వికారాబాద్ (ఎస్సీ )– డా. మెతుకు ఆనంద్
56. తాండూరు – పైలెట్ రోహిత్ రెడ్డి
57. ముషీరాబాద్ – ముఠా గోపాల్
58. మలక్ పేట – తీగల అజిత్ రెడ్డి
59. అంబర్ పేట – కాలేరు వెంకటేశ్
60. ఖైరతాబాద్ – దానం నాగేందర్
61. జూబ్లీ హిల్స్ – మాగంటి గోపీనాథ్
62. సనత్ నగర్ – తలసాని శ్రీనివాస యాదవ్
63. నాంపల్లి – ప్రకటించలేదు
64. కార్వాన్ – ఐందల కృష్ణయ్య
65. గోషామహల్ – ప్రకటించలేదు
66. చార్మినార్ – ఇబ్రహీం లోడీ
67. చాంద్రాయణగుట్ట – ఎం.సీతారాం రెడ్డి
68. యాకుత్ పుర – సామా సుందర్ రెడ్డి
69. బహదూర్ పుర – అలీ బక్రి
70. సికింద్రాబాద్ – టి.పద్మా రావు
71. సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ) – జి.లాస్య నందిత
72. కొడంగల్ – పట్నం నరేందర్ రెడ్డి
73. నారాయణపేట – ఎస్.రాజేందర్ రెడ్డి
74. మహబూబ్ నగర్ – విరుసనోళ్ల శ్రీనివాస గౌడ్
75. జడ్చెర్ల – చర్లకోల లక్ష్మా రెడ్డి
76. దేవరకదర – ఆళ్ల వేంకటేశ్వర రెడ్డి
77. మక్తల్ – చిట్టెం రామ్మోహన్ రెడ్డి
78. వనపర్తి – సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
79. గద్వాల – బండ్ల కృష్ణమోహన రెడ్డి
80. ఆలంపూర్ (ఎస్సీ) – వీఎం అబ్రహాం
81. నాగర్ కర్నూలు – మర్రి జనార్ధన రెడ్డి
82. అచ్చంపేట (ఎస్సీ) – గువ్వల బాలరాజు
83. కల్వకుర్తి – గుర్క జైపాల్ యాదవ్
84. షాద్ నగర్ – ఎల్గనమూరి అంజయ్య
85. కొల్లాపూర్ – బీరం హర్షవర్ధన్ రెడ్డి
86. దేవరకొండ (ఎస్టీ )– రమావత్ రవీంద్ర కుమార్
87. నాగార్జున సాగర్ – నోముల భగత్
88. మిర్యాలగూడ – నల్లమోతు భాస్కర రావు
89. హుజూర్ నగర్ - శానంపూడి సైది రెడ్డి
90. కోదాడ – బెల్లం మల్లయ్య యాదవ్
91. సూర్యాపేట – గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
92. నల్గొండ – కంచర్ల భూపాల రెడ్డి
93. మునుగోడు – కూసుకుంట్ల ప్రభాకర రెడ్డి
94. భువనగిరి – పైళ్ల శేఖర రెడ్డి
95. నకిరేకల్ (ఎస్సీ )– చిరుమర్తి లింగయ్య
96. తుంగతుర్తి (ఎస్సీ) – గాదరి కిషోర్ కుమార్
97. ఆలేరు – గొంగిడి సునీత
98. జనగామ – ప్రకటించలేదు
99. ఘనపూర్ స్టేషన్ (ఎస్సీ) – కడియం శ్రీహరి
100. పాలకుర్తి – ఎర్రబెల్లి దయాకర రావు
101. డోర్నకల్ – డీఎస్ రెడ్యా నాయక్
102. మహబూబాబాద్ (ఎస్టీ) – బానోత్ శంకర్ నాయక్
103. నర్సంపేట – పెద్ది సుదర్శన రెడ్డి
104. పరకాల – చల్లా ధర్మా రెడ్డి
105. వరంగల్ వెస్ట్ – దాస్యం వినయ భాస్కర్
106. వరంగల్ ఈస్ట్ – నన్నపునేని నరేంద్ర
107. వర్ధన్నపేట (ఎస్సీ) – ఆరూరి రమేశ్
108. భూపాలపల్లి – గండ్ర వెంటక రమణా రెడ్డి
109. ములుగు (ఎస్టీ) – బడే నాగజ్యోతి
110. పినపాక (ఎస్టీ) – రేగ కాంతా రావు
111. ఇల్లెందు (ఎస్టీ) – బానోత్ హరిప్రియ నాయక్
112. ఖమ్మం – పువ్వాడ అజయ్ కుమార్
113. పాలేరు – కందల ఉపేందర్ రెడ్డి
114. మధిర (ఎస్సీ )– లింగాల కమల రాజు
115. వైరా (ఎస్టీ) – బానోత్ మదన్ లాల్
116. సత్తుపల్లి (ఎస్సీ) – సండ్ర వెంకట వీరయ్య
117. కొత్తగూడెం – వనమా వేంకటేశ్వర రావు
118. అశ్వారావుపేట (ఎస్టీ) – మెచ్చా నాగేశ్వర రావు
119. భద్రాచలం (ఎస్టీ) – డా. తెల్లం వెంకట రావు

ఫొటో సోర్స్, BRS
కేసీఆర్ రెండు చోట్ల నుంచి పోటీ
కేసీఆర్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు.
ప్రస్తుతం గజ్వేల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన, రానున్న ఎన్నికల్లో ఆ స్థానంతో పాటు కామారెడ్డి నుంచి కూడా బరిలో దిగుతున్నారు.
8 నియోజకవర్గాల్లో సిట్టింగ్ అభ్యర్థుల మార్పు
సిట్టింగ్ అభ్యర్థులను మార్చిన ఎనిమిది నియోజకవర్గాల్లో స్టేషన్ ఘన్‌పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఉప్పల్, వైరా, వేములవాడ, బోథ్, కోరుట్ల ఉన్నాయి.
స్టేషన్ ఘన్‌పూర్ (ఎస్సీ ): ఇక్కడ తాటికొండ రాజయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన డిప్యూటీ సీఎంగా చేశారు కూడా. అయితే అప్పట్లో అవినీతి ఆరోపణలతో ఆయన్ను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించారు కేసీఆర్.
ఇప్పుడు ఆ సీటును మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి ఇచ్చారు. రాజయ్యపై అదే నియోజకవర్గానికి చెందిన మహిళా సర్పంచి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ అయింది. డిప్యూటీ సీఎం నుంచి తీసేసినా అదే పార్టీలో కొనసాగిన రాజయ్యకు, ఈ ఆరోపణలు తీవ్ర తలనొప్పులు తెచ్చిపెట్టాయి.
ఆసిఫాబాద్: ఇక్కడ ఆత్రం సక్కు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ గూటికి చేరారు. ఆయనపై ఓడిపోయిన కోవ లక్ష్మికే బీఆర్ఎస్ టికెట్ మళ్లీ దక్కింది. కోవ లక్ష్మికి ఇప్పటికీ బలం ఉండడం కలసివచ్చింది.
ఖానాపూర్: అజ్మీరా రేఖా నాయక్ ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే. 2014, 2018 రెండుసార్లు టీఆర్ఎస్ టికెట్ పొందారు ఈమె. ఈమె స్థానంలో ఈసారి భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్‌ను అభ్యర్థిగా నిలబెడుతున్నారు. జాన్సన్ తెలంగాణ ఉద్యమం నుంచీ పార్టీలో ఉన్నారు, కేటీఆర్‌కు సన్నిహితుడు. అందుకే స్థానికుడు కాకపోయినా రిజర్వేషన్ సమీకరణలో ఖానాపూర్ పంపించారు. గత ఎన్నికల్లోనే రేఖా నాయక్ గెలుపు కాస్త కష్టం అవడంతో ఈసారి ఆమె స్థానంలో జాన్సన్‌ను పెట్టారు.
ఉప్పల్: ప్రస్తుత ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి స్థానికంగా సొంత పార్టీ నుంచి పోటీ ఎక్కువ ఉంది. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజి రెడ్డి సోదరుడు లక్ష్మారెడ్డి, ప్రస్తుత హైదరాబాద్ డిప్యూటి మేయర్ భర్త మోతె శోభన్ రెడ్డి టికెట్ కోసం ప్రయత్నించారు. చివర్లో బొంతు రామ్మోహన్, భేతి సుభాష్ రెడ్డి ఏకమై తామిద్దర్లో ఎవరికి టికెట్ ఇచ్చినా పర్వాలేదు కానీ లక్ష్మారెడ్డికి ఇవ్వవద్దంటూ ఎమ్మెల్సీ కవితను కలిశారు. కానీ చివరకు బండారి లక్ష్మారెడ్డికే టికెట్ ఇచ్చారు.
వైరా: ఇక్కడ గత ఎన్నికల్లో లావుడ్యా రాములు నాయక్ స్వంతంత్ర అభ్యర్థిగా గెలిచారు. ఆయన కాంగ్రెస్‌లో పనిచేసినా, కాంగ్రెస్ – కమ్యూనిస్టుల పొత్తులో ఆ సీటు సీపీఐకి వెళ్లడంతో ఆయన స్వతంత్రంగా పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన చేతిలో ఓడిపోయిన బీఆర్ఎస్ నాయకులు బానోత్ మదన్ లాల్‌కే, మళ్లీ ఈసారి అవకాశం దక్కింది. రాములు నాయక్‌కు సీటు ఇవ్వలేదు.
వేములవాడ: ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆయన గతంలో జర్మనీ పౌరసత్వం తీసుకున్నారు. తరువాత దాన్ని వదులుకున్నట్టు చెబుతారు. ఆయన పౌరసత్వానికి సంబంధించి సుప్రీంకోర్టు వరకూ కేసు వెళ్లింది. తరచూ వివాదం అవుతూ ఉండేది. టికెట్ మార్పు వెనక కారణాల్లో ఇది ముఖ్యమైనదని తెలుస్తోంది. ఆయన స్థానంలో చల్మెడ లక్ష్మీ నరసింహారావుకు అవకాశం ఇచ్చారు.
బోథ్: రాథోడ్ బాపూ రావు స్థానంలో అనిల్ జాదవ్ సీటు ఇచ్చారు. బాపూరావుకు వ్యతిరేకంగా మరో రెండు గ్రూపులు బీఆర్ఎస్‌లోనే ఉన్నాయి. వారిలో మాజీ ఎమ్మెల్యే నగేశ్‌ది ఒక గ్రూపు కాగా, గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 28 వేల ఓట్లు తెచ్చుకున్న అనిల్ జాదవ్ మరో గ్రూపు. ఈసారి అనిల్ జాదవ్ వైపు మొగ్గు చూపింది బీఆర్ఎస్ నాయకత్వం.
కోరుట్ల: ఇక్కడ ప్రస్తుతం కల్వకుంట్ల విద్యాసాగర రావు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన స్థానంలో ఆయన కుమారుడు సంజయ్‌కు టికెట్ ఇచ్చారు. సంజయ్, కేటీఆర్‌కు సన్నిహితుడు.
కమ్యూనిస్టులతో పొత్తు లేనట్టే
ఇప్పటి వరకూ తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీలతో బీఆర్ఎస్ పొత్తు ఉంటుందని అనేక ఊహాగానాలు వచ్చాయి. కానీ కమ్యూనిస్టులకు బలం ఉన్న, వారు కోరుకునే అవకాశం ఉన్న స్థానాల్లో కూడా అభ్యర్థులను ప్రకటించడం ద్వారా కేసీఆర్ ఆ ఊహాగానాలకు తెర దించారు.
మునుగోడు, పాలేరు, భద్రాచాలం, బెల్లంపల్లి, కొత్తగూడెం వంటి స్థానాల్లో అభ్యర్థులు ఖరారు కావడంతో ఇక పొత్తు లేదనే స్పష్టత వచ్చేసింది.
మైనంపల్లి హనుమంతరావు వ్యాఖ్యలపై కేసీఆర్ ఏమన్నారు?
తనకు మల్కాజ్‌గిరి టికెట్, తన కొడుకు రోహిత్‌కు మెదక్ టికెట్ ఇవ్వకపోతే ఊరుకునేది లేదని మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎమ్మల్యే మైనంపల్లి హనుమంత రావు బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటనకు ముందు తిరుమలలో హెచ్చరించారు.
‘‘మల్కాజ్‌గిరిలో నేనూ, మెదక్‌లో మా అబ్బాయీ పోటీ చేస్తాం. నేను రాజకీయాలు పక్కన పెట్టి అయినా మా అబ్బాయిని మెదక్‌లో ఎమ్మెల్యేగా గెలిపిస్తాను. వాళ్లకు(బీఆర్‌ఎస్ నాయకత్వానికి) ఒకటే చెప్పా. ఇస్తే ఇద్దరికీ టికెట్ ఇవ్వండి, లేకపోతే ఇద్దరికీ ఇవ్వవద్దు అన్నాను. వాళ్లు కుటుంబమంతా ఉన్నారు. ఒకే కుటుంబంలో రెండు సీట్లు అని కాదు, సామర్థ్యాన్ని బట్టి ఇవ్వాలి’’ అని మైనంపల్లి తిరుమలలో చెప్పారు.
అభ్యర్థుల ప్రకటన అనంతరం ఆయన వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందిస్తూ- హనుమంతరావుకు టికెట్ ఇచ్చామని, పోటీ చేస్తారో లేదో ఆయన ఇష్టమని వ్యాఖ్యానించారు.
ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన మైనంపల్లి హనుమంతరావు, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు.
ఇవి కూడా చదవండి:
- చంద్రయాన్-3 ల్యాండింగ్‌లో ఆ 15 నిమిషాలే ఎందుకు కీలకం... ‘ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ టెర్రర్’ అని ఇస్రో మాజీ చైర్మన్ ఎందుకన్నారు?
- BRICS కూటమి ఎలా మొదలైంది... ఇందులో చేరాలని 40 దేశాలు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నాయి?
- ఎంటర్ ది డ్రాగన్‌కు 50 ఏళ్లు: విడుదలకు ముందే బ్రూస్ లీ ఎలా మరణించారు, ఈ చిత్రం సినిమా చరిత్రను ఎలా మార్చింది?
- మేడ మీద చేపల పెంపకం - ఆదాయం ఎంతో తెలుసా
- చంద్రుడు లేకపోతే భూమికి ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














