ఇండియా, ఎన్డీఏ: ఏ కూటమిలో ఏ పార్టీలు ఉన్నాయి? ఎవరికి ఎంతమంది ఎంపీలు ఉన్నారు

అమిత్ షా, పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, twitter/AmitShah

దిల్లీలో మంగళవారం నిర్వహించిన ఎన్డీఏ పార్టీల సమావేశానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హాజరయ్యారు.

నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి జనసేన నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు.

మరోవైపు అదేరోజు జరిగిన విపక్షాల కూటమి 'ఇండియా' సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి ఏ ప్రాంతీయ పార్టీ వెళ్లలేదు.

తెలుగురాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, వైఎస్సార్‌సీపీలకు ఏ కూటమి నుంచీ పిలుపు రాలేదు.

మరో ప్రధాన పార్టీ తెలుగుదేశం గత ఎన్నికలలో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసింది. అనంతరం బీజేపీ మిత్రపక్షమైన జనసేనతో రాష్ట్ర స్థాయిలో భావసారూప్యత కనబరుస్తోంది.

జులై 18న సాయంత్రం దిల్లీలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి కొన్ని గంటల ముందు, బెంగళూరులో ప్రతిపక్ష కూటమి సమావేశం కూడా జరిగింది.

ప్రతిపక్ష పార్టీల కూటమికి 'ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్' అంటే 'ఇండియా' అని పేరు పెట్టారు.

కాగా, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, విపక్ష పార్టీల 'ఇండియా' కూటమి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని స్పష్టమవుతోంది.

'ఇండియా' కూటమి సమావేశం

ఫొటో సోర్స్, TWITTER

ప్రస్తుతం ఎన్డీఏలో 38 పార్టీలు, ఇండియా కూటమిలో 26 పార్టీలు ఉన్నాయి. అయితే ఇప్పటికీ రెండు కూటములకు కొన్ని పార్టీలు తమ మద్దతు తెలపలేదు.

ఇందులో బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, బీజేడీ, టీడీపీ, బీఎస్పీలాంటి పార్టీలు ఉన్నాయి.

ఈ పార్టీలు ఈ రెండు కూటములలో దేనిలో చేరతాయి? లేక మూడో కూటమికి ప్రయత్నిస్తాయా అనే దానిపై స్పష్టత లేదు.

రెండు కూటములను పరిశీలిస్తే బలాలు, బలహీనతలు రెండూ ఉన్నాయి.

ఎన్డీయేలో కూటమిలో బీజేపీకి 301 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. అనంతరం అత్యధిక ఎంపీలు గల తర్వాత స్థానంలో 13 మంది సభ్యులతో శివసేన (శిందే గ్రూపు) ఉంది. ఇది కాకుండా ఇంకా పెద్ద పార్టీలు ఈ కూటమిలో చేరలేదు.

ఇండియా కూటమిలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకె, ఆమ్ ఆద్మీ పార్టీ, జనతాదళ్(యునైటెడ్) వంటి అనేక బలమైన పార్టీల ఉనికి కనిపిస్తున్నప్పటికీ వాటన్నిటినీ కలిపి ఎవరు నడిపిస్తారో ఇప్పటికీ స్పష్టంగా తెలియదు.

అంతేకాకుండా వివిధ అంశాలలో ఆయా పార్టీలు ఒకదానికొకటి వ్యతిరేకిస్తున్నట్లు, కొన్నింటిపై విభేదిస్తున్నట్లు కూడా ఉంది. అందువల్ల ఈ ఫ్రంట్ ఎలా పని చేస్తుందనే దానిపై చాలామందికి సందేహాలున్నాయి.

అందులోనూ ఈ కూటములలో చాలా పార్టీలు భాగస్వామ్యం కాలేదు.

ఈ నేపథ్యంలో NDA, INDIA, ఇంకా తమ మద్దతును ప్రకటించని పార్టీల జాబితా, వాటి రాష్ట్రం, లోక్‌సభలో ఈ పార్టీల ప్రస్తుత బలం గురించి వివరాలు తెలుసుకుందాం.

ఎన్డీఏ సమావేశం

ఫొటో సోర్స్, TWITTER

నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) భాగస్వామ్య పార్టీలు.

ఎన్డీఏ కూటమిలోని పార్టీలు, రాష్ట్రం, ఎంపీల సంఖ్య పరిశీలిస్తే..

  • భారతీయ జనతా పార్టీ - 301 ఎంపీలు
  • శివసేన (షిండే) - మహారాష్ట్ర - 13 ఎంపీలు
  • రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (పశుపతి కుమార్ పరాస్) – బిహార్ - 05
  • అప్నా దళ్ (సోనిలాల్) - ఉత్తర ప్రదేశ్ - 02
  • నేషనల్ పీపుల్స్ పార్టీ – జాతీయ పార్టీ - 01
  • ఎన్సీపీ (అజిత్ పవార్) - మహారాష్ట్ర - 01
  • లోక్ జన్ శక్తి పార్టీ (రామ్ విలాస్ పాశ్వాన్) - బిహార్ - 01
  • నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ – నాగాలాండ్ - 01
  • ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ – జార్ఖండ్ - 01
  • సిక్కిం క్రాంతికారి మోర్చా – సిక్కిం - 01
  • మిజో నేషనల్ ఫ్రంట్ – మిజోరం - 01
  • నాగా పీపుల్స్ ఫ్రంట్ - నాగాలాండ్ - 01
  • జనసేన పార్టీ - ఆంధ్రప్రదేశ్ - 00
  • ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర - త్రిపుర - 00
  • రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (రీకాల్డ్) - మహారాష్ట్ర - 00
  • అస్సాం గణ పరిషత్ - అస్సాం - 00
  • పాటల్లి మక్కల్ కట్చి - తమిళనాడు - 00
  • తమిళ్ మనీలా కాంగ్రెస్ - తమిళనాడు - 00
  • యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ - అస్సాం - 00
  • సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ - ఉత్తరప్రదేశ్ - 00
  • శిరోమణి అకాలీదళ్ (యునైటెడ్) - పంజాబ్ - 00
  • మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ - గోవా - 00
  • జననాయక్ జనతా పార్టీ - హర్యానా - 00
  • ప్రహర్ జన్ శక్తి పార్టీ - మహారాష్ట్ర - 00
  • రాష్ట్రీయ సమాజ్ పార్టీ - మహారాష్ట్ర - 00
  • జన్సురాజ్ శక్తి పార్టీ - మహారాష్ట్ర - 00
  • కుకీ పీపుల్స్ అలయన్స్ - మణిపూర్ - 00
  • యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ - మేఘాలయ - 00
  • హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ - మేఘాలయ - 00
  • నిషాద్ పార్టీ - ఉత్తరప్రదేశ్ - 00
  • ఆల్ ఇండియా ఎన్. ఆర్. కాంగ్రెస్ - పుదుచ్చేరి - 00
  • హిందుస్తానీ అవామ్ మోర్చా (హమ్) - బిహార్ - 00
  • హర్యానా లోఖిత్ పార్టీ - 00
  • భారత్ ధర్మ జనసేన - కేరళ - 00
  • కేరళ కామరాజ్ కాంగ్రెస్ - కేరళ - 00
  • పుదియా తమిళగం - తమిళనాడు - 00
  • గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ - పశ్చిమ బెంగాల్ - 00
  • ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) – తమిళనాడు - 00.
ఇండియా కూటమి

ఫొటో సోర్స్, TWITTER

ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా)లో సభ్య పార్టీలు

  • కాంగ్రెస్ - జాతీయ పార్టీ - 49
  • ద్రవిడ మున్నేట్ర కజగం – తమిళనాడు- 24
  • ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ - పశ్చిమ బెంగాల్ - 23
  • జనతాదళ్ (యునైటెడ్) - బిహార్ - 16
  • శివసేన (ఉద్దవ్ ఠాక్రే) – మహారాష్ట్ర - 06
  • మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ {CPI(M)} - జాతీయ పార్టీ - 03
  • ఎన్సీపీ (శరద్ పవార్) - మహారాష్ట్ర - 03
  • సమాజ్ వాదీ పార్టీ - ఉత్తర ప్రదేశ్ - 03
  • జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ – జమ్మూ కశ్మీర్ - 03
  • ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ - కేరళ - 03
  • కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) - కేరళ - 02
  • విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) - తమిళనాడు - 02
  • ఆమ్ ఆద్మీ పార్టీ – జాతీయ పార్టీ - 01
  • జార్ఖండ్ ముక్తి మోర్చా – జార్ఖండ్ - 01
  • కేరళ కాంగ్రెస్ (ఎం) - కేరళ - 01
  • మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం (MDMK) - తమిళనాడు - 01
  • రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (RSP) – పశ్చిమ బెంగాల్ - 01
  • కొంగునాడు మక్కల్ దేశీయ కట్చి (KMDK) – తమిళనాడు - 01
  • రాష్ట్రీయ జనతాదళ్ - బిహార్ - 00
  • రాష్ట్రీయ లోక్ దళ్ - ఉత్తర ప్రదేశ్ - 00
  • అప్నా దళ్ (కెమెరాస్ట్‌లు) – ఉత్తర ప్రదేశ్ - 00
  • పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) – కేరళ - 00
  • కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్స్-లెనినిస్ట్ లిబరేషన్ {CPI(ML)} - బిహార్ - 00
  • ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ - పశ్చిమ బెంగాల్ - 00
  • మనితనేయ మక్కల్ కట్చి (MMK) - తమిళనాడు - 00
  • కేరళ కాంగ్రెస్ (జోసెఫ్) - కేరళ - 00
కేసీఆర్, జగన్

ఏ కూటమిలో చేరని ప్రధాన పార్టీలు

  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ - ఆంధ్రప్రదేశ్ - 22
  • బిజు జనతా దళ్ - ఒడిశా - 12
  • భారత రాష్ట్ర సమితి - తెలంగాణ - 09
  • బహుజన్ సమాజ్ పార్టీ - జాతీయ పార్టీ - 09
  • తెలుగుదేశం పార్టీ - ఆంధ్రప్రదేశ్ - 03
  • ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాదుల్ ముస్లిమిన్ (AIMIM) - తెలంగాణ - 02
  • జనతాదళ్ (సెక్యులర్) - కర్ణాటక - 01
  • మహారాష్ట్ర నవనిర్మాణ సేన - మహారాష్ట్ర - 00

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)