రాహుల్ గాంధీ - బీజేపీ: జిన్నా ముస్లిం లీగ్‌కు, కాంగ్రెస్‌ మిత్రపక్షం ముస్లిం లీగ్‌‌కు మధ్య తేడా ఏమిటి?

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, వాషింగ్టన్ డీసీలో మీడియాతో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ

అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌(ఐయూఎంఎల్)’ను సెక్యులర్ పార్టీ అనడంపై వివాదం రేగుతోంది.

నేషనల్ ప్రెస్ క్లబ్ ఆఫ్ వాషింగ్టన్ డీసీలో కొందరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు.

కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌తో కాంగ్రెస్ పార్టీ పొత్తు లౌకికవాదానికి వ్యతిరేకం కాదా అని రాహుల్ గాంధీని కొందరు ప్రశ్నించారు. రాహుల్ సమాధానమిస్తూ- "ముస్లిం లీగ్‌ సెక్యులరిజానికి వ్యతిరేకం కాదు. ఈ ప్రశ్నను అడిగిన వ్యక్తి, ముస్లిం లీగ్‌ గురించి సరిగ్గా తెలుసుకోలేదని నా అభిప్రాయం’’ అన్నారు.

భారత్‌కు సంబంధించిన పలు ప్రశ్నలకు కూడా రాహుల్ సమాధానమిచ్చారు.

యుక్రెయిన్‌పై రష్యా దాడి విషయంలో భారతదేశ వైఖరిపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ- నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాన్ని ఆయన సమర్థించారు.

ఐయూఎంఎల్ కేరళలో ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ. కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి యూడీఎఫ్‌లో భాగస్వామి.

అయితే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌ను సెక్యులర్ పార్టీగా రాహుల్ చెప్పడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన విదేశాల్లో భారతదేశం పరువు తీస్తున్నారని విమర్శలు చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

బీజేపీ-కాంగ్రెస్ విమర్శల యుద్ధం

కేరళలోని వాయనాడ్‌ లోక్‌సభ నియోజకవర్గంలో తనకు సహకరించడానికి వీలుగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌ను రాహుల్ సెక్యులర్ పార్టీగా చెబుతున్నారని బీజేపీ నేత అమిత్ మాలవీయ విమర్శించారు.

2019 ఎన్నికల్లో వాయనాడ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన రాహుల్, ఇటీవల క్రిమినల్ పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడటంతో లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు.

మత ప్రాతిపదికన భారతదేశ విభజనకు మహమ్మద్ అలీ జిన్నా, ముస్లిం లీగ్ కారణమని, రాహుల్ ఆ పార్టీని సెక్యులర్ పార్టీగా పేర్కొంటున్నారని మాల్వియా ట్వీట్ చేశారు.

రాహుల్‌కు అవగాహన తక్కువని, ఆయన మాయలో పడిపోయారని, వాయనాడ్‌లో తనకు ఇబ్బందులు లేకుండా ఐయూఎంఎల్‌ను బుజ్జగించే పనిలో ఉన్నారని విమర్శించారు.

మాల్వియా విమర్శలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా ష్రినేట్ స్పందించారు.

‘‘హలో ఫేక్ న్యూస్ వ్యాపారీ, మీరు అర్ధరాత్రి వరకు మేలుకుని ఉండటాన్ని చూసి ఆనందిస్తున్నాం. రాబోయే రోజుల్లో రాహుల్ అమెరికా యాత్రను ట్రాక్ చేస్తూ, మరిన్ని నిద్రలేని రాత్రులు గడపండి’’ అని ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ మరో అధికార ప్రతినిధి పవన్ ఖేడా కూడా స్పందించారు. ‘‘నువ్వు మరీ నిరక్షరాస్యుడిలా ఉన్నావు సోదరా. కేరళ ముస్లిం లీగ్‌‌కు, జిన్నా ముస్లిం లీగ్‌కు తేడా కూడా తెలియదా? జిన్నా ముస్లిం లీగ్‌తో మీ పూర్వీకులు పొత్తు పెట్టుకున్నారు. మీ బీజేపీ కూడా ఈ మధ్య ముస్లిం లీగ్‌తో పొత్తు పెట్టుకుంది’’ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, ANI

బీజేపీ-ముస్లిం లీగ్ పొత్తు

2012 సంవత్సరంలో నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవిని పొందడానికి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మద్దతును బీజేపీ కోరడాన్ని పవన్ ఖేడా తన ట్వీట్‌లో ఉదహరించారు.

అప్పట్లో నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ 62 సీట్లు గెలుచుకుంది. 145 మంది సభ్యులున్న సభలో మెజారిటీకి 73 మంది సభ్యులు అవసరం. ఇద్దరు ముస్లిం లీగ్ సభ్యులు, 10 మంది స్వతంత్ర సభ్యుల సహకారంతో బీజేపీ మెజారిటీ మార్కును సాధించింది.

2019లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేస్తూ, "ముస్లిం లీగ్ ఒక వైరస్. ఎవరికైనా అలాంటి వైరస్ సోకితే, అతను మనుగడ సాగించలేడు. ఈ రోజు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా దాని బారిన పడింది. వారు గెలిస్తే ఏమి జరుగుతుందో ఆలోచించండి. ఈ వైరస్ దేశమంతటా వ్యాపిస్తుంది’’ అని రాశారు.

2019లో వాయనాడ్‌ నుంచి పోటీ చేసిన రాహుల్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మద్దతు కోరడాన్ని అప్పటో బీజేపీ నేతలు ప్రశ్నించారు.

మహమ్మద్ అలీ జిన్నా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ ఏర్పాటే లక్ష్యంగా మహమ్మద్ అలీ జిన్నా ఆల్ ఇండియా ముస్లిం లీగ్ స్థాపించారు.

జిన్నా ముస్లిం లీగ్‌ ఏమైంది?

పాకిస్తాన్ ఏర్పాటు లక్ష్యంగా ఏర్పాటైన ముస్లిం లీగ్, సొంత దేశం ఏర్పడ్డాక రద్దయింది.

పాకిస్తాన్ అవతరణ తర్వాత, మహమ్మద్ అలీ జిన్నా ఆ దేశానికి గవర్నర్ జనరల్ అయ్యారు.

ఆ తర్వాత ఆర్నెళ్లకు పాకిస్తాన్‌లో మళ్లీ ముస్లిం లీగ్ ఏర్పడగా, తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్ )లో ఆల్ పాకిస్తాన్ అవామీ ముస్లిం లీగ్ ఏర్పాటైంది.

పాకిస్తాన్‌ మొదటి ఆరుగురు ప్రధానులు ముస్లిం లీగ్ పార్టీ తరఫున ఎన్నికైనవారే. అయితే, వారి పదవీ కాలం చాలా చిన్నది. అదే పార్టీ నుంచి వచ్చిన జనరల్ ఆయూబ్ ఖాన్ దేశంలో సైనిక పాలన విధించారు. మరోసారి పార్టీ రద్దయింది.

మరికొన్నాళ్ల తర్వాత ఆయుబ్ ఖాన్ ముస్లిం లీగ్ పార్టీని పునరుద్ధరించారు. అది అనేక దశాబ్దాలపాటు కొనసాగింది. ప్రస్తుత ప్రధాని షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీకి చెందినవారు కాగా, ఈ పార్టీ ఒకప్పటి ముస్లిం లీగ్ నుంచి విడిపోయి ఏర్పడిన ఒక వర్గం.

తూర్పు పాకిస్తాన్‌లో అవామీ లీగ్ బెంగాలీ జాతీయవాదం పేరుతో పోరాటాలు చేసింది. పాకిస్తాన్ నుంచి విముక్తి కోసం ప్రయత్నించింది. ఆ తర్వాత షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో పశ్చిమ పాకిస్తాన్ నుంచి విడిపోయి తూర్పు పాకిస్తాన్ కాస్తా బంగ్లాదేశ్ పేరుతో కొత్త దేశంగా ఏర్పడింది.

ఐయూఎంఎల్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఒక ఆందోళన కార్యక్రమంలో ఐయూఎంఎల్ పార్టీ కార్యకర్తలు

భారత్‌లో ముస్లిం లీగ్ పాత్ర ఏంటి?

జిన్నా ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా ముస్లిం లీగ్, స్వతంత్రం వచ్చాక ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌గా మారింది. రాజ్యాంగం ప్రకారం ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చింది. లోక్‌సభలో దాని ప్రాతినిధ్యం స్థిరంగా ఉంటూ వస్తోంది.

కేరళలో బలంగా ఉన్న ఈ పార్టీకి తమిళనాడు విభాగం కూడా ఉంది. ఎన్నికల కమిషన్ దీనిని చాలా కాలం రాష్ట్ర పార్టీగా గుర్తించింది.

ఐయూఎంఎల్ జెండాలో ఆకుపచ్చ రంగు మీద తెలుపు రంగులో చంద్రుడు, నక్షత్రం కనిపిస్తాయి. పాకిస్తాన్‌లో ఆ పార్టీ జెండాకు ఇది భిన్నంగా ఉంటుంది.

3వ లోక్ సభ నుంచి, 16వ లోక్‌సభ వరకు ఆ పార్టీకి ఇద్దరేసి ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు.

సుదీర్ఘకాలంగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగిస్తోంది.

కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్‌‌‌లో ఈ పార్టీ భాగస్వామి.

2011లో ఆ పార్టీకి 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుత అసెంబ్లీలో ఆ పార్టీ సభ్యులు 18 మంది.

వీడియో క్యాప్షన్, కాశీ-జ్ఞాన్‌వాపి వివాదమేంటి? దాని వెనుక ఉన్న చారిత్రక మూలాలేంటి?

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)