ఫస్ట్ డే-ఫస్ట్ షో, ఏపీ ఫైబర్‌నెట్: కొత్త సినిమాలను నేరుగా ఇంట్లోనే రిలీజ్ రోజే చూసే సదుపాయం

ఫస్ట్ డే.. ఫస్ట్ షో

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రాజేశ్ పెదగాడి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘ఫస్ట్ డే.. ఫస్ట్ షో’’ పేరుతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) కొత్త సేవలను మొదలుపెడుతోంది.

కొత్త సినిమాలను విడుదలైన రోజు నుంచే ఇంట్లోనే చూసేందుకు ఈ సేవలు వీలు కల్పిస్తాయని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి తెలిపారు.

విశాఖపట్నంలో శుక్రవారం ఈ సేవలను ప్రారంభిస్తున్నారు.

ఇంతకు ఏమిటీ ‘‘ఫస్ట్ డే.. ఫస్ట్ షో’’? దీనికి సబ్‌స్రైబ్ చేసుకోవడం ఎలా? దీనిపై నెటిజన్లు ఏమంటున్నారు? సినీ వర్గాలు ఏమంటున్నాయి?

ఫస్ట్ డే.. ఫస్ట్ షో

ఫొటో సోర్స్, Getty Images

ఎంత మంది వినియోగదారులు ఉన్నారు?

ఏపీఎస్ఎఫ్ఎల్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ. రాష్ట్రాన్ని హైస్పీడ్ ఫైబర్ ఇంటర్నెట్‌తో అనుసంధానించి, ఇంటర్నెట్ సేవలను విస్తరించడమే లక్ష్యంగా అక్టోబరు 2015లో దీన్ని మొదలుపెట్టారు.

ఏపీ ఫైబర్ గ్రిడ్‌లో గ్రామాలను హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానించడంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు సంస్థ చెబుతోంది. ఇంటర్నెట్‌తోపాటు టీవీ, టెలిఫోన్ సేవలను కూడా సంస్థ అందిస్తోంది.

ప్రస్తుతం ఏపీఎస్ఎఫ్ఎల్‌ 9,70,000 ఇళ్లు, కార్యాలయాలకు సేవలు అందిస్తోంది. 24,000 కి.మీ.ల ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లను ఏర్పాటుచేశామని, 5,400 గ్రామాల్లో సేవలు అందిస్తున్నామని సంస్థ చెబుతోంది.

2023 నాటికి రాష్ట్రంలోని 1.4 కోట్ల ఇళ్లలో 50 లక్షల ఇళ్లను ఇంటర్నెట్‌తో అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీఎస్‌ఎఫ్ఎల్ ఎండీ ఎం మధుసూధన్ రెడ్డి 2020లో ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

‘‘ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు చేరుకోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ సేవలను కల్పించడమే మా సంస్థ లక్ష్యం. సామాజిక సేవకు సంస్థ ప్రాధాన్యం ఇస్తుంది’’ అని ఆయన అన్నారు.

ఫస్ట్ డే.. ఫస్ట్ షో

ఫొటో సోర్స్, Getty Images

ఏమిటీ ‘‘ఫస్ట్ డే.. ఫస్ట్ షో’’?

అయితే, నేడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో పోటీపడుతూ ‘‘ఫస్ట్ డే.. ఫస్ట్ షో’’ సేవలను ఏపీఎస్ఎఫ్ఎల్ అందుబాటులోకి తీసుకొస్తోంది.

ఈ సేవలు ఎలా పనిచేస్తాయో మే 30న విలేఖరుల సమావేశంలో ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడారు.

‘‘నేరుగా ఇంటి నుంచే ప్రజలు కొత్త సినిమాలు చూసేలా ఈ సేవలను ప్రారంభిస్తున్నాం. దీని కోసం ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ ఓటీటీపై ప్రజలు ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది’’ అని ఆయన చెప్పారు.

‘‘నేడు మార్కెట్‌లో ఓటీటీ హవా నడుస్తోంది. ప్రజలు థియేటర్‌కు వెళ్లే కంటే ఇంటిలోనే సినిమా చూసేందుకు మొగ్గు చూపుతున్నారు. అందుకే మేం సినీ ప్రముఖలతో చర్చలు జరిపి ఈ సేవలను తీసుకొచ్చాం. దీని కోసం మా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై సినిమాలను వినియోగదారులు ప్రత్యేకంగా సబ్‌స్ర్కైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు రూ.99తో ఒక సినిమాను సబ్‌స్క్రైబ్ చేసుకుంటే ఇది 24 గంటలు పనిచేస్తుంది. ఆ సమయంలో ఎన్నిసార్లైనా ఆ సినిమాను చూసుకోవచ్చు. సబ్‌స్క్రిప్షన్ల ఆధారంగా మేం నిర్మాతలకు డబ్బులు చెల్లిస్తాం’’ అని ఆయన అన్నారు.

థియేటర్లు దొరక్క ఇబ్బంది పడుతున్న చిన్న నిర్మాతలకు ఈ సేవలు చాలా మేలు చేస్తాయని గౌతమ్ రెడ్డి చెబుతున్నారు.

ఫస్ట్ డే.. ఫస్ట్ షో

ఫొటో సోర్స్, @KONIDELAPRO

ఏ సినిమాలు వస్తాయి?

‘‘ఫస్ట్ డే.. ఫస్ట్ షో’’ సేవల్లో భాగంగా ‘‘నిరీక్షణ’’ సినిమాను తొలి రోజు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఏపీఎస్ఎఫ్ఎల్ తెలిపింది.

నిర్మాతలు తమ దగ్గరకు వస్తేనే వారి సినిమాలను తమ ఓటీటీపై అందుబాటులో ఉంచుతామని గౌతమ్ రెడ్డి అంటున్నారు.

అయితే, ఫస్ట్ డే.. ఫస్ట్ షో సేవలపై సినీ ప్రముఖులు, నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

గౌతమ్ రెడ్డి విలేకరుల సమావేశానికి ప్రొడ్యూసర్ల కౌన్సిల్ సభ్యులు సీ కల్యాణ్, రామ సత్యనారాయణ లాంటి ప్రముఖులు హాజరయ్యారు. కొందరు సినీ ప్రముఖులు ఈ సేవలకు మద్దతుగా స్పందిస్తున్నారు.

‘‘కచ్చితంగా అన్ని సినిమాలూ రావు. సినిమా థియేటర్లు, ఓటీటీల వరకు చేరుకోని కొన్ని చిన్న సినిమాలకు ఇది ఉపయోగపడొచ్చు’’ అని తెలుగు మూవీస్ జీ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ నిమ్మకాయల అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

ఈ సేవలపై విమర్శలు కూడా వస్తున్నాయి. ట్యాక్సీవాలా నిర్మాత శ్రీనివాస్ కుమార్ స్పందిస్తూ.. ‘‘ఏ ప్రముఖ నిర్మాత లేదా డిస్ట్రిబ్యూటర్ లేదా ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు దీనికి అంగీకరించవు. ఎందుకంటే దీనితో వారికి ఎలాంటి మేలూ జరగదు. అంతేకాదు ప్రజల థియేటర్ అనుభూతిని ఇది చంపేస్తుంది’’ అని వ్యాఖ్యలు చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

నెటిజన్ల నుంచి కూడా మిశ్రమ స్పందన వస్తోంది. ‘‘ఈ నిర్ణయానికి చిన్న సినిమాలు మాత్రమే ఒప్పుకుంటాయి. నాకు తెలిసినంత వరకు ఏ ప్రముఖ నిర్మాత తమ సినిమాను ఏపీఎఫ్ఎఫ్ఎల్‌కు విక్రయించరు. ఏపీ ప్రభుత్వం బలవంతం చేస్తే తప్పా..’’అని మురళీ ఎస్ వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

సింహా అనే నెటిజన్ స్పందిస్తూ.. దీన్ని ‘‘సినిమా ఒడి’’ పథకంగా చెబుతూ జోక్ చేశారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)