లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
నేరారోపణలపై స్టే విధించాలని తాను దాఖలు చేసిన అభ్యర్థనను గుజరాత్ హైకోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, GETTY IMAGES
మోదీ సర్‌నేమ్ కేసులో రెండు సంవత్సరాల జైలు శిక్షకు గురైన కాంగ్రెస్ సీనియర్ రాహుల్ గాంధీ ఈ కేసును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
నేరారోపణలపై స్టే విధించాలని తాను దాఖలు చేసిన అభ్యర్థనను గుజరాత్ హైకోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకి వెళ్లినట్లు ఈ కేసుతో సంబంధమున్న న్యాయవాది ఒకరు చెప్పారు.
2019 నాటి ఈ కేసులో రాహుల్ గాంధీకి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునివ్వగా, రాహుల్ దానిని గుజరాత్ హైకోర్టులో సవాల్ చేశారు.
రాహుల్ గాంధీ అభ్యర్థనను గుజరాత్ హైకోర్టు జూలై 7న కొట్టివేసింది. నేరారోపణలపై స్టే విధించేందుకు నిరాకరిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.
దీంతో ఆయన రాహుల్ తాజాగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, UGC
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఓ బోరులోంచి మంటలు ఎగసిపడ్డాయి.
శనివారం ఉదయం రాజోలు మండలం శివకోడు పరిధిలోని ఆక్వా చెరువుల సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
సమాచారం అందుకున్న ఓఎన్‌జీసీ అధికారులు, మంటలార్పే సిబ్బంది సుమారు రెండు గంటలు పాటు ప్రయత్నించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితి నెలకొందని ఓఎన్‌జీసీ అధికారులు ప్రకటించారు.

ఫొటో సోర్స్, UGC
నీటి కోసం తవ్వి వదిలేసిన బోరు స్థలంలో ప్రమాదం జరిగినట్టు గుర్తించారు.
బోరు డ్రిల్లింగ్ మిషన్ గ్యాస్ పైప్ లైన్‌కు తగిలి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని ఓఎన్‌జీసీ చెప్పింది.

ఫొటో సోర్స్, UGC
కోనసీమలో అనేక మార్లు వివిధ చమురు కంపెనీల పైప్ లైన్ నుంచి లీకేజీల వల్ల ప్రమాదాలు జరిగాయి. వాటిని నియంత్రించే ప్రయత్నాలు కొనసాగుతున్నా, ఎక్కడో చోట ఇవి వెలుగు చూస్తూనే ఉన్నాయి.
ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని శివకోడు మాజీ సర్పంచ్ నక్క రామారావు కోరారు.

ఫొటో సోర్స్, Getty Images
డొమినికాలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ మూడు రోజుల్లోనే విజయాన్ని అందుకుంది.
ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా, రెండు మ్యాచుల సిరీస్‌లో ముందడుగు వేసింది.
రెండు ఇన్సింగ్స్‌లలో కలిపి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 12 వికెట్లు పడగొట్టాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది.
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల నష్టానికి 421 పరుగుల భారీ స్కోరు చేసి, 271 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.
భారత బౌలర్ల దెబ్బకు రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ 130 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
అరంగేట్రంలోనే సెంచరీ (387 బంతుల్లో 171 పరుగులు) కొట్టి అందరి దృష్టిని ఆకర్షించిన యశస్వి జైస్వాల్, కెప్టెన్ రోహిత్ శర్మ (221 బంతుల్లో 103 పరుగులు), విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్ భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.
యశస్వి జైస్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
రెండో టెస్ట్ జులై 20 నుంచి జరుగనుంది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం!