చంద్రయాన్-3: చంద్రుడివైపు విజయవంతంగా దూసుకుపోయిన ఇస్రో రాకెట్
చంద్రయాన్-3 రాకెట్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీహరికోట నుంచి మధ్యాహ్నం 2.35 గంటలకు ప్రయోగించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ మిషన్‌ను ప్రయోగించింది.
లైవ్ కవరేజీ
ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి
బీబీసీ తెలుగు లైవ్ పేజీని ముగిస్తున్నాం
బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఫాలో అయినందుకు ధన్యవాదాలు.
రేపు ఉదయం మళ్ళీ లైవ్ అప్డేట్స్ పేజీలో మళ్ళీ కలుసుకుందాం.
అంతవరకు సెలవు. నమస్తే. గుడ్ నైట్.
చంద్రయాన్-3: రోవర్ 'ప్రజ్ఞాన్' చంద్రునిపై ఎప్పుడు దిగుతుంది, ఈ మిషన్‌తో భారత్ సాధించేదేమిటి... 5 కీలక ప్రశ్నలు, సమాధానాలు
హిందూ మహాసముద్రంలో నౌకలకు ఆ 'పాయింట్' వద్ద ఒక వింత అనుభవం ఎదురవుతుంది... ఎందుకు?
యమున: దారుణమైన కాలుష్యం, దడ పుట్టించే వరదలు... ఈ నదికేమైంది ?
జమ్మూకశ్మీర్ ప్రశాంతంగా ఉందని ప్రభుత్వం చెబుతోంది... మరి కశ్మీరీలు ఏం అంటున్నారు?
వందే భారత్ రైళ్లలో సీట్లు ఖాళీగా ఎందుకుంటున్నాయి?
చంద్రయాన్-3: చంద్రుడివైపు దూసుకుపోయిన భారత రాకెట్
చంద్రయాన్-3 రాకెట్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీహరికోట నుంచి మధ్యాహ్నం 2.35 గంటలకు ప్రయోగించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ మిషన్‌ను ప్రయోగించింది.
చంద్రయాన్-3 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూడడానికి వివిధ ప్రాంతాలకు చెందిన పాఠశాలల నుంచి దాదాపు 200 మంది విద్యార్థులు ఈ స్పేస్ సెంటర్‌కు చేరుకున్నారు.
చంద్రయాన్-3 ప్రయోగాన్ని బీబీసీ తెలుగు యూట్యూబ్ లైవ్‌లో చూడండి:
పోస్ట్ YouTube స్కిప్ చేయండిGoogle YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
చంద్రయాన్-3 ప్రయోగానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేస్తూ, “భారత అంతరిక్ష పరిశోధనలో 2023 జూలై 14వ తేదీ చరిత్రలో నిలిచిపోతుంది”అని వ్యాఖ్యానించారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించిన తరువాత ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్, ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. వీరముత్తువేల్ ఆనందంతో పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు.
“చంద్రయాన్-3 నిర్దిష్టమైన కక్ష్యలో చంద్రుడి వైపు ప్రయాణిస్తోంది. స్పేస్ క్రాఫ్ట్ పనితీరు చక్కగా ఉంది”అని ఇస్రో ప్రకటించింది.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
4,000 మంది మహిళలకు రహస్యంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారని ముస్లిం వైద్యుడిపై ఆరోపణలు ఎందుకు?
రాకెట్లను శ్రీహరి కోట నుంచే ఎందుకు ప్రయోగిస్తారు?
ప్రధాని మోదీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం

ఫొటో సోర్స్, PTI/TWITTER
భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం లభించింది.
'గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్' అనే పురస్కారంరతో మోదీని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ సత్కరించారు.
ఇది ఫ్రాన్స్‌కు చెందిన అత్యున్నత సైనిక లేదా పౌర పురస్కారం.
రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న మోదీకి పారిస్‌లోలోని ఎలిసీ ప్యాలెస్‌లో మేక్రాన్ ఈ పురస్కారాన్ని అందజేశారు.
ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారత ప్రధాని మోదీ కావడం విశేషం. జర్మనీ మాజీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా, కింగ్ చార్లెస్ గతంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఎస్‌ఏజీ: హాలీవుడ్‌లో సమ్మె బాట పట్టిన నటులు

ఫొటో సోర్స్, Getty Images
హాలీవుడ్‌లో జరుగుతోన్న అతిపెద్ద సమ్మెలో స్క్రీన్ రైటర్లతో పాటు తాము కూడా చేరతామని సినీ నటులు ప్రకటించారు.
గత 60 ఏళ్లలో హాలీవుడ్‌లో ఈ స్థాయి సమ్మె జరుగడం ఇదే తొలిసారి.
లాభాల్లో తమకు న్యాయమైన వాటా ఇవ్వడంతో పాటు పనిచేసేందుకు మెరుగైన పరిస్థితులను స్ట్రీమింగ్ దిగ్గజాలు (స్టూడియోలు, ఓటీటీలు) కల్పించాలని డిమాండ్ చేస్తూ ‘ద స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ (ఎస్‌ఏజీ) నిరసనలకు దిగింది.
హాలీవుడ్ సినీ రంగంతో సంబంధం ఉన్న దాదాపు 1,60,000 మంది పని చేయడం ఆపేస్తారు.
ఈ పనులు ఆగిపోవడం వల్ల అమెరికా చలన చిత్ర, టీవీ ప్రొడక్షన్లలో అత్యధిక భాగం పనులు నిలిచిపోతాయి.
గురువారం అర్ధరాత్రి నుంచి సమ్మె అమల్లోకి రావడంతో లండన్‌లో జరుగుతోన్న క్రిస్టోఫర్ నోలాన్ దర్శకత్వం వహించిన ఓపెన్ హైమర్ సినిమా ప్రీమియర్ నుంచి స్టార్ నటులు సిలియన్ మర్ఫీ, మాట్ డామన్, ఎమిలీ తప్పుకున్నారు.
భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి ఈ సమ్మె ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం నుంచి పికెటింగ్ మొదలవుతుంది.
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం!
