ప్రధాని మోదీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం

ఫొటో సోర్స్, PTI/TWITTER
భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం లభించింది.
'గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్' అనే పురస్కారంరతో మోదీని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ సత్కరించారు.
ఇది ఫ్రాన్స్‌కు చెందిన అత్యున్నత సైనిక లేదా పౌర పురస్కారం.
రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న మోదీకి పారిస్‌లోలోని ఎలిసీ ప్యాలెస్‌లో మేక్రాన్ ఈ పురస్కారాన్ని అందజేశారు.
ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారత ప్రధాని మోదీ కావడం విశేషం. జర్మనీ మాజీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా, కింగ్ చార్లెస్ గతంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది





