ప్రఖ్యాత రచయిత మిలన్ కుందేరా కన్నుమూత... ఆయన వయసు 94 ఏళ్ళు

మిలన్ కుందేరా మరణంతో భారతదేశం సహా అనేక దేశాల సాహిత్యాభిమానులు విచారం వ్యక్తం చేశారు. ఆధునిక సాహిత్యంలో అత్యంత ప్రాచుర్యం పొందిన రచయితలలో కుందేరా ఒకరు.

లైవ్ కవరేజీ

  1. విశాఖపట్నం: రొయ్యల ధరలు ఎందుకు తగ్గిపోతున్నాయి

  2. క్రికెట్: ఐసీసీ టోర్నమెంట్లలో ఇకపై మహిళలకు పురుషులతో సమానంగా ప్రైజ్ మనీ

  3. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా అప్డేట్స్‌లో లైవ్ పేజీలో మళ్ళీ కలుసుకుందాం.

    నమస్తే. గుడ్ నైట్.

  4. శ్రీలంక: 'నా భర్త పెట్రోల్ కోసం వెళితే చంపేశారు'

  5. ప్రఖ్యాత రచయిత మిలన్ కుందేరా ఇక లేరు... ఆయన వయసు 94 ఏళ్ళు

    మిలన్ కుందేరా

    ఫొటో సోర్స్, Getty Images

    ప్రఖ్యాత రచయిత మిలన్ కుందేరా పారిస్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 94 ఏళ్ళు. ఆయన మరణంతో భారతదేశం సహా అనేక దేశాల సాహిత్యాభిమానులు విచారం వ్యక్తం చేశారు.

    ఆధునిక సాహిత్యంలో అత్యంత ప్రాచుర్యం పొందిన రచయితలలో కుందేరా ఒకరు. ఆయన సైద్ధాంతికంగా వామపక్షవాదులకు వ్యతిరేకి అని చెబుతుంటారు. కానీ, ఆయన ఎప్పుడూ ఏ వాదం తరఫున సైద్ధాంతిక పోరాటం చేయలేదు. తానొక రచయితను, రచయితగా మాత్రమే గుర్తించండి అని ఆయన అనేవారు.

    మిలన్ కుందేరా 1984లో రచించిన ‘ది అన్‌బేరబుల్ లైట్‌నెస్ ఆఫ్ బీయింగ్’నవల సాహితీ ప్రపంచంలో అమోఘమైన ఆదరణ పొందింది.

    చెక్ రిపబ్లిక్‌లోని బ్రోనో సిటీలో ఉన్న మిలన్ కుందేరా లైబ్రరీ అధికార ప్రతినిధి అన్నా మ్రాజోవా, “సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉన్న మిలన్ కుందేరా కన్నుమూశారు” అని ప్రకటించారు.

    మిలన్ కుందేరా

    ఫొటో సోర్స్, Getty Images

    చెక్ సాహిత్యంలో ఎంతో గొప్ప పేరున్న కుందేరా, చెకస్లవేకియా కమ్యూనిస్ట్ పాలనను తీవ్రంగా విమర్శించారు. దాని ఫలితంగానే ఆయన 1975లో అక్కడి నుంచి ఫ్రాన్స్‌కు వెళ్ళిపోవాల్సి వచ్చింది.

    కుందేరా చెక్‌ సంపన్న కుటుంబంలో 1929లో జన్మించారు. ఆయన తండ్రి పియానో టీచర్‌. తండ్రి ప్రభావంతో కుందేరా చిన్న వయసులోనే సంగీతం నేర్చుకున్నారు.

    ది బుక్ ఆఫ్ లాఫ్టర్ అండ్ ఫర్గెటింగ్ (1979), ఇమ్మోర్టాలిటీ (1988) వంటి రచనలతో ఆయన పాఠకలోకాన్ని విశేషంగా ఆకట్టుకున్నారు. 1985లో జెరూసలెం ప్రైజ్ గెల్చుకున్న కుందేరా, ఎన్నో సార్లు నోబెల్ పురస్కారానికి పోటీ పడ్డారు. కానీ, అది ఆయనకు లభించలేదు.

  6. ఎలినా స్వితోలినా: వింబుల్డన్‌లో ఆమె సెమీస్‌కు చేరుకోవడం ఎంతో స్పెషల్... ఎందుకో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు

  7. ‘సీమా హైదర్‌ను పాకిస్తాన్‌కు పంపించాలి, లేదంటే సింధ్‌లో హిందువులపై, హిందూ ఆలయాలపై బాంబులు వేస్తాం’ - పాక్ బందిపోట్లు

  8. టమాటా బంగారమాయెనే... మదనపల్లె మార్కెట్లో ఏం జరుగుతోంది?

  9. రోహింజ్యాలు: ‘మమ్మల్ని చంపేసి మా శవాలను వెనక్కి పంపించేయండి’

  10. భారత్‌కు ఫ్రాన్స్ అంత ప్రాధాన్యం ఎందుకు ఇస్తోంది?

  11. చంద్రయాన్-3: ఇస్రో చంద్రునిపై నీటిని ఎలా గుర్తించింది?

  12. ఆంధ్రప్రదేశ్: ప్రజల సొమ్ము నుంచి వేతనాలు అందుకుంటున్న వాలంటీర్లు.. పార్టీ సేవ చేయవచ్చా?

  13. ‘వర్జిన్ కాదు, అందగత్తె, వయసు 12 ఏళ్లు'- ఇస్లామిక్ స్టేట్ యాజిదీ అమ్మాయిలను అమ్మకానికి పెట్టిందిలా...

  14. తెలంగాణ: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఎన్ని కడతామన్నారు? ఎన్ని కట్టారు?

  15. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా

    కిమ్ జాంగ్ ఉన్

    ఫొటో సోర్స్, REUTERS

    ఉత్తర కొరియా ఒక ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎం) ప్రయోగించినట్లు జపాన్ అధికారులు అనుమానిస్తున్నారు.

    ఇది ఒక ఐసీబీఎం కావొచ్చని నమ్ముతున్నట్లు జపాన్, దక్షిణ కొరియా మిలిటరీ అధికారులు చెప్పారు.

    ‘‘బుధవారం ఉదయం ఈ క్షిపణి దాదాపు గంటకు పైగా ఎగిరింది. జపాన్ జలాలకు సమీపంలో పడింది" అని జపాన్ రక్షణ మంత్రి అన్నారు.

    అమెరికా నిఘా విమానాలు తమ భూభాగంలోకి చొచ్చుకొచ్చాయని, దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఉత్తర కొరియా హెచ్చరించింది. ఈ హెచ్చరిక తర్వాతే క్షిపణిని ప్రయోగించారు.

    తమ భూభాగంలోకి చొచ్చుకొచ్చే అలాంటి విమానాలను కూల్చివేస్తామని ఈ వారం మొదట్లోనే ఉత్తర కొరియా హెచ్చరించింది.

    అయితే, ఈ ఆరోపణలను అమెరికా కొట్టేసింది. అంతర్జాతీయ చట్టాలకు లోబడే తమ సైనిక చర్యలు ఉన్నాయని స్పష్టం చేసింది.

  16. చిత్తూరు జిల్లా గనుల్లో ఎంత బంగారం ఉంది? ఎప్పుడు తవ్వబోతున్నారు?

  17. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడుల్లో 4 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. అమ్మ ఒడి, నాడు-నేడు సహా ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించడం లేదా?

  18. బెంగళూరు: కంపెనీ సీఈవో, ఎండీలను హత్య చేసిన మాజీ ఉద్యోగి, ఇమ్రాన్ ఖురేషి, బీబీసీ కోసం

    బెంగళూరులో హత్య

    ఫొటో సోర్స్, Getty Images

    బెంగళూరులో ఇంటర్నెట్ సర్వీస్ కంపెనీ నడుపుతున్న ఇద్దరు వ్యక్తులను ఆ కంపెనీ మాజీ ఉద్యోగి హత్య చేసినట్లు వార్తలు వచ్చాయి.

    నగరంలోని నివాస ప్రాంతంలో ఉన్న ఏరోనిక్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఫణీంద్ర సుబ్రమణ్య, సీఈవో వీనూ కుమార్‌లపై మారణాయుధాలతో దాడి చేశారు.

    ఫణీంద్ర సుబ్రమణ్యపై ఆయన ఆఫీసులోనే గతంలో పనిచేసిన ఫెలిక్స్ అనే మాజీ ఉద్యోగితో పాటు మరో ఇద్దరు దాడి చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

    ఆ తర్వాత ఫణీంద్రను కాపాడటానికి ప్రయత్నించిన వీనూపై కూడా నిందితులు దాడి చేశారని తెలిపారు.

    ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం, దాడికి పాల్పడిన వ్యక్తుల వద్ద కత్తులు, చాకులు ఉన్నాయి.

    చిన్న కంపెనీ అయిన ఏరోనిక్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కొన్ని నెలల క్రితమే ఏర్పడిందని బీబీసీతో ఏసీపీ రామన్ గుప్తా అన్నారు.

    హత్యకు కారణాలు ఇంకా తెలియలేదని పోలీసులు చెప్పారు.

  19. భారత్, వెస్టిండీస్‌ మధ్య నేటి నుంచి తొలి టెస్టు

    రోహిత్ శర్మ

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, కరీబియన్ గడ్డపై జరుగుతున్న ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టే ఫేవరెట్.

    వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తున్న ద్వైపాక్షిక క్రికెట్ టోర్నీలో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నేటి నుంచి తొలి టెస్టు మ్యాచ్ జరుగనుంది.

    రొసో వేదికగా రాత్రి 7:30 గంటల నుంచి మ్యాచ్ జరుగుతుంది.

    కరీబియన్ గడ్డపై ఆడుతున్నప్పటికీ రెండు టెస్ట్ మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారతే ఫేవరేట్ జట్టు.

    2023-25 కాలానికి వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)లో భారత్‌కు ఇదే తొలి సిరీస్.

    ప్రస్తుత ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్, వెస్టిండీస్ మధ్య 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి.