ఆసియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ అధికారిక చిహ్నంగా 'హనుమాన్'

థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరుగనున్న ఆసియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ టోర్నీకి అధికారిక చిహ్నంగా హనుమాన్‌.

లైవ్ కవరేజీ

  1. మ‌హిళ‌ల‌కు, ఎస్సీ, ఎస్టీలకు రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల లోన్ - ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

  2. భోజనం కావాలంటే దుస్తులు వద్దనుకోవాలి, దుస్తులు కావాలంటే పస్తులుండాలి - ఉప్పు, పసుపు, దువ్వెన కూడా కొనలేని ప్రజలు, ఇండియాలోనే అత్యంత పేద జిల్లా కథ ఇది

  3. తెలంగాణ: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఎన్ని కడతామన్నారు? ఎన్ని కట్టారు?

  4. చిత్తూరు జిల్లా గనుల్లో ఎంత బంగారం ఉంది? ఎప్పుడు తవ్వబోతున్నారు?

  5. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  6. ఆసియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ అధికారిక చిహ్నంగా 'హనుమాన్'

    ఆసియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్

    ఫొటో సోర్స్, Asian Athletics Championships

    థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరుగనున్న ఆసియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ టోర్నీకి అధికారిక చిహ్నంగా హనుమాన్‌ చిత్రాన్ని ఖరారు చేశారు.

    ఆసియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ప్‌కు 50 ఏళ్ళు అయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంటుకు లార్డ్ హనుమాన్‌ను అధికారిక చిహ్నంగా ఎంచుకున్నట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. ఈ టోర్నీ జూలా 12 నుంచి 16 వరకు బ్యాంకాక్‌లో జరుగుతుంది.

    “శ్రీరాముడి సేవలో హనుమంతుడు ఎంతో తెలివితేటల్ని, శక్తియుక్తుల్ని, సామర్థ్యాన్ని, వేగాన్ని చూపించారు. తిరుగులేని విధేయత, భక్తి భావాలు హనుమంతుడి ప్రత్యేకతలు”అని ఈ టోర్నమెంట్ అధికారిక వెబ్ సైట్లో పేర్కొన్నారు.

    25వ ఆసియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ – 2023లో పాల్గొనే క్రీడాకారుల సామర్థ్యానికి, నైపుణ్యాలకు హనుమంతుడి లోగో అద్దం పడుతుందని ఈ పోటీల నిర్వాహక సంస్థ తెలిపింది.

  7. అమిత్ షా: 'ఈడీ డైరెక్టర్ పదవీకాలం పొడిగింపుపై సుప్రీం కోర్టు ఆదేశాలను చూసి మురిసిపోతున్న వారు భ్రమల్లో ఉన్నారు'

    అమిత్ షా

    ఫొటో సోర్స్, ANI

    ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) డైరెక్టర్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మూడోసారి పొడిగించడం చట్టవిరుద్ధమంటూ సుప్రీంకోర్టు పేర్కొన్న తర్వాత తనపై వస్తున్న విమర్శలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిప్పికొట్టారు.

    ఈడీ డైరెక్టర్ పదవీ కాలం పొడిగింపు విషయంలో సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సంబరాలు చేసుకుంటోన్న వారు వివిధ కారణాలతో భ్రమలో బతుకుతున్నారని అమిత్ షా ట్వీట్ చేశారు.

    పార్లమెంట్ ఆమోదించిన సీవీసీ చట్టంలోని మార్పులను సుప్రీంకోర్టు సమర్థించిందని అమిత్ షా చెప్పారు.

    చట్టాన్ని అతిక్రమించి, అవినీతికి పాల్పడిన వారిపై ఈడీ తీసుకునే చర్యలు అంతకుముందు లాగానే ఉంటాయని అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ‘‘ఈడీ ఎప్పుడూ తన ప్రధాన లక్ష్యంపైనే దృష్టిసారిస్తుంది. విదేశీ ద్రవ్య మారకపు చట్టాలను ఉల్లంఘిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా మనీ లాండరింగ్‌కు పాల్పడే వారిపై అది విచారణ చేపడుతుంది. ’’ అని తెలిపారు.

    ‘‘దీనికి ఈడీ డైరెక్టర్ ఎవరన్నది ముఖ్యం కాదు. ఎందుకంటే, ఆ పదవిలో ఎవరున్నా కూడా అభివృద్ధి వ్యతిరేక ఆలోచనలతో ఉండి అవినీతికి పాల్పడే వారిని అది వదిలిపెట్టదు’’ అని అన్నారు.

    సుప్రీంకోర్టు ఏం చెప్పింది?

    ఈడీ డైరెక్టర్‌గా ఉన్న సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని మూడోసారి పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. జూలై 31 వరకు మాత్రమే ఆయన ఈ పదవిలో కొనసాగవచ్చని ఆదేశించింది.

  8. ఎవరెస్ట్ సమీపంలో కుప్పకూలిన హెలికాప్టర్... నేపాలీ పైలట్, అయిదుగురు మెక్సికో పర్యాటకులు మృతి

  9. ఫాక్స్‌కాన్-వేదాంత: రూ. 1,60,750 కోట్ల సెమీ కండక్టర్ హబ్ ఒప్పందం రద్దవడంతో మోదీ 'కల' చెదిరిందా?

  10. చంద్రయాన్-3: చంద్రుడిని చేరుకోవడానికి నాసాకు 4 రోజులు, ఇస్రోకు 40 రోజులు... ప్రయాణకాలంలో ఎందుకింత తేడా?

  11. Ladakh: భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దు ప్రాంతం ల‌ద్దాఖ్‌లో పశువుల కాపరి జీవితం ఎలా ఉంటుంది?

  12. బైజూస్: శరవేగంగా వేల కోట్లకు ఎగసి, పడిన ఈ స్టార్టప్‌ను మళ్ళీ నిలబెట్టడం సాధ్యమా?

  13. వేదాంతతో ‘చిప్’ ప్లాంట్ నిర్మాణ ఒప్పందం నుంచి తప్పుకున్న ఫాక్స్‌కాన్, అనాబెల్ లియాంగ్, బిజినెస్ రిపోర్టర్

    ఫాక్స్‌కాన్

    ఫొటో సోర్స్, REUTERS

    భారత్‌లో చిప్ తయారీ ప్లాంట్ నిర్మాణం కోసం భారత మైనింగ్ దిగ్గజం వేదాంతతో చేసుకున్న 1.9 బిలియన్ డాలర్ల (రూ. 1.5 లక్షల కోట్లు) ఒప్పందం నుంచి గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ దిగ్గజం ఫాక్స్ కాన్ వైదొలిగింది.

    గుజరాత్‌ రాష్ట్రంలో ఈ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు రెండు సంస్థలు ప్రణాళికలను కూడా ప్రకటించాయి. కానీ, ఏడాది లోపే ఈ ప్రాజెక్ట్ నుంచి ఫాక్స్‌కాన్ తప్పుకుంది.

    ఇది దేశ సాంకేతిక పరిశ్రమ లక్ష్యాలకు ఎదురుదెబ్బ అని కొందరు విశ్లేషకులు అంటుండగా, చిప్ తయారీలో దేశ ఆశయాలను ఇది ఏమాత్రం ప్రభావితం చేయలేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

    వేదాంతతో సంప్రదింపుల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ తెలిపింది కానీ, ఒప్పందం నుంచి ఎందుకు తప్పుకుందో మాత్రం చెప్పలేదు.

    వెంచర్ నుంచి ఫాక్స్‌కాన్ వైదొలిగిన నేపథ్యంలో దేశంలో తొలి చిప్ ప్లాంట్ ఏర్పాటులో ఇతర భాగస్వాములతో కలిసి ముందుకు వెళ్తామని వేదాంత ప్రకటించింది.

  14. బ్రేకింగ్ న్యూస్, నేపాల్‌లో హెలికాప్టర్ అదృశ్యం, ప్రయాణికుల్లో ఐదుగురు విదేశీయులు

    నేపాల్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, హెలికాప్టర్ ఫైల్ ఫొటో

    తూర్పు నేపాల్‌లోని సొలుఖుంబు జిల్లా మారుమూల పర్వత ప్రాంతంలో హెలికాప్టర్ అదృశ్యమైనట్లు అధికారులు తెలిపారు.

    అందులో నేపాలీ పైలట్‌తోపాటు అయిదుగురు మెక్సికన్ పౌరులు ఉన్నట్లు సోలుఖుంజు జిల్లా సమన్వయ కమిటీ చీఫ్ కృష్ణ ప్రసాద్ నీరాలా తెలిపారు.

    లామజురా పాస్ ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లుగా అనుమానిస్తున్నట్లు ఆయన చెప్పారు. అక్కడ భద్రతా సిబ్బందిని మోహరించినట్లు తెలిపారు.

    లుక్లా ప్రాంతం నుంచి కఠ్మాండూకు బయల్దేరిన హెలికాప్టర్ ఉదయం 10:13 గంటల తర్వాత టవర్‌తో సంబంధాలు కోల్పోయినట్లు కఠ్మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికార ప్రతినిధి టేక్‌నాథ్ సిథౌలా చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  15. ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపులు ఉన్నాయని బేవరేజెస్ కార్పొరేషన్ చెబుతోంది. ఇది నిజమేనా? దీనిపై క్లిక్ చేసి బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్‌బుక్ పేజీలో మీ అభిప్రాయాలను పంచుకోండి.

  16. దర్శి బస్సు ప్రమాదం - ప్రకాశం: సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ పెళ్లి బస్సు, ఏడుగురు మృతి.. ఈ ఘటన ఎలా జరిగింది?

  17. నాటో సదస్సు: యుక్రెయిన్ సభ్యత్వంపై చర్చించనున్న నాయకులు

    నాటో సదస్సు

    ఫొటో సోర్స్, ALAMY

    ఫొటో క్యాప్షన్, లిథువేనియా అధ్యక్షుడు గిటానస్ నౌసేడా (కుడి)తో నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్

    యుక్రెయిన్‌ యుద్ధ దిశను, పాశ్చాత్య కూటమి భవిష్యత్తును నిర్ణయించగల కీలక శిఖరాగ్ర సమావేశంలో నాటో నాయకులు భేటీ అవుతున్నారు.

    లిథువేనియా రాజధాని విల్నియస్ వేదికగా జులై 11, 12 తేదీల్లో నాటో శిఖరాగ్ర సదస్సు జరుగనుంది.

    సుదీర్ఘ కాలం పాటు యుక్రెయిన్‌కు సైనిక సహాయాన్ని అందిస్తామనే సంకేతాన్ని ఈ సమావేశం ద్వారా రష్యాకు పంపాలని 31 మిత్రదేశాలు భావిస్తున్నాయి.

    నాటో కూటమి సమావేశానికి ముందు నాటో నేతలకు ఉత్సాహాన్ని ఇచ్చే ఘటన జరిగింది. అదేంటంటే, నాటో కూటమిలో స్వీడన్ చేరడంపై తుర్కియే తన అభ్యంతరాలను విరమించుకుంది.

    కానీ, యుక్రెయిన్ భవిష్యత్తు సభ్యత్వం గురించి కూటమి మిత్రదేశాల్లో భిన్నాభిప్రాయాలు అలాగే ఉన్నాయి.

    నాటో సదస్సు

    ఫొటో సోర్స్, EPA-EFE/REX/SHUTTERSTOCK

    భవిష్యత్తులో రష్యా దూకుడును అరికట్టేలా నాటోలోని కొన్ని మిత్రదేశాలు యుక్రెయిన్‌కు కొత్త భద్రతా హామీలను ఇస్తాయని భావిస్తున్నారు. యుక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అందించడంపై కూడా చర్చించనున్నారు.

    రష్యాతో పోరు ముగిసిన తర్వాత వీలైనంత త్వరగా కూటమిలో యుక్రెయిన్ చేరవచ్చని నాటో చెప్పాలని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమీర్ జెలియన్‌స్కీ కోరుకుంటున్నారు. సభ్యత్వంపై ఇలాంటి హామీ ఇవ్వడానికి కొన్ని నాటో సభ్యదేశాలు సుముఖంగా లేవు. ఇలాంటి వాగ్దానం రష్యాకు ఆగ్రహం తెప్పిస్తుందని అవి ఆందోళన చెందుతున్నాయి. రష్యా యుద్ధ తీవ్రతను పెంచొచ్చని, యుద్ధాన్ని సాగదీయొచ్చని అనుమానిస్తున్నాయి.

    యుక్రెయిన్ విషయంలో సభ్యదేశాలన్నీ కచ్చితంగా ఐక్యతగా ఉంటాయని అనుకుంటున్నట్లు నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ అన్నారు.