మరో వలసదారుల పడవ గల్లంతు... 200 మంది ఆచూకీ కోసం కొనసాగుతున్న అన్వేషణ
సెనెగల్ నుంచి 200 మంది ఆఫ్రికా వలసదారులతో బయలుదేరిన బోటు కనేరీ దీవుల్లో తప్పిపోయింది. వారం రోజులుగా దీని కోసం వెతుకుతూనే ఉన్నారు.
లైవ్ కవరేజీ
ఆసియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ అధికారిక చిహ్నంగా 'హనుమాన్'
పబ్‌జీ ప్రేమకథ: సీమా హైదర్ మెడలో మంగళసూత్రం, రాధే-రాధే స్కార్ఫ్.. ‘జై శ్రీరామ్’ నినాదాలతో మార్మోగుతున్న సచిన్ మీనా ఇల్లు
శ్రీలంక: ఆర్థిక సంక్షోభంతో ఎగసిన నిరసనలకు ఏడాది... ఇప్పుడు జనజీవనం ఎలా ఉంది?
ప్రొటీన్ సప్లిమెంట్స్ మేలు చేస్తాయా... కీడు చేస్తాయా?
తెలంగాణ: కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ-టీమ్ అనే విమర్శలు ఇప్పుడే ఎందుకు జోరుగా వినిపిస్తున్నాయి?
పవన్ కల్యాణ్‌కు మహిళా కమిషన్ నోటీసులు

ఫొటో సోర్స్, Vasireddy Padma
రాష్ట్రంలో ఒంటరి మహిళలు కనిపించకుండా పోవటానికి కారణం వాలంటీర్లే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ నోటీసు పంపారు.
ఈ ఆరోపణలపై మరో 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు మాయమయ్యారని, దీనికి వాలంటీర్లే కారణమని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
అయితే ఈ కామెంట్లకు ఆధారాలేంటి? ఎంత మంది ఒంటరి మహిళలను వాలంటీర్లు సంఘ విద్రోహులకు అప్పగించారని కేంద్రం మీకు చెప్పింది? దీని ఆధారాలు మీకు చూపారా? అనే విషయాలపై 10 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు.
లాక్మే బ్రాండ్ ఎలా పుట్టింది... లక్ష్మీదేవికీ ఈ పేరుకూ ఏమిటి సంబంధం?
మరో వలసదారుల పడవ గల్లంతు... 200 మంది ఆచూకీ కోసం కొనసాగుతున్న అన్వేషణ

ఫొటో సోర్స్, SALVAMENTO MARITIMO/FACEBOOK
సెనెగల్ నుంచి 200 మంది ఆఫ్రికా వలసదారులతో బయలుదేరిన బోటు కనేరీ దీవుల్లో తప్పిపోయింది. వారం రోజులుగా దీని కోసం వెతుకుతూనే ఉన్నారు.
స్పెయిన్ సహాయక సిబ్బంది తప్పిపోయిన ఈ పడవ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
దక్షిణ సెనెగల్‌లోని తీర పట్టణం కఫౌంటైన్ నుంచి ఈ నౌక బయలు దేరినట్లు సహాయక బృందం వాకింగ్ బోర్డర్స్ చెప్పింది.
కఫౌంటైన్ నుంచి జూన్ 27న 200 మంది ప్రయాణికులతో ఈ బోటు కనేరీ దీవుల వైపు బయలుదేరింది.
ఈ బోటులో చాలా మంది చిన్నారులున్నట్లు స్పెయిన్ ఇఫె న్యూస్ ఏజెన్సీకి ఈ సహాయక బృందం తెలిపింది.
డజన్ల కొద్దీ ప్రయాణికులతో వెళ్ళిన మరో రెండు బోట్లు కూడా తప్పిపోయినట్లు తెలిసింది.
వీరిని వెతికేందుకు విమానాలు కూడా సాయపడుతున్నట్లు ఇఫె న్యూస్ ఏజెన్సీకి స్పెయిన్ సముద్ర రక్షణ సేవా సంస్థ తెలిపింది.
తప్పిపోయిన మరో రెండు బోట్ల గురించి పెద్దగా వివరాలు అందుబాటులో లేవు.
ఒక బోటులో 65 మంది, మరో పడవలో 60 మంది వరకు ఉండొచ్చని వాకింగ్ బోర్డర్స్‌కు చెందిన హెలెనా మాలెనో తెలిపినట్లు రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ చెప్పింది.
మొత్తం ఈ మూడు బోట్లలో ఉన్న 300 మందికి పైగా ప్రయాణికులు తప్పిపోయారు.
ఉత్తరాదిలో భారీ వర్షాలకు 15 మంది మృతి.. వాన బీభత్సానికి అద్దం పట్టే ఫోటోలివీ
యుక్రెయిన్ యుద్ధానికి 500 రోజులు: రష్యా ఆక్రమించిన ప్రతి అంగుళం తిరిగి స్వాధీనం చేసుకుంటాం- జెలెన్‌స్కీ
అంకిత శ్రీవాస్తవ: తల్లికి మూడో వంతు కాలేయాన్ని దానం చేసినా, కోలుకొని క్రీడల్లో అంతర్జాతీయ పతకాలు సాధించిన యువతి
చైనా: చిన్నారుల బడిలో దుండగుడి కత్తి దాడి.. టీచర్ సహా ఆరుగురి మృతి

ఫొటో సోర్స్, Getty Images
చైనాలోని ఈశాన్య గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్సుకు చెందిన ఒక చిన్నారుల పాఠశాలలో దుండగుడు కత్తితో దాడి చేయడంతో ఆరుగురు చనిపోయినట్లు, ఒకరికి గాయాలైనట్లు బీబీసీకి పోలీసులు చెప్పారు.
ఈ ఘటనలో ‘వు’ అనే ఇంటిపేరుతో ఉన్న 25 ఏళ్ల నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వారు తెలిపారు.
బాధితుల్లో ఒక టీచర్, ఇద్దరు పేరెంట్స్, ముగ్గురు విద్యార్థులు ఉన్నట్లు నగర పాలకవర్గానికి చెందిన అధికార ప్రతినిధిని ఉటంకిస్తూ వార్తాసంస్థ ఏఎఫ్‌పీ తెలిపింది.
స్థానిక కాలమానం ప్రకారం, సోమవారం ఉదయం 7:40 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. 8 గంటలకు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు.
ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి అని పోలీసులు అన్నారు.
చైనాలో హింసాత్మక నేరాలు అరుదుగా జరుగుతాయి. అయితే, కొన్నేళ్లుగా చైనాలో కత్తిదాడి ఘటనలు పెరిగాయి. పాఠశాలల్లో కూడా ఇలాంటి ఘటనలు నమోదయ్యాయి.
అటవీశాఖ ఉద్యోగాలు - హరియాణా: మహిళా అభ్యర్థుల ఛాతీ కొలవడంపై తలెత్తిన వివాదం ఏంటి?
నష్టాల్లో ఉన్న షేర్లను కొందరు ఎందుకు కొంటారు... వారిని నడిపించేది ఏమిటి?
యాషెస్ సిరీస్: మూడో టెస్టులో ఆస్ట్రేలియాపై 3 వికెట్ల తేడాతో గెలిచిన ఇంగ్లండ్

ఫొటో సోర్స్, Getty Images
యాషెస్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ మైదానంలో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ జట్టు విజయం సాధించింది.
నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో ఇంగ్లండ్ 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది.
251 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 254 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.
హ్యారీ బ్రూక్ (93 బంతుల్లో 75; 9 ఫోర్లు) అర్ధసెంచరీ చేయగా, ఓపెనర్ జాక్ క్రాలీ (55 బంతుల్లో 44; 5 ఫోర్లు) రాణించాడు.
చివర్లో క్రిస్ ఓక్స్ (47 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు), మార్క్ వుడ్ (8 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిని కనబరిచారు.
ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ 5 వికెట్లు దక్కించుకున్నాడు.
అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 224 పరుగులకు ఆలౌట్ అయింది.
ట్రావిస్ హెడ్ (77; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఉస్మాన్ ఖాజా (43; 3 ఫోర్లు) ఆకట్టుకున్నారు.
ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్, క్రిస్ వోక్స్ చెరో 3 వికెట్లు తీశారు. మార్క్ వుడ్, మొయిన్ అలీ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 263 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 237 పరుగులకు ఆలౌటైంది.
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం!
