దిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలలో భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలం... మరో 24 గంటలు రెడ్ అలర్ట్

దిల్లీ, ఉత్తరాఖండ్, హరియాణా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలలో ఆదివారం కూడా భారీ వర్షాలు కురవడంతో వాతావరణ శాఖ తదుపరి 24 గంటలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ ముగిస్తున్నాం

    బీబీసీ తెలుగు లైవ్ అప్డేట్స్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్ళీ లైవ్ పేజీతో కలుసుకుందాం.

    నమస్తే. గుడ్ నైట్.

  2. సొంత ఊరి రైతుల కోసం ఇద్దరు యువకుల అద్భుత సృష్టి

  3. కళ్ల ముందే వంతెన వరదలో కొట్టుకుపోయింది

    దిల్లీ, పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్ సహా ఉత్తరాధి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షంతో దిల్లీలో జనజీవనం అతలాకుతలం అవుతోంది.

    ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా, పంజాబ్, చండీగఢ్‌లలోనూ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గురుగ్రామ్‌లో కొన్నిచోట్ల రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.

    హిమాచల్ ప్రదేశ్‌లో ఒక స్టీల్ వంతెన అందరూ చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయింది.

    వీడియో క్యాప్షన్, హిమాచల్ ప్రదేశ్: కళ్ల ముందే అంత పెద్ద వంతెన వరదలో కొట్టుకుపోయింది

    దిల్లీ, ఉత్తరాఖండ్, హరియాణా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలలో ఆదివారం కూడా భారీ వర్షాలు కురవడంతో వాతావరణ శాఖ తదుపరి 24 గంటలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.

    పశ్చిమ రాజస్థాన్, గుజరాత్‌లలో కూడా భారీ వర్షాలు నమోదైనట్లు వార్తలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

  4. పనస పండు: కష్టకాలంలో శ్రీలంక ప్రజల ఆకలి తీర్చుతున్న జాక్ ఫ్రూట్

  5. గర్భధారణ సమయంలో గుండె ఆకారం మారుతుందా?

  6. దిల్లీ, పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్ సహా ఉత్తరాధి రాష్ట్రాల్లో భారీ వర్షాలు

    కుండపోత వర్షంతో దిల్లీలో జనజీవనం అతలాకుతలం అవుతోంది. యమునా నది ఉదృతంగా ప్రవహిస్తోంది. దిల్లీలో 24 గంటల్లో 153 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. 1982 తర్వాత ఇదే అత్యధికం.

    దేశరాజధానిలో భారీ వర్షాలు ఇంకా కొనసాగుతాయని అధికారులు చెప్పారు.

    దిల్లీలో భారీ వర్షం

    ఫొటో సోర్స్, ANI

    భారీ వర్షాల నేపథ్యంలో దిల్లీలోప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆదివారం సెలవు రద్దు చేస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యాత్మక ప్రాంతాలకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని కోరారు.

    ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా, పంజాబ్, చండీగఢ్‌లలోనూ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గురుగ్రామ్‌లో కొన్నిచోట్ల రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.

    హిమాచల్ ప్రదేశ్‌లో పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మండి జిల్లాలోని బియాస్ నదిపై ఉన్న ఓ స్టీల్ వంతెన వరదలో కొట్టుకుపోయింది. ఈ రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

  7. క్లస్టర్ బాంబులు: యుక్రెయిన్‌కు అమెరికా ఇస్తున్న ఈ బాంబులను వందకు పైగా దేశాలు నిషేధించాయి... ఇవి అంత ప్రమాదకరమా?

  8. కుటుంబం కోసం స్కూల్ వ్యాన్ నడుపుతున్న మహిళ కథ

  9. ప్యాకెట్ పాలు ఎలా తయారవుతాయో తెలుసా? ఆ నాలుగు దశలు ఇవీ!

  10. పశ్చిమ బెంగాల్ హింస: కేంద్ర బలగాలను భారీగా మోహరించినా పంచాయతీ ఎన్నికల్లో అంత మంది ఎందుకు చనిపోయారు?

  11. విడాకులు తీసుకుని పెళ్లిళ్లు చేసుకోవడం నేరమా? పవన్ కళ్యాణ్‌ను జగన్ పదే పదే ఎందుకు విమర్శిస్తున్నారు?

  12. కార్గిల్: తల ఛిద్రమయ్యే వరకు పాకిస్తాన్‌పై పోరాడిన ‘పరమవీర చక్ర’ కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే సాహస గాథ

  13. పబ్జీ ప్రేమ కథ: పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు అక్రమంగా వచ్చిన సీమా హైదర్‌ను కలుసుకొనేందుకు అనుమతి కోరిన పాక్

    సీమా హైదర్
    ఫొటో క్యాప్షన్, సీమా హైదర్‌కు నలుగురు పిల్లలు ఉన్నారు.

    పాకిస్తాన్ నుంచి నేపాల్ మీదుగా భారత్ వచ్చిన పాకిస్తానీ మహిళ సీమా గులామ్ హైదర్‌ను కలవడానికి పాక్ విదేశీ వ్యవహారాలశాఖ భారత్‌ను అనుమతి కోరింది.

    పాకిస్తాన్ విదేశీ వ్యవహారాలశాఖ అధికారులు ఇస్లామాబాద్‌లో ఉన్న బీబీసీ ప్రతినిధి షుమయిలా ఖాన్‌కు ఈ సమాచారం అందించారు.

    ఆన్‌లైన్‌లో పబ్జీ ఆడుతూ భారతీయుడైన సచిన్ మీనాతో ప్రేమలో పడిన సీమా, ఆయన్ను కలవడానికి తన నలుగురు పిల్లలతో నేపాల్ గుండా అక్రమంగా భారత్‌లోకి వచ్చారు.

    భారత్‌లో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. శుక్రవారం సీమ, సచిన్‌లకు బెయిల్ లభించింది.

    దుబాయ్‌లో ఉంటున్న సీమా భర్త గులామ్ హైదర్(పాకిస్థాన్) తన భార్యను, పిల్లలను తిరిగి తన దగ్గరకు చేర్చాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరారు.

    భారత్‌లో మీడియాతో మాట్లాడిన సీమా తను సచిన్‌తో కలిసి జీవించాలని అనుకుంటున్నట్లు చెప్పారు.

  14. హలో!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం! నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

  15. నాటు శృంగారానికి, లైంగిక దాడికి తేడా ఏంటి... రఫ్ సెక్స్ డిఫెన్స్ చట్టంతో సమస్యేంటి?