ఆదివాసీ యువకుడిపై మూత్రం పోసిన వ్యక్తి అరెస్ట్... వైరల్ వీడియోపై తీవ్రంగా స్పందించిన మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్

ఫొటో సోర్స్, Getty Images
ఒక ఆదివాసీ యువకుడి పట్ల అమానవీయంగా ప్రవర్తించిన తీరుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో ఒక వ్యక్తి మరో యువకుడిపై మూత్ర విసర్జన చేస్తున్నట్లు ఉంది.
ఈ ఘటనలో ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తిపై ఎస్‌సీ/ఎస్టీ చట్టం కింద కేసు దాఖలు చేశారు.
మధ్యప్రదేశ్‌లోని సిధిలో ఈ ఘటన జరిగింది.
ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు సిధి ఎస్‌పీ తమ అధికారిక ట్విటర్ హ్యాండిల్‌లో తెలిపారు.
సిగరెట్ తాగుతూ యువకుడిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తిని కుబ్రికి చెందిన ప్రవేశ్ శుక్లాగా గుర్తించినట్లు ఆయన తెలిపారు.
అతనిపై ఎస్‌సీ/ఎస్టీ చట్టం కింద కేసు దాఖలు చేసినట్లు ట్విటర్‌లో చెప్పారు.
అలాగే, సిధి డిప్యూటీ ఎస్‌పీ ప్రియా సింగ్ కూడా.. నిందితుడిని ప్రవేశ్ శుక్లాగా గుర్తించినట్లు తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసు టీమ్‌లను పంపినట్లు చెప్పారు.
ఎస్‌సీ/ఎస్టీ చట్టం కింద, 294, 504 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ వీడియో వైరల్‌గా మారిన తర్వాత, ఆరోపణలు ఎదుర్కొంటోన్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్‌లు వెల్లువెత్తాయి.
ఈ సంఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ కూడా ఆదేశాలు జారీ చేశారు.
‘‘సిధి జిల్లాలో వైరల్‌గా మారిన వీడియో నా దృష్టికి వచ్చింది. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించాను. ఎన్ఎస్ఏ కూడా విధించాలని చెప్పాను’’ అని సీఎం చౌహాన్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఈ ఘటనపై విపక్షాల దాడి
ఈ సంఘటనపై కాంగ్రెస్ కూడా అధికార పార్టీ బీజేపీపై మండిపడింది.
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కూడా ఈ ఘటనపై స్పందించారు.
‘‘సిధి జిల్లాలో ఒక ఆదివాసీ యువకుడిపై ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేస్తున్న దారుణానికి సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆదివాసీ సమాజంలోని యువతపై ఇలాంటి హేయమైన, అనాగరిక చర్యలకు నాగరిక సమాజంలో చోటు లేదు. ’’ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
‘‘మూత్ర విసర్జన చేసిన వ్యక్తి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఆరోపణలున్నాయి. ఆదివాసీలపై జరుగుతున్న ఆకృత్యాలకు ఇప్పటికే మధ్య ప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఈ సంఘటన మధ్య ప్రదేశ్ మొత్తానికి సిగ్గుచేటుగా నిలుస్తోంది. నిందితునికి కఠిన శిక్ష వేయాలని నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాను’’ అని కమల్ నాథ్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
నిందితుడు ప్రవేశ్ శుక్లాకి, బీజేపీ ఎమ్మెల్యే కేదర్‌నాథ్ శుక్లాతో సంబంధాలున్నట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
దీనిపై కేదర్‌నాథ్ శుక్లా స్పందించారు.
వీడియోలోని నిందితుడు తమ ప్రతినిధుడు లేదా తమకు సంబంధమున్న వ్యక్తి కాదని సిధి బీజేపీ ఎమ్మెల్యే కేదర్‌నాథ్ శుక్లా అన్నారు.
ఎటు నుంచి చూసినా కూడా బీజేపీతో అతనికి సంబంధాలు లేవన్నారు.
నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాను కూడా డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు.
ఇవి కూడా చూడండి:
- హిట్లర్ నరమేధం నుంచి తప్పించుకున్న ఈ ముగ్గురు అమ్మాయిలు ఎవరు? 84 ఏళ్ల తర్వాత వీడిన ఫోటో మిస్టరీ
- పెట్రికోర్: తొలకరి జల్లుల్లో మట్టి వాసనకు కారణం ఇదే
- తల్లి ప్రాణాన్ని ఆరేళ్ల చిన్నారి రెండుసార్లు అలెక్సా సాయంతో ఎలా కాపాడింది?
- మహిళలకు 3 లక్షల రుణం.. దళితులకు వడ్డీ కూడా ఉండదు.. ఈ కేంద్ర పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- చంద్రయాన్-3ను ఇస్రో ఎందుకు ప్రయోగిస్తోంది? చంద్రయాన్-2తో ఏం సాధించింది?
- (బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)