ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

మైసూరు శాండల్ సోప్

ఫొటో సోర్స్, KSDL

1. మైసూర్ శాండల్ సబ్బు చరిత్ర ఏంటి? దాని పుట్టుకకు మొదటి ప్రపంచయుద్ధం ఎలా కారణమైంది?

మైసూరు రాజ్యంలో గంధపు చెట్లు చాలా ఎక్కువ. గంధపు చెక్కలు, దుంగలను విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించేది. టిప్పు సుల్తాన్ కాలం నుంచే గంధపు చెక్కలను చైనా వంటి దేశాలకు ఎగుమతి చేసేవారు.

20వ శతాబ్దం నాటికి మైసూర్ రాజ్యపు గంధపు చెక్కలకు, యూరప్ పెద్ద మార్కెట్‌గా మారింది. జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలకు మైసూరు రాజ్యం నుంచి గంధపు చెక్కలు ఎగుమతి అయ్యేవి.

1914లో తొలి ప్రపంచయుద్ధం మొదలు కావడంతో సముద్ర మార్గాల్లో ఇబ్బందుల వల్ల సరఫరా వ్యవస్థ దెబ్బతింది. దాంతో చాలా దేశాలు దిగుమతులను ఆపివేయడం వల్ల మైసూరు గంధపు చెక్కలకు డిమాండ్ పడిపోయింది. మరోవైపు రాజ్యంలో వాటి నిల్వలు పేరుకు పోయాయి.

నాడు మైసూర్ రాజ్యాన్ని కృష్ణరాజ వడియార్-4 పాలిస్తున్నారు. ప్రముఖ ఇంజినీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య నాడు దివాన్‌గా ఉన్నారు. పేరుకుపోయిన గంధపు చెక్కల నుంచి ఆయిల్ తీసే మార్గాలను ఆలోచించమని విశ్వేశ్వరయ్యను రాజు అడిగారు.

పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మాజీ ప్రధాని వాజ్‌పేయి

ఫొటో సోర్స్, Getty Images

2. పోఖ్రాన్ II: అమెరికా కళ్లుగప్పి వాజ్‌పేయి అణు పరీక్షలు ఎలా నిర్వహించారు?

ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన రోజుల వ్యవధిలోనే కొత్త ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయిని మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు కలిశారు.

''మెటీరియల్ సిద్ధంగా ఉంది. మీరు ముందుకెళ్లొచ్చు'' అని పీవీ చెప్పారు.

పార్లమెంట్‌లో విశ్వాస పరీక్ష నెగ్గిన పదిహేను రోజుల్లోనే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, డాక్టర్ రాజగోపాల చిదంబరం‌లను వాజ్‌పేయి పిలిపించారు. అణు పరీక్షకు సిద్ధం కావాలని ఆదేశించారు.

అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు దక్షిణ అమెరికా దేశాల్లో పర్యటించాల్సి ఉంది. కొద్ది రోజులు ఆ పర్యటనను వాయిదా వేసుకోవాలని సమాచారం అందించారు.

అలాగే, ఏప్రిల్ 27న డాక్టర్ చిదంబరం కూతురి వివాహం కూడా జరగాల్సి ఉంది. చిదంబరం లేకపోవడం వల్ల ఆ వివాహం కూడా కొద్ది రోజులు వాయిదా పడింది. ఈ పరిణామాలు ఏదో భారీ పరిణామం జరగబోతోందన్న సంకేతాలిచ్చాయి.

1998 మే 11వ తేదీ బుద్ధ పూర్ణిమ రోజు అణు పరీక్ష జరపాలని డాక్టర్ అబ్దుల్ కలాం సూచించారు.

పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అక్బర్ vs మహారాణా ప్రతాప్

ఫొటో సోర్స్, Getty Images

3. అక్బర్ X మహారాణా ప్రతాప్: ఇది హిందూ, ముస్లింల మధ్య పోరాటమా?

మహారాణా ప్రతాప్‌కు చరిత్రకారులు అన్యాయం చేశారని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల వ్యాఖ్యానించారు.

''అక్బర్‌ను గొప్ప చక్రవర్తిగా చెబుతారు. కానీ, మహారాణా ప్రతాప్ గొప్పవాడని ఎవరూ ఎందుకు చెప్పరు?'' అని ఆయన అన్నారు. మహారాణా ప్రతాప్‌ను ''నేషనల్ హీరో''గా ఆయన కొనియాడారు.

చరిత్రను తిరగరాయాలనే తన సంకల్పాన్ని ఇలాంటి వ్యాఖ్యలతో కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటిస్తోందా? అక్బర్‌ను కేవలం విదేశీ చక్రవర్తిగానే చూడాలా? ఆయన కంటే మహారాణా ప్రతాప్ గొప్పవారా? హల్దీఘాటీ యుద్ధంలో అక్బర్‌ను ఆయన ఓడించారా? అక్బర్-మహారాణా ప్రతాప్‌ల మధ్య పోరాటం హిందూ-ముస్లింల మధ్య పోరాటంగా చూడాలా?

పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పక్షుల వలస

ఫొటో సోర్స్, Getty Images

4. వలస పక్షుల గురించి 13 ఆసక్తికర అంశాలు

శీతాకాలంలో పక్షులన్నీ ఎక్కడికి పోతున్నాయనే ప్రశ్న శతాబ్దాల‌పాటు ప్రపంచంలోని చాలా ప్రాంతాల ప్రజలను వెంటాడింది. మునుపటితో పోలిస్తే, నేడు ఈ వలసల గురించి మనకు కాస్త ఎక్కువే తెలుసు.

కాలం మారుతున్నప్పుడు ఒక్కసారిగా పక్షులు మాయం కావడంపై ప్రపంచవ్యాప్తంగా చాలా కథలు ప్రచారంలో ఉండేవి.

కొంత మంది ఈ పక్షులు శీతాకాలంలో సముద్రంలో కనిపించే ఆల్చిప్పల తరహాలో మారిపోతాయని, మరికొందరు అయితే, ఇవి కొండల్లో సుప్తావస్థలోకి వెళ్లిపోతాయని భావించేవారు.

19వ శతాబ్దం ముందు వరకు శీతాకాలంలో ఈ పక్షులన్నీ చెరువుల్లో బురదలోకి వెళ్లిపోతాయని కథలుగా చెప్పుకునేవారు.

పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బిడ్డలో ముగ్గురి డీఎన్‌ఏ

ఫొటో సోర్స్, Getty Images

5. ఒక బిడ్డలో తల్లిదండ్రులతోపాటు మరొకరి డీఎన్‌ఏ, ఇదెలా సాధ్యం?

బ్రిటన్‌లో అరుదైన ఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తుల డీఎన్‌ఏతో ఒక శిశువు జన్మించింది. ఈ విషయాన్ని ఫెర్టిలిటీ నియంత్రణ సంస్థ ధ్రువీకరించింది.

ఈ శిశువు డీఎన్‌ఏలో ఎక్కువ భాగం తల్లిదండ్రులదేనని, 0.1 శాతం డీఎన్‌ఏ మాత్రం మూడో వ్యక్తి అయిన మరో మహిళదని తెలిపింది.

పిల్లలకు పుట్టుకతో ప్రాణాంతకమైన మైటోకాండ్రియా సంబంధిత వ్యాధులు రాకుండా నిరోధించడానికి ఒక కొత్త టెక్నాలజీని ప్రయోగించడంతో ఇలా జరిగింది. ఇప్పటివరకు ఈ విధానంలో అయిదుగురు శిశువులు జన్మించారు. అయితే, వీరికి సంబంధించిన ఇతర వివరాలేవీ లేవు.

మైటోకాండ్రియల్ వ్యాధులు నయం చేయలేనివి. ఈ వ్యాధితో పుట్టిన పిల్లలకు గంటల వ్యవధిలో లేదా రోజుల వ్యవధిలో మరణం సంభవించవచ్చు. కొందరు తల్లిదండ్రులు ఈ బాధను అనుభవించారు. అలాంటి తల్లిదండ్రుల్లో ఈ టెక్నాలజీ కొత్త ఆశలు రేపుతోంది.

పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)