ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

హిందూ దేవాలయం

ఫొటో సోర్స్, Kalanidhi

1.తంజావూరు పెరియ కోవిల్: వెయ్యేళ్లనాటి ఈ దేవాలయం గోపురం నీడ నేలపై పడదా?

తమిళనాడులో చాలా దేవాలయాలు ఉన్నాయి. కానీ, వీటిలో ''తంజావూరు పెరియా కోవిల్'' చాలా ప్రత్యేకమైనది. దీని చుట్టూ చాలా కథలు, నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి.

భారత్‌లో అత్యధిక దేవాలయాలున్నది తమిళనాడులోనే. దేశంలోని ప్రఖ్యాత హిందూ దేవాలయాల పేర్ల చెప్పమని అడిగితే, కళ్లకురిచిలోని తిరువరంగం, మదురైలోని మీనాక్షి అమ్మన్, దారాసురామ్‌లోని ఐరావదేశ్వరార్, రామేశ్వరంలోని రామనాథస్వామి, తంజావూరులోని పెరువుడయార్ దేవాలయం ఆ జాబితాలో తప్పకుండా ఉంటాయి.

వీటిలో తంజావూర్ పెరువుడయార్ దేవాలయం మరింత ప్రత్యేకమైనది. వెయ్యేళ్లనాటి ఈ గుడి అతిపెద్ద గోపురమున్న దేవాలయాల్లో ఒకటి. మరి ఈ దేవాలయం గోపురం నీడ నేలపై పడదా?

పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మిరపతోటలో కూలీ

2.ఆంధ్రప్రదేశ్: ఏటా వేల మంది రాయలసీమ కూలీలు గుంటూరుకు ఎందుకు తరలివస్తున్నారు..

గుంటూరు మిరప పంటకు ప్రసిద్ధి. ఈ మిరప తోటల్లో పనిచేసే కూలీల్లో ఎక్కువమంది రాయలసీమకు చెందిన వారే. అందులోనూ కర్నూలు జిల్లా ఆధోని, డోన్, మంత్రాలయం నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల నుంచి ఎక్కువ మంది తరలివస్తున్నారు. అనేక దశాబ్దాలుగా ఇది కొనసాగుతోంది.

తరాలు మారుతున్నా కూలీల వలసలకు మాత్రం ముగింపు కనిపించడం లేదు. పిల్లా, పాపలతో వచ్చి తాత్కాలిక గుడిసెల్లో జీవించే వారు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా చాలా మంది ఉంటారు.

దీనికి కారణాలు ఏంటి? పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏసీ రిమో‌ట్‌తో అమ్మాయి

ఫొటో సోర్స్, Getty Images

3.ఏసీ: ఆ ఒక్క పనిచేస్తే కరెంటు బిల్లు సగం తగ్గుతుందా?

ఏసీ(ఎయిర్ కండిషనర్) వాడితే కరెంటు బిల్లుకు రెక్కలు వస్తాయి. మరి ఈ బిల్లు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి?

ఏడు ముఖ్యమైన సూచనలు ఇవీ! పూర్తి కథనం కోసం ఇక్క ఇక్కడ క్లిక్ చేయండి.

బిలావల్ బుట్టో

ఫొటో సోర్స్, REUTERS/AKHTAR SOOMRO

4.పాకిస్తాన్: బిలావల్ భుట్టో జననాన్ని బెనజీర్ భుట్టో ఎందుకు గోప్యంగా ఉంచారు?

పాకిస్తాన్ రాజకీయ చరిత్రలో 1988 ఒక మైలురాయి లాంటిది. దేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న ఒక సైనిక నియంత అదే ఏడాది విమాన ప్రమాదంలో మరణించారు. దీంతో ఒక నిరంకుశ ప్రభుత్వానికి తెరపడింది. బెనజీర్ భుట్టో నేతృత్వంలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అదే ఏడాది మళ్లీ అధికారంలోకి వచ్చింది.

అదే ఏడాది బెనజీర్‌ భుట్టోకు పాకిస్తాన్ ప్రస్తుత విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ జన్మించారు. అప్పట్లో ఆయన జననాన్ని చాలా గోప్యంగా ఉంచారు.

అందుకు కారణం ఏంటి? పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏనుగులు

ఫొటో సోర్స్, Getty Images

5.పట్టాభిషేకాలు - సంప్రదాయాలు: మోకాళ్లపై నడిచే రాణి, ఎవరూ కూర్చోని పవిత్ర సింహాసనం, దూడ చర్మంతో కిరీటం

కింగ్ చార్లెస్-౩ పట్టాభిషేకం మే6 జరగబోతోంది. ప్రాచీన సంప్రదాయాల్లో జరిగే ఈ వేడుకను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు చూడబోతున్నారు. అయితే, చాలా దేశాల్లో ఇలాంటి అరుదైన పట్టాభిషేకాలు జరుగుతుంటాయి.

వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)