కరోనావైరస్: శవపేటికలతో నిండిన ఇటలీ.. మరణించిన వారికి అంతిమ సంస్కారాలనూ దూరం చేసిన కోవిడ్-19

మృతదేహంపై బట్టలు కప్పుతున్న వ్యక్తి

ఫొటో సోర్స్, Jilla Dastmalchi

ఫొటో క్యాప్షన్, "మరణించిన వారికి తొడగమని కుటుంబ సభ్యులు ఇచ్చిన బట్టల్ని శవాలపై కప్పుతాం, బట్టలు కట్టినట్లుగానే తయారు చేస్తాం"
    • రచయిత, సోఫియా బెట్టిజ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రియతములు ఎవరైనా చనిపోతే, వారికి చివరిగా కన్నీటి వీడ్కోలు పలకడం మనకు చాలా ముఖ్యం. కానీ కరోనావైరస్ ఇటలీ ప్రజలకు ఆ చివరిచూపు కూడా లేకుండా చేసింది.

మృతులకు ఇచ్చే చివరి గౌరవాన్ని కూడా లాగేసుకున్న కోవిడ్-19, సజీవంగా ఉన్న వారి కుటుంబ సభ్యులను మరింత విషాదంలో ముంచేస్తోంది.

"ఈ మహమ్మారి రెండు సార్లు చంపింది" అని మిలాన్‌లో శవాలను ఖననం చేసే ఆండ్రియా సెరటా అన్నారు.

"మొదట ఇది చనిపోయే ముందు మనల్ని మన ప్రియమైనవారి నుంచి దూరంగా ఒంటరిని చేస్తుంది. తర్వాత అది మన దగ్గరకు ఎవరూ రాకుండా చేస్తుంది" అన్నారు.

"కుటుంబాలు సర్వనాశనం అయ్యాయి, దానిని అంగీకరించడం చాలా కష్టంగా ఉంది" అంటారు.

Sorry, your browser cannot display this map