CSKvsGT: ‘వాట్ ఏ క్యాచ్, టైగర్ జిందా హై’ అంటూ ధోనిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం...

ఫొటో సోర్స్, ANI
హంగ్రీ చీతా.. పిక్చర్ అబీ బాకీ హై మేరా దోస్త్.. టైగర్ జిందా హై.. ఐపీఎల్ లెజెండ్.. అంటూ ఎంఎస్ ధోనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఎందుకిన్ని ప్రశంసలు అంటే.. మంగళవారం చెన్నైలోని చిదంబరం మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌ను చూస్తే అర్థమవుతుంది.
గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోని చేసిన క్యాచ్ క్రికెట్ అభిమానులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.
గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ సందర్భంగా డారిల్ మిషెల్ వేసిన బంతికి గుజరాత్ బ్యాటర్ విజయ్ శంకర్‌ను అవుట్ చేసే క్రమంలో ధోని జంప్ చేసి మరీ స్టన్నింగ్ క్యాచ్ చేశాడు.
ఈ క్యాచ్‌తో ఒక్కసారిగా స్టేడియమంతా దద్దరిల్లింది. 42 ఏళ్ల వయసులో కూడా 24 ఏళ్ల కుర్రాడిలా ధోని ఈ క్యాచ్ పట్టుకున్నాడంటూ కామెంటర్లు సైతం కొనియాడారు.
‘‘టైగర్ జిందా హై...’’ అంటూ కామెంటర్లలో ఒకరైన సీఎస్‌కే వెటరన్ సురేష్ రైనా మెచ్చుకున్నారు.
42 ఏళ్ల వయసులో 24 ఏళ్ల కుర్రాడిలా ధోని ఫీల్డింగ్ చేశారంటూ మరో కామెంటర్ అన్నారు.
‘‘ఉడ్తా ధోని.. వాట్ ఏ క్యాచ్’’ అంటూ ఇర్ఫాన్ పఠాన్ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో పోస్టు చేశారు.
స్టేడియం లోపల, బయట, సోషల్ మీడియా ప్రపంచంలో ధోని ఫీల్డింగ్‌నే చర్చనీయాంశంగా మారింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
సోషల్ మీడియాలో అభిమానులు, యూజర్లు ధోనీని ఆకాశానికెత్తుతున్నారు. ‘వయసు ఒక నంబర్ మాత్రమే’ అంటూ చాలామంది వ్యాఖ్యానించారు. 42 ఏళ్ల వయసులో ధోనీ ఇంత చురుకుగా ఉండటం అద్భుతం అంటూ మరో యూజర్ కామెంట్ చేశారు.
మరో ఎక్స్ యూజర్ ఇంకో అడుగు ముందుకేసి అతను మనిషి కాదు...చిరుత అంటూ అభివర్ణించారు.
అదితి అనే యూజర్ ‘సేమ్ ఎనర్జీ’ అంటూ ధోనీని, సింహం బొమ్మను పక్కపక్కనే పెట్టి పోల్చే ప్రయత్నం చేశారు.
MS Dhoni taking rippers behind the wicket remains vintage అంటూ యువర్ మిలో7 అనే మరో యూజర్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
ధోని చురుకుదనం ఇసుమంతైనా తగ్గలేదు
వికెట్ల వెనక నిలబడి అత్యంత చురుగ్గా ఉంటారని, 42 ఏళ్ల వయసులో కూడా ధోని వేగం ఇసుమంతైనా తగ్గలేదని గుజరాత్ టైటాన్స్‌కు సీఎస్‌కేకు మధ్యలో జరిగిన మ్యాచ్ చూస్తే అర్థమైపోతుంది.
మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ప్రత్యేకత ఏంటంటే....ఈ క్యాచ్‌కు కోసం ధోనీ స్పందించిన తీరు. ఒక్కసారిగా ముందుకు దూకుతూ రెండు చేతులతో ఈ బంతిని ఒడిసిపట్టుకున్నాడు ధోనీ.
చాలాసార్లు వికెట్ కీపర్లుగా వ్యవహరించే వారు ఒక్క చేతితోనే క్యాచ్‌లను పట్టుకుంటూ ఉంటారు. కానీ, ధోని ఇలాంటి క్యాచ్‌లను రెండు చేతులతో పట్టుకుంటాడు.
అంటే ఎట్టిపరిస్థితుల్లో బంతి మిస్ కాకూడదన్నది ధోని అభిప్రాయం. ఇదే ధోనిని ఉన్నతంగా నిలుపుతుందంటారు స్పోర్ట్స్ జర్నలిస్ట్ మనోజ్ చతుర్వేది.
‘‘ధోనికి 42 అని ఎవరు చెప్పారు. ఆయన 22 ఏళ్ల వ్యక్తిలాగా కనిపిస్తున్నారు’’ అని సిద్ధూ కామెంట్ చేశారు.
సాధారణంగా బ్యాటర్లు సిక్స్ కొట్టినప్పుడు అభిమానులు చప్పట్లతో కేరింతలు కొడుతుంటారు. అయితే, ధోని విషయంలో అయితే, అభిమానుల్లో జోష్ మరింత ఎక్కువ. ఆయన కనిపిస్తేనే చాలు, అభిమానులు ఉత్సాహం నెలకొంటుంది.
గత సీజన్ వరకు అంబటి రాయుడు సీఎస్‌కే టీమ్ తరఫున ఆడాడు. మైదానంలో చాలా సార్లు ధోనికి ఉన్న క్రేజ్‌ను తాను స్వయంగా చూశానని అంబటి రాయుడు చెప్పాడు.

ఫొటో సోర్స్, Getty Images
బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టిన సీఎస్‌కే
సీఎస్‌కే ప్రారంభం నుంచే గుజరాత్ టైటాన్స్‌పై ఒత్తిడి పెట్టింది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ సీఎస్‌కే అదరగొట్టింది.
తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్దేశిత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 206 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర ఓపెనర్లుగా మంచి స్కోరు సాధించగా.. శివమ్ దూబే సైతం బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చి అర్థ సెంచరీ పూర్తి చేశాడు.
సీఎస్‌కే నిర్దేశించిన భారీ లక్ష్యంతో మైదానంలోకి వచ్చిన గుజరాత్ టైటాన్స్ అనుకున్న స్థాయిలో ఆడలేకపోయింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 143 పరుగులకే కుప్పకూలింది.
గత ఐపీఎస్ సీజన్‌లో 96 పరుగులు చేసిన సాయి సుదర్శన్ కూడా ఈ మ్యాచ్‌లో మెప్పించలేకపోయయాడు. కట్టుదిట్టమైన బౌలింగ్, భారీ లక్ష్యంతో స్వేచ్ఛగా ఆడలేకపోయాడు.
పరుగుల్లో వెనుకబడటంతో అతనిపై ఒత్తిడి పెరిగింది. సరిగ్గా ఈ ఒత్తిడి నుంచి బయటపడి స్వేచ్ఛగా పరుగులు తీసే సమయంలో అవుట్ అయ్యాడు. 31 బంతుల్లో 37 పరుగులే చేయగలిగాడు.

ఫొటో సోర్స్, Getty Images
అత్యంత సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజ్‌గా సీఎస్‌కే
ఈ ఏడాది మార్చి 22 నుంచి ప్రారంభమైన ఐపీఎల్ టోర్నమెంట్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ధోని తప్పుకున్నారు. తన నాయకత్వ బాధ్యతలను యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పజెప్పారు.
ధోని కెప్టెన్సీలో 2023లో టైటిల్ గెలుపుతో, ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజ్‌గా నిలిచింది సీఎస్‌కే. 2010, 2011, 2018, 2021, 2023లలో ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను సాధించింది.
చెన్నై సూపర్ కింగ్స్‌కు పోటీగా ముంబై ఇండియన్స్ కూడా ఐదుసార్లు ఐపీఎల్ టైటింగ్‌ను సొంతం చేసుకున్నట్లు స్పోర్టింగ్ న్యూస్ డాట్ కామ్ పేర్కొంది.
ఈ రెండు ఫ్రాంచైజీల వాల్యూయేషన్ కూడా భారీగానే ఉంది. ముంబై ఇండియన్స్ వాల్యూయేషన్ 87 మిలియన్ డాలర్లు కాగా.. సీఎస్‌కే వాల్యూయేషన్ 81 మిలియన్ డాలర్లు.
ఐపీఎల్ చరిత్రలో సీఎస్‌కే టీమ్ పదిసార్లు ఫైనల్‌కు చేరుకుంది. 2008లో ఐపీఎల్ టోర్నమెంట్ తొలుత ప్రారంభమైనప్పుడు కూడా సీఎస్‌కే టీమ్ ఫైనల్‌కు చేరుకుని, రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓటమి పాలైంది.
ఆ తర్వాత వెంటనే 2010లో ముంబై ఇండియన్స్ చేతిలో విజయం సాధించి తొలి ఐపీఎల్ టైటింగ్ పొందింది సీఎస్‌కే టీమ్. ఆ సమయంలో సీఎస్‌కే టీమ్ కెప్టెన్ ఎంఎస్ ధోనినే.
గెలుపొందిన ఐదుసార్లలో నాలుగు సార్లు సీఎస్‌కే టీమ్‌కు కెప్టెన్ ఎంఎస్ ధోనినే. ఈసారి టోర్నమెంట్‌లో మాత్రం ధోని కెప్టెన్‌గా వ్యవహరించడం లేదు.
ఇవి కూడా చదవండి:
- ఈడీ ఎవరినైనా అరెస్టు చేయొచ్చా? అన్ని అధికారాలు ఎలా వచ్చాయి?
- ఆమె 58 ఏళ్ల వయసులో మళ్లీ తల్లయింది, రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం వివరణ కోరింది...చట్టం ఏం చెబుతోంది?
- మనిషి మెదడులోకి పురుగులు ఎలా వస్తాయి?
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
- 'కలుపు దెయ్యాల'ను 141 ఏళ్ల కిందట భూమిలో పాతిపెట్టినా చావలేదు... అవి ఇలాఎంతకాలం జీవిస్తాయి?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














