శుభ్‌మన్ గిల్, అశ్విన్, షమీ, స్మృతి మంధానకు బీసీసీఐ అవార్డులు.. పురస్కారాలు పొందిన క్రీడాకారుల జాబితా ఇదే

టీమిండియా క్రికెటర్లు

ఫొటో సోర్స్, X/BCCI

ఫొటో క్యాప్షన్, అవార్డుల ప్రదానోత్సవంలో వివిధ దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లతో పాటు టీమిండియా మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు పాల్గొన్నారు.

క్రికెట్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన టీమిండియా ఆటగాళ్లకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అవార్డులు అందజేసింది. మంగళవారం హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ (పురుషుడు, మహిళ) కేటగిరీ, ఉత్తమ అంతర్జాతీయ అరంగ్రేటం, టెస్టులు, వన్డేల్లో అత్యధిక వికెట్లు, అత్యధిక పరుగులు, దేశవాళీ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన రంజీ జట్టు, ఉత్తమ అంపైర్ ఇలా వివిధ కేటగిరీల్లో అవార్డులు అందజేశారు.

ఇద్దరు భారత మాజీ క్రికెటర్లకు కల్నల్ సీకే నాయుడు (జీవితకాల సాఫల్య పురస్కారం) లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్స్ అవార్డు కూడా అందించింది.

తెలుగు రాష్ట్రాలకు చెందిన మిథాలీ రాజ్, సబ్బినేని మేఘన కూడా అవార్డులు దక్కించుకున్నారు.

బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జైషా చేతుల మీదుగా విజేతలు ఈ అవార్డులను అందుకున్నారు.

భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్‌ గిల్‌ ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ (పాలీ ఉమ్రిగర్) అవార్డును అందుకున్నారు. 2022-23 సంవత్సరానికిగానూ గిల్‌కు ఈ అవార్డు దక్కింది.

2021-22 ఏడాదికి గానూ జస్‌ప్రీత్‌ బుమ్రా, రవిచంద్రన్‌ అశ్విన్‌ (2020-21), మహమ్మద్ షమీ (2019-20)లు సైతం ఈ అవార్డును గెలుచుకున్నారు.

బీసీసీఐ అవార్డులు

ఫొటో సోర్స్, Getty Images

తెలుగమ్మాయిలకు అవార్డులు

భారత మహిళా క్రికెటర్లు స్మృతి మంధానా, దీప్తి శర్మలు చెరో రెండు అవార్డులను గెలుచుకున్నారు.

తెలుగమ్మాయి సబ్బినేని మేఘన 2021-22 ఏడాదికి గానూ ఉత్తమ అంతర్జాతీయ అరంగ్రేటం అవార్డుకు ఎంపికయ్యారు.

2020-21లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసినందుకు‌గానూ మిథాలీ రాజ్‌కు అవార్డు దక్కింది.

ఉత్తమ ప్రదర్శన కనబరిచిన పలువురు యువ క్రికెటర్లకు బీసీసీఐ అవార్డులు అందజేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

2019లో చివరగా ఈ అవార్డులు అందించిన బీసీసీఐ.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ అందజేసింది.

2019-20, 2020-21, 2021-22, 2022-23 సంవత్సరాలకు ఈ అవార్డులను ప్రదానం చేశారు.

'నమన్ అవార్డ్స్' పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లతో పాటు టీమిండియా మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు పాల్గొన్నారు.

టీమిండియా ఆటగాళ్లు దిగిన గ్రూప్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీమిండియా మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ గిటార్ వాయించి ఆకట్టుకున్నారు.

బీసీసీఐ అవార్డులు

ఫొటో సోర్స్, X/BCCI

ఫొటో క్యాప్షన్, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జైషా చేతుల మీదుగా విజేతలు అవార్డులను అందుకున్నారు.

ఎవరెవరికి ఏయే అవార్డులు ?

ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్- (పురుషులు) పాలీ ఉమ్రిగర్ అవార్డు

శుభ్‌మన్ గిల్ (2022-23)

జస్‌ప్రీత్‌ బుమ్రా (2021-22)

రవిచంద్రన్‌ అశ్విన్‌ (2020-21)

మొహమ్మద్ షమీ (2019-20)

ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ (మహిళలు)

దీప్తి శర్మ (2022-23)

స్మృతి మంధాన (2021-22)

స్మృతి మంధాన (2020-21)

దీప్తి శర్మ (2019-20)

జెమీమా, మిథాలీ రాజ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మిథాలీ రాజ్, జెమీమా

ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం (మహిళలు)

అమన్‌జోత్‌ కౌర్‌ (2022-23)

సబ్బినేని మేఘన (2021-22)

షెఫాలి వర్మ (2020- 21)

ప్రియా పునియా (2019-20)

ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం (పురుషులు)

యశస్వి జైస్వాల్‌ (2022-23)

శ్రేయస్‌ అయ్యర్ (2021-22)

అక్షర్‌ పటేల్‌ (2020-21)

మయాంక్‌ అగర్వాల్‌ (2019-2020)

అశ్విన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అశ్విన్

అశ్విన్‌కు 'దిలీప్ సర్దేశాయ్' అవార్డు

దిలీప్‌ సర్దేశాయ్‌ అవార్డు

రవిచంద్రన్‌ అశ్విన్‌ (2022-23)- టెస్టుల్లో అత్యధిక వికెట్లు (భారత్ వర్సెస్ వెస్టిండీస్)

యశస్వీ జైశ్వాల్‌ (2022-23)- టెస్టుల్లో అత్యధిక పరుగులు (భారత్ వర్సెస్ వెస్టిండీస్)

వన్డేల్లో అత్యధిక వికెట్లు (మహిళలు)

దేవికా యాదవ్‌ (2022-23)

రాజేశ్వరి గైక్వాడ్‌ (2021-22)

జులన్‌ గోస్వామి (2020-21)

పూనమ్‌ యాదవ్‌ (2019-20)

వన్డేల్లో అత్యధిక పరుగులు (మహిళలు)

జెమీమా రోడ్రిగ్స్‌ (2022-23)

హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (2021-22)

మిథాలీ రాజ్‌ (2020-21)

పూనమ్‌ రౌత్‌ (2019-20)

బీసీసీఐ అవార్డులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అవార్డుల ప్రధానోత్సవంలో వివిధ దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లతో పాటు టీమిండియా మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు పాల్గొన్నారు.

దేశవాళీ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన జట్టు

సౌరాష్ట్ర (2022-23)

మధ్యప్రదేశ్ (2021-22)

ముంబయి (2019-20)

దేశవాళీ క్రికెట్‌లో బెస్ట్‌ అంపైర్‌ అవార్డు

రోహన్‌ పండిట్‌ (2022-23)

జయరామన్‌ మదన్‌ గోపాల్‌ (2021-22)

వ్రిందా రతీ (2020-21)

ఏ. పద్మనాభన్‌ (2019-20)

వీటితో పాటు ఉత్తమ ప్రదర్శన చేసిన దేశవాళీ క్రికెటర్లకు లాల్‌అమర్ నాథ్, మాధవ్ రావ్ సింథియా అవార్డులతో పాటు ఎంఏ చిదంబరం, జగ్మోహన్ దాల్మియా ట్రోఫీలను ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)