IND vs ENG: సర్ఫరాజ్ ఖాన్‌కు ఈసారీ దక్కని అవకాశం, రజత్ పటీదార్‌కు చోటు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, విమల్ కుమార్
- హోదా, స్పోర్ట్స్ జర్నలిస్ట్, బీబీసీ కోసం
‘బ్రదర్ నా మాటలు గుర్తుపెట్టుకోండి.. కొన్నేళ్ల తరువాత మీరే నాకు కాల్ చేసి అభినందిస్తారు. ఆరోజు నేను ఊహించినదే నిజమైందంటారు చూడండి’
2011 వరల్డ్ కప్ సమయంలో వాంఖడే స్టేడియం వద్ద నౌశాద్ ఖాన్ నాతో చెప్పిన మాటలివి.
తన కుమారుడు సర్ఫరాజ్ ఖాన్‌కు ఆయన తండ్రి, కోచ్ కూడా. అప్పటికి సర్ఫరాజ్ ఖాన్ వయసు 13 ఏళ్లు. అప్పుడే తన కుమారుడు కచ్చితంగా భారత జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడతాడని నమ్మకంగా చెప్పారాయన.
టీమిండియా కోసం ఆడాలన్న తన కలను నౌశాద్ ఖాన్ సాకారం చేసుకోలేకపోయినా, తన కుమారులు మాత్రం కచ్చితంగా ఆ అవకాశం పొందాలనేది ఆయన కల.
ఎప్పటినుంచో అవకాశం కూడా ఎదురుచూస్తున్నారు సర్ఫరాజ్ ఖాన్.
శుక్రవారం విశాఖ వేదికగా జరగనున్న భారత్, ఇంగ్లండ్‌ల రెండో టెస్టు కోసం ఆయన ఎంపికయ్యారు. అయితే, మైదానంలో దిగే తుది జట్టులో ఆయనకు చోటు దొరకలేదు.
మరోవైపు.. సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ కూడా రాణిస్తున్నాడు. అండర్-19 ప్రపంచ కప్‌లో ప్రతిభను చూపాడు.

ఫొటో సోర్స్, Getty Images
తొలి మ్యాచ్ ఆడే అవకాశాలు ..
సర్ఫరాజ్ తొలి మ్యాచ్ ఆడే అవకాశాలు ఎక్కువేనని మాజీ టీమిండియా సెలక్టర్ చేతన్ శర్మ అంచనా వేశారు కానీ, ఆయన అంచనాలు నిజం కాలేదు.
"అవకాశం వచ్చిన ప్రతిసారి తన ఇన్నింగ్స్‌తో రన్స్ సాధిస్తూనే ఉన్నాడు. కానీ, టీమిండియా జట్టులో అవకాశం దక్కడం అంత సులభం కాదు. నా అంచనా ప్రకారం టీమ్ మేనేజ్‌మెంట్ సర్ఫరాజ్‌కు అవకాశం ఇవ్వొచ్చు. భవిష్యత్తులో ఎలెవన్ జట్టులో అతడికి స్థానం ఉంటుంది" అన్నారు.
నిరుడు ప్రపంచ టెస్ట్ క్రికెట్ ఛాంపియన్‌షిప్, అంతకుముందు ఆస్ట్రేలియాతో ఆడిన టెస్ట్ సిరీస్ సమయంలోనూ సర్ఫరాజ్ టీమిండియాతోనే ఉన్నాడు. అయితే, సెలక్టర్లు టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్‌కు అవకాశమిచ్చారు.
ఇటీవలే, దక్షిణాఫ్రికా టూర్‌లో గాయపడిన టీమిండియా ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ జట్టు నుంచి తప్పుకొన్న సమయంలో సర్ఫరాజ్ పేరు వినిపించింది. కానీ, ఆ అవకాశం అభిమన్యుకి దక్కింది.
అవకాశాలు ముంగిటకు వచ్చి, దూరమవుతున్నా సర్ఫరాజ్ మాత్రం ఆశ కోల్పోలేదు.
తప్పకుండా జట్టులో స్థానం లభిస్తుందని, ఈరోజు కాకపోయినా మరోరోజు సెలక్టర్ల దృష్టి తనపై పడుతుందని నమ్మకంగా ఉన్నాడు.
కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మలు దూకుడుగా ఇన్నింగ్స్ ఆడే ఆటగాడికి ఇంగ్లండ్ లాంటి జట్టుతో ఆడేందుకు అవకాశమిస్తారా? అనేది కూడా ప్రశ్నే.
మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఇటీవలే, సోషల్ మీడియా వేదికగా సర్ఫరాజ్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ, ముంబయి ఆటగాడికి జట్టులో స్థానమెందుకు లభించడం లేదని స్పందించారు.
అదేసమయంలో టీమ్ మేనేజ్మెంట్ శుభమన్‌గిల్, శ్రేయస్ లాంటి ఆటగాళ్లకు కూడా అవకాశమివ్వాలని అన్నారు.
అదేసమయంలోవిరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా వంటి ప్లేయర్లు జట్టుకు దూరం కావడం పట్ల విచారం వ్యక్తం చేశారు.
26 ఏళ్ల సర్ఫరాజ్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడే అవకాశం కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నాడు.
16 వయసులో ప్రస్తుత టీమిండియా క్రికెటర్ల శ్రేయస్ అయ్యర్, సంజు సాంమ్సన్‌లతో కలిసి అండర్ 19 వరల్డ్ కప్ ఆడాడు. ఆ టోర్నీలో మిగిలిన ఇద్దరికన్నా మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు.
అదిమాత్రమే కాక, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లతో కలిసి ఆడాడు.

ఫొటో సోర్స్, Getty Images
కెరీర్‌లో ఎత్తు పల్లాలు..
మంచి ప్రతిభ ఉన్నప్పటికీ సర్ఫరాజ్ ఖాన్ కెరీర్‌లోనూ ఒడిదొడుకులు ఉన్నాయి.
కొన్నిసార్లు క్రమశిక్షణ తప్పిన కారణంగా వివాదాల్లోనూ చిక్కుకున్నాడు. మరికొన్ని సార్లు ఫిట్‌నెస్ కారణంగా విమర్శలు ఎదుర్కొన్నారు.
ఈ మధ్య కాలంలో మాత్రం స్థిరంగా రాణిస్తున్నాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రూ. 50 లక్షలకు సర్ఫరాజ్ ఖాన్‌ను జట్టులోకి తీసుకుంది. తన ఇన్నింగ్స్‌తో విరాట్ కోహ్లీ ప్రశంసలు కూడా పొందాడు.
నాలుగేళ్ల క్రితం ముంబయి తరఫున రంజీ ట్రోఫీ ఆడిన సమయంలో ట్రిపుల్ సెంచరీ చేసి, అందరి దృష్టిని ఆకర్షించాడు.
సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌశాద్ ఖాన్ నమ్మకంగా ఉన్నారు.
స్థానిక జర్నలిస్టులతో సర్ఫరాజ్ ప్రతిభ గురించి ప్రస్తావించినప్పుడు వారు కొన్ని ఘటనలు గుర్తుచేసుకున్నారు.
సీనియర్ జర్నలిస్ట్ ఒకరు మాట్లాడిన సందర్భంలో, 2009లో ప్రముఖ స్కూల్ టోర్నమెంట్ హారిస్ షీల్డ్ కప్‌లో సర్ఫరాజ్ 439 పరుగులు సాధించి, సచిన్ పేరుమీద ఉన్న 346 పరుగుల రికార్డును అధిగమించాడని చెప్పారు.
అప్పటి నుంచే చాలా మంది ముంబయి వాసులు సర్ఫరాజ్‌ను కాబోయే తెందూల్కర్ అని పిలిచేవారని ఆయన చెప్పారు. అంతలా అభిమానించేవారని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- జ్ఞానవాపి మసీదు ప్రాంగణం: వ్యాస్ బేస్మెంట్లో హిందువుల పూజలు.. ఇంతకూ ఇది ఎక్కడుంది? ఈ వివాదం ఎలా మొదలైంది?
- ఇమ్రాన్ ఖాన్‌తోపాటు జైలు శిక్ష పడ్డ మూడో భార్య బుస్రా బీబీ ఎవరు? ఆమె గురించి పాకిస్తాన్లో జరిగే చర్చ ఏమిటి?
- Cervical Cancer: నిర్మల సీతారామన్ 2024 బడ్జెట్లో ప్రస్తావించిన ఈ వ్యాధి ఏమిటి? ఎవరికి వస్తుంది? వ్యాక్సీన్‌తో పూర్తిగా తగ్గించవచ్చా
- చంపయీ సోరెన్: ఝార్ఖండ్ సీఎం అభ్యర్థిగా ఈ నిరాడంబర ఎమ్మెల్యేకు అవకాశం ఎలా వచ్చింది
- వెన్నునొప్పి తగ్గడానికి పనికొచ్చే చికిత్సలేమిటి? ఫలితమివ్వని పద్ధతులేమిటి? నడుముకు బెల్ట్ వాడడం వల్ల ప్రయోజనం లేదా
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














