కేంద్రం నుంచి నెలకు రూ.8 వేలు.. ఏమిటీ పథకం?

ఫొటో సోర్స్, BBC Sport
- రచయిత, ఎ.కిశోర్‌బాబు
- హోదా, బీబీసీ కోసం
హస్త కళల ఉత్పత్తులకు తగిన ఆదరణ లేక దారిద్య్రంలో మగ్గుతున్న కళాకారులను గుర్తించి వారికి ప్రతి నెలా రూ.8,000 ఆర్థిక సాయం అందించే పథకాన్ని కేంద్ర జౌళి శాఖ అమలు చేస్తోంది.
ఈ పథకం ఏమిటి? విధి విధానాలు ఏమిటి? ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఏమేమి పత్రాలు సమర్పించాలి? - ఇలాంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, HandiCrafats website gallery
ఎవరు అర్హులు?
దేశంలోని హస్త కళాకారులందరూ అర్హులే.
హస్త కళలలో శిల్పి గురు పురస్కారం, లేదా జాతీయ పురస్కారం, లేదా రాష్ట్ర ప్రభుత్వం చేత పురస్కారం పొందిన హస్త కళాకారులందరూ కూడా అర్హులే.
మెరిట్ సర్టిఫికెట్ పొందిన హస్త కళాకారులూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏ వయస్సు వారు అర్హులు?
2023 మార్చి 31 నాటికి ఎవరైతే 60 సంవత్సరాల వయసు నిండిన వారందరూ ఈ పథకానికి అర్హులే.
వార్షికాదాయ పరిమితి ఎంత?
ఈ పథకం పొందాలంటే హస్త కళాకారుల కుటుంబ ఆదాయ పరిమితి సంవత్సరానికి లక్ష రూపాయల్లోపు ఉండాలి.
ఏమేం పత్రాలు అవసరం?
- హస్త కళాకారుడు లేదా హస్త కళాకారిణి గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు,
- మండల రెవెన్యూ అధికారి లేదా కలెక్టర్ నుంచి జారీ చేసిన వార్షికాదాయ ధ్రువీకరణ పత్రం,
- పాన్ కార్డు,
- ఏదైనా జాతీయ బ్యాంకులో తన పేరిట ఉన్న ఆధార్ అనుసంధానిత సేవింగ్స్ ఖాతా నంబరు
- వైకల్యం ఉంటే దానికి సంబంధించి ధృవీకరణ పత్రం.

పత్రాలను ఎవరు ధ్రువీకరించాలి?
హస్త కళాకారులు సమర్పించే పత్రాలు, దరఖాస్తును ముందుగా కేంద్ర లేదా ప్రాంతీయ హస్తకళల కార్యాలయ ఉన్నతాధికారులు ధ్రువీకరించాల్సి ఉంటుంది.
అవార్డు సర్టిఫికెట్, ఫొటోగ్రాఫ్‌లను ప్రాంతీయ హస్త కళల కార్యాలయంలోని అసిస్టెంట్ డైరెక్టర్ లేదా డిప్యూటీ కమిషనర్ ధ్రువీకరించాలి.
అఫిడవిట్ సమర్పించాలా?
దరఖాస్తుతో పాటు కళాకారులు వారి వయసు ధ్రువీకరణ, ఇతర పత్రాలు అన్నీ నిజమైనవేనని తెలియజేస్తూ ఒక నాన్ జ్యూడీషియల్ స్టాంప్ పత్రంపై అఫిడవిట్ సమర్పించాలి.
దరఖాస్తు చేసుకునే విధానం ఏమిటి?
అర్హులైన హస్త కళాకారులు తమ దరఖాస్తులను ఆఫ్‌లైన్ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తును కింది వెబ్‌లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
https://www.handicrafts.nic.in/cmsUpload/20230602164150hindi%20and%20english%20merged.pdf

గడువు?
పూరించిన దరఖాస్తులను హస్త కళాకారులు జులై 15వ తేదీలోపు ప్రాంతీయ హస్త కళల కార్యాలయంలో లేదా ఫీల్డ్ సూపర్‌వైజర్‌కు, సేవా కేంద్రాల్లో సమర్పించాలి. ఇలా చేయడం వీలుకాని వాళ్లు, జులై 31లోపు దిల్లీలోని హస్త కళల ప్రధాన కార్యాలయంలో సమర్పించాలి.
వివరాలకు ఎవర్ని సంప్రదించాలి?
ఈ పథకానికి సంబంధించి ఏదైనా సమాచారం కావాలంటే దేశంలోని హస్త కళల ప్రాంతీయ కార్యాలయాలను లేదా దిల్లీలోని కేంద్ర కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.
ప్రధాన కార్యాలయం చిరునామా?
డెవలప్‌మెంట్ కమిషనర్ (హ్యాండీక్ట్రాఫ్ట్స్)
మినిస్ట్రీ ఆఫ్ టెక్ట్స్‌టైల్స్
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
వెస్ట్ బ్లాక్, నంబర్ 7,
ఆర్.కె.పురం
న్యూ దిల్లీ
ఫోన్ నెంబరు : 011-26100049
హెల్ప్‌లైన్ నెంబరు : 18002084800 (టోల్‌ఫ్రీ నెంబరు)
వెబ్‌సైట్: https://www.handicrafts.nic.in/
ఇవి కూడా చదవండి:
- కెనడా నుంచి వందల మంది భారతీయ విద్యార్థులు వెనక్కి వచ్చేయాల్సిందేనా? అసలేం జరిగింది?
- అమెజాన్ అడవుల్లో కూలిన విమానంలోని నలుగురు పిల్లలు 40 రోజుల తర్వాత ప్రాణాలతో దొరికారు
- వక్షోజాలు పెరగడానికి హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకుంటే ఏమవుతుంది?
- రాక్ క్లైంబింగ్ సురక్షితంగా చేయడం ఎలా... ట్రైనర్ చెప్పే పాఠాలేంటి?
- మీ డేటా చోరీకి గురైతే ఏమవుతుంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














