ఉత్తరాదిలో భారీ వర్షాలకు 15 మంది మృతి.. వాన బీభత్సానికి అద్దం పట్టే ఫోటోలివీ

ఫొటో సోర్స్, ANI
ఉత్తరాదిలో భారీ వర్షాలు, వరదల వల్ల మూడు రోజుల్లో 15 మంది చనిపోయారు. చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది.
హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు రావడం వల్ల ఇల్లు ధ్వంసమయ్యాయి.
పొరుగున ఉన్న ఉత్తరాఖండ్‌లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ కూడా అనేక నదుల నీటి మట్టాలు ప్రమాద స్థాయిని దాటాయి.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
దిల్లీలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో స్కూళ్లను మూసివేశారు.
నగరంలోని కొన్ని ప్రాంతాలలో వర్షపు నీరు ప్రమాదకరంగా మారింది.
మూసుకుపోయిన కాలువలు, మునిగిపోయిన రోడ్ల నుండి నీరు అధికంగా రావడంతో బస్తీవాసులు ఇబ్బంది పడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
చాలా మంది వరద నీటిలోనే వాహనాలు నడపాల్సి వచ్చింది. కొన్నిచోట్ల ట్రాఫిక్ జామ్‌లలో చాలా గంటలు గడపవలసి వచ్చింది.
వర్షాలకు దేశ రాజధాని తట్టుకోలేక పోయిందని పలువురు దిల్లీ వాసులు సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
అస్సాం, నాగాలాండ్ సహా అనేక ఈశాన్య రాష్ట్రాలు కూడా ఇటీవలి రోజుల్లో భారీ వర్షాలు కురిశాయి. అస్సాంలో వరదల కారణంగా వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తరాదిలో రానున్న రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.

ఫొటో సోర్స్, ANI
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో అనేక ప్రాంతాలకు మిగతా ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

ఫొటో సోర్స్, ANI
ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఒక కీలక రహదారిని మూసివేయవలసి వచ్చింది.
రాష్ట్రంలో గత 48 గంటల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, రాబోయే కొద్ది రోజుల్లో మరింత ఎక్కువ కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

హిమాచల్ ప్రదేశ్‌లో ఆదివారం కార్లు నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి.

ఫొటో సోర్స్, ANI
హిమాచల్ ప్రదేశ్‌లో ఈ వారాంతంలో కనీసం 14 కొండచరియలు విరిగిపడినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.
రెండు రోజుల పాటు అన్ని స్కూళ్లను, కాలేజీలను మూసివేశారు.














