వాతావరణ మార్పులు: మనిషి కారణంగా అడవులూ కర్బన ఉద్గారాలకు కేంద్రంగా మారుతున్నాయా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, విక్టోరియా గిల్
- హోదా, సైన్స్ కరస్పాండెంట్, బీబీసీ న్యూస్
ప్రపంచంలోనే అతి పెద్దవైన 10 అభయారణ్యాల నుంచి అధిక మోతాదులో కర్బన ఉద్గారాలు విడుదలవుతున్నాయి. భూఉష్ణోగ్రతలను పెంచుతున్న వాయువులను గ్రహిస్తున్న అభయారణ్యాలపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. యునెస్కో ఈ అభయారణ్యాలను ‘వరల్డ్ హెరిటేజ్ సైట్స్’గా గుర్తించింది.
గత 20 ఏళ్లలో ఈ 10 అభయారణ్యాలు తాము గ్రహించిన ఉద్గారాల కంటే ఎక్కువ మోతాదులో కార్బన్ విడుదల చేసినట్లు ఈ అధ్యయనం తెలిపింది.
ప్రపంచ సాంస్కృతిక అభయారణ్యాల వైశాల్యం జర్మనీ విస్తీర్ణానికి రెండింతలు ఉంటుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 257 సాంస్కృతిక అభయారణ్యాలన్నీ కలిపి ఏటా 19 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలను వాతావరణంలోకి విడుదల చేస్తున్నట్లు ఇదే పరిశోధన తేల్చింది.
"ఇంధన వాయువుల ద్వారా యూకే ఏటా విడుదల చేస్తున్న కర్బన ఉద్గారాల్లో ఇది దాదాపు సగం" అని ఈ అధ్యయన నివేదిక సహ రచయత, యునెస్కోకు చెందిన డాక్టర్ టేల్స్ కహ్వాల్యూ రీసెండ్ చెప్పారు.
"వాతావరణ మార్పులను అరికట్టడంలో ఈ అడవులు పోషించే కీలకమైన పాత్రపై ప్రస్తుతం మా దగ్గర సమగ్రమైన సమాచారం ఉంది" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అడవులు చాలా ఒత్తిళ్లను ఎదుర్కొంటాయి. అందులో అక్రమంగా చెట్లను నరకడం, వ్యవసాయాన్ని పెంచడం, కార్చిచ్చుల లాంటివి ఉంటాయి.
వాతావరణ మార్పుల వల్ల ఈ ఒత్తిళ్లు మరింత పెరిగాయి.
2001-2020 మధ్యలో సేకరించిన శాటిలైట్ సమాచారాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించిన సమాచారంతో కలిపి, అధ్యయనకారులు ప్రపంచ అభయారణ్యాలు గ్రహించిన కర్బన ఉద్గారాలు.. అవి విడుదల చేసిన ఉద్గారాలను అంచనా వేశారు.
ఈ హరిత వనాలు, చెట్లు గ్రహించిన కొన్ని కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలను లెక్కించడంతో పాటు ఈ ప్రాంతాలన్నీ ఎంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయో కూడా ఈ అంచనా వెల్లడించింది.
ఈ అంచనాలో భాగంగా అధ్యయనం చేసిన కేంద్రాలకు అత్యున్నత స్థాయిలో అధికారికంగా భద్రత కల్పించారు.
వాటికున్న సహజ విలువ వల్ల ఈ అడవులన్నీ అంతర్జాతీయంగా చాలా ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. దాంతో, వీటిని చాలా నిశితంగా పర్యవేక్షిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
"కానీ, అవి ఇంకా గణనీయమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి" అని డాక్టర్ కహ్వాల్యూచెప్పారు.
ముఖ్యంగా ఈ అరణ్యాలు వ్యవసాయం కోసం చేసే అటవీనాశనం, చట్ట వ్యతిరేకంగా చెట్లను నరకడం వల్ల ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి.
"కార్చిచ్చుల వల్ల కూడా అడవులు ముప్పును ఎదుర్కొంటున్నాయి" అని కహ్వాల్యు అన్నారు.
విషవలయం
ఇటీవల కాలంలో సెర్బియా, యూఎస్, ఆస్ట్రేలియాలలో సంభవించిన కార్చిచ్చులు కొన్ని మిలియన్ టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ను విడుదల చేశాయి. వీటిని గతంలో ఎన్నడూ చూడని కార్చిచ్చులని యునెస్కో పేర్కొంది.
"ఇదొక విషవలయం" అని డాక్టర్ కహ్వాల్యు అన్నారు.
"కార్బన్ ఉద్గారాలు పెరుగుతున్నాయంటే, కార్చిచ్చులు కూడా పెరుగుతున్నట్లే అర్థం. అంటే, దీని ఫలితం మరిన్ని కార్బన్ ఉద్గారాలు" అని అన్నారు.
కార్చిచ్చులు మాత్రమే వాతావరణానికి సంబంధించిన ముప్పు కాదు.

ఫొటో సోర్స్, Getty Images
2001-2020 మధ్యలో కార్బన్ ఉద్గారాలకు కారణమైన అరణ్యాలు
1. ది ట్రాపికల్ రైన్ ఫారెస్ట్, సుమత్ర, ఇండోనేసియా
2. ది రియో ప్లాటానో బయో స్పియర్ రిజర్వ్, హొండురాస్
3. యోస్ మైట్ నేషనల్ పార్క్, యూఎస్
4. వాటర్ టన్ గ్లేసియర్ ఇంటర్నేషనల్ పీస్ పార్క్, కెనడా, యూఎస్
5. ది బార్బర్ టన్ మఖోన్ వా మౌంటయిన్స్ , సౌత్ ఆఫ్రికా
6. కినబాలు పార్క్, మలేసియా
7. ది యూ వి ఎస్ నూర్ బేసిన్, రష్యా, మంగోలియా
8. గ్రాండ్ కాన్యన్ నేషనల్ పార్క్, యూఎస్
9. ది గ్రేటర్ బ్లూ మౌంటెయిన్స్ ఏరియా, ఆస్ట్రేలియా
10.మోర్న్ ట్రోయిస్ పిటోన్స్ నేషనల్ పార్క్, డొమినికా

ఫొటో సోర్స్, Getty Images
పరిష్కారం ఏమిటి
2017లో డొమినికాలో మరియా హరికేన్ సంభవించినప్పుడు మోర్న్ ట్రోయిస్ పిటోన్స్ జాతీయ పార్కులో 20 శాతం ప్రాంతం వినాశనానికి గురయింది.
"ఈ అధ్యయనం ఒక ఆందోళనాత్మక సందేశాన్నిస్తోంది" అని డాక్టర్ కహ్వాల్యు చెప్పారు.
"ప్రపంచంలో రక్షిత, ఉత్తమమైన అరణ్యాలు కూడా అంతర్జాతీయంగా ఏర్పడుతున్న వాతావరణ సంక్షోభం వల్ల ముప్పును ఎదుర్కొంటున్నాయి. అడవులన్నీ కార్బన్ గ్రహించి జీవారణ్య కేంద్రాలుగా మారాలంటే ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న ఉద్గారాలను తగ్గించడానికి సత్వర చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో సమాధానాలు దొరకని 5 కీలకమైన ప్రశ్నలు
- రాజ కుటుంబాన్ని కోట్ల సంపదను వదులుకుని 'సామాన్యుడిని' ప్రేమించి పెళ్లాడిన జపాన్ రాజకుమారి
- సెక్స్ ట్రేడ్ కోసం యూరప్‌కు మహిళల అక్రమ రవాణా... తప్పించుకున్న ఓ బాధితురాలి కథ
- ‘ఎన్ని పంటలు వేసినా రాని డబ్బులు గంజాయి సాగుతో వస్తున్నాయి.. మరో దారి లేకే గంజాయి పండిస్తున్నాం..’
- 'మృతదేహాల అవశేషాలపై ఇళ్లు కట్టుకుని నివసించడం మాకు అలవాటైపోయింది'
- సెక్సువల్ అటానమీ: భార్య శరీరంపై భర్తకు సర్వ హక్కులు ఉంటాయా? సెక్స్ భంగిమల కోసం బలవంతం చేయవచ్చా?
- ఉత్తర కొరియాలో డ్రగ్స్, తీవ్రవాదం, ఆయుధ విక్రయాల గుట్టు విప్పిన ఒక సీక్రెట్ ఏజెంట్
- కోవిడ్-19: మా అమ్మను డాక్టర్లు గినియా పిగ్లా భావించి ప్రయోగాలు చేశారు
- నీళ్లపైనే నగరాలు.. భవిష్యత్తు ఇదేనా? యూరప్ దేశాల్లో ఈ ప్రయోగాలు ఎందుకు జరుగుతున్నాయి?
- కశ్మీర్లో భయాందోళనల్లో హిందువులు.. శాంతి, భద్రతలపై ప్రభుత్వానివి ఉత్తి మాటలేనా?
- లిపులేఖ్ రోడ్డు విషయంలో భారత్ తీరుపై నేపాల్‌లో ఆగ్రహం ఎందుకు
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్‌పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








