కైలాస్ మానసరోవర్: లిపులేఖ్ రోడ్డు విషయంలో భారత్ తీరుపై నేపాల్‌లో ఆగ్రహం ఎందుకు

ఫొటో సోర్స్, RANABHAT / SOPA / LIGHTROCKET / GETTY IMAGES
భారత్, చైనాలను అనుసంధానం చేసే ఓ రహదారి ప్రాజెక్టుపై నేపాల్‌లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
నేపాల్ రాజధాని కాఠ్‌మాండూలో ఉన్న భారత దౌత్య కార్యాలయం ఎదుట పదుల సంఖ్యలో జనం పోగై శనివారం నిరసనకు దిగారని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ పేర్కొంది.
శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ఆ నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపింది.
భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం ధార్చులా నుంచి లిపులేఖ్ (చైనా సరిహద్దు) వరకూ ఉన్న లింక్ రోడ్డును ప్రారంభించారు. దీన్ని నిర్మించిన సరిహద్దు రహదారుల సంస్థకు అభినందనలు తెలిపారు.

నేపాల్ అభ్యంతరాలకు కారణం ఏంటంటే...
లిపులేఖ్ మార్గం తమ భూభాగమని నేపాల్ అంటోంది. 1816లో కుదిరిన సుగౌలీ ఒప్పందాన్ని దీనికి ఆధారంగా చూపుతోంది.
సుగౌలీ ఒప్పందం భారత్‌తో తమ పశ్చిమ సరిహద్దులను నిర్ణయించిందని, దీని ప్రకారం మహాకాలీ నది తూర్పునున్న ప్రాంతం తమ పరిధిలోకి వస్తుందని నేపాల్ అంటోంది. నేపాల్ చెబుతున్న ఈ ప్రాంతంలోనే లింపియాధురా, కాలాపానీ, లిపులేఖ్ ఉన్నాయి.
వ్యూహాత్మకంగా ప్రాధాన్యం ఉన్న కాలాపానీ 1962లో భారత్-చైనా యుద్ధం జరిగినప్పటి నుంచి భారత సైన్యం నియంత్రణలో ఉంది. ఆ ప్రాంతం కూడా తమదేనని నేపాల్ వాదిస్తోంది.
నేపాల్ విదేశాంగ శాఖ శనివారం ఓ అధికారిక ప్రకటనను జారీ చేసింది.
‘‘సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కుదిరిన అంగీకారానికి భారత్ ఏకపక్ష చర్యలు విఘాతం కలిగిస్తున్నాయి’’ అని అందులో పేర్కొంది.
కాఠ్‌మాండూలోని భారత దౌత్యకార్యాలయం బయట, మరికొన్ని ప్రాంతాల్లో నిరసనలు జరిగాయని నేపాల్ పోలీసులు తెలిపారు. కనీసం 38 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు.
కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నేపాల్‌లో ఇప్పుడు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. దీన్ని లెక్కచేయకుండా నిరసనకారులు రహదారులపైకి వచ్చారు.
నేపాల్‌లో ట్విటర్‌లో శనివారం #backoffindia అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయ్యింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
‘‘మా పొరుగు దేశమైన భారత్ విస్తీర్ణపరంగా ప్రపంచంలోనే ఏడో అతిపెద్దది. దాని వైశాల్యం 3.28 లక్షల చదరపు కి.మీ.లు. కానీ, వారికది చాలడం లేదు. ఇంకొన్ని కి.మీ.లు కావాలని కోరుకుంటున్నారు. నేపాల్‌కు చెందిన లింపియాధురా, కాలాపానీ, లిపులేఖ్ కూడా వారివి చేసుకోవాలని అనుకుంటున్నారు’’ అని నేపాల్ రాజ్యాంగ నిపుణుడు బిపిన్ అధికారి ట్వీట్ చేశారు.
‘‘ఆ ప్రాంతంపై వివాదం ఉందని రెండు పక్షాలు అంగీకరించాయి. సంప్రదింపుల సమయంలో భారత్ ఏపక్షంగా, బలవంతంగా చేస్తున్న చర్యలు రెండు దేశాల స్నేహ సంబంధాలను దెబ్బతీస్తున్నాయి’’ అని భారత్‌లో నేపాల్ దౌత్యవేత్తగా పనిచేసిన అనుభవం ఉన్న బేష్ బహాదూర్ థాపా ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
‘పూర్తిగా భారత్‌లోనే’
నేపాల్ నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ స్పందించారు.
‘‘పిథౌరాగఢ్‌లో ప్రస్తుతం ప్రకటించిన రహదారి పూర్తిగా భారత ప్రాంతంలోనిదే. కైలాస్ మానసరోవర్ యాత్రకు వెళ్లేవాళ్లు ఈ రహదారి గుండా వెళ్తారు’’ అని అన్నారు.
‘‘పిథౌరాగఢ్-తవాఘాట్-ఘాటియాబాగడ్ మార్గానికి ధార్చులా-లిపులేఖ్ రహదారి కొనసాగింపు మార్గం, ఘాటియాబాగడ్‌లో మొదలై లిపులేఖ్ మార్గం వద్ద ఇది ముగుస్తుంది. లిపులేఖ్ కైలాస్ మానసరోవర్‌కు ప్రవేశ మార్గం. 80 కి.మీ.ల ఈ రహదారి 6000 నుంచి 17,060 మీటర్ల ఎత్తులో ఉంటుంది’’ అని భారత రక్షణశాఖ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఇదివరకు ఈ మార్గంలో కైలాస్ మానసరోవర్ యాత్రికులకు ఉన్న అవరోధాలు ఈ రహదారితో తొలగుతాయని, చైనా సరిహద్దు వరకూ వాహనాల్లోనే వెళ్లవచ్చని వివరించింది.
‘‘ప్రస్తుతం కైలాస్ మానసరోవర్‌కు చేరుకోవాలంటే సిక్కిం, నేపాల్ మార్గాల ద్వారా రెండు, మూడు వారాలు పడుతుంది. లిపులేఖ్ మార్గంలో 90 కి.మీ.ల దూరం ఎత్తైన కొండప్రాంతాన్ని ఎక్కుతూ వెళ్లాల్సి ఉండటంతో వయసులో పెద్దవాళ్లైన యాత్రికులు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఇక వాహనాల్లోనే యాత్రకు వెళ్లవచ్చు’’ అని పేర్కొంది.

ఫొటో సోర్స్, SURVEY OF INDIA
ఇదివరకు కాలాపానీ వివాదం
ఉత్తరాఖండ్‌లోని పిథోరాగఢ్ జిల్లాలో నేపాల్ సరిహద్దులో కాలాపానీ ప్రాంతం ఉంది. దీని విస్తీర్ణం 35 చదరపు కిలోమీటర్లు. మహాకాలీ నది పుట్టేది ఇక్కడే.
నేపాల్‌తో 80.5 కి.మీ.లు, చైనాతో 344 కి.మీ.ల పొడవున సరిహద్దును ఉత్తరాఖండ్ రాష్ట్రం పంచుకుంటోంది.
కాలాపానీని, మహాకాళీ నదిని భారత్ తమ దేశం భూభాగాలుగా చూపిస్తూ గత ఏడాది మ్యాప్ విడుదల చేసింది.
అప్పుడు కూడా నేపాల్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కాలాపానీ తమ దేశంలో ఉందని, అది భారత్‌లో ఉన్నట్లు చూపించడం సరికాదని ఆ దేశం వ్యాఖ్యానించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
1962లో భారత్ - చైనా యుద్ధం జరిగినప్పటి నుంచి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసుల నియంత్రణలోనే కాలాపానీ ప్రాంతం ఉంది.
చైనాతో యుద్ధం జరిగిన సమయంలో వ్యూహాత్మకంగా కాలాపానీని సైనిక స్థావరంగా చేసుకోవడానికి భారత్‌కు తాము సహకరించినట్లు నేపాల్ చెబుతోంది. ఆ యుద్ధం తర్వాత భారత్.. కాలాపానీ మినహా, నేపాల్ ఉత్తర బెల్టులో ఉన్న తమ సరిహద్దు పోస్టులన్నీ తొలగించిందని, కానీ అక్కడి నుంచి మాత్రం భారత సైన్యం వెనక్కు వెళ్లలేదని నేపాల్ అధికారులు అంటున్నారు.
ఈ యుద్ధానికి ముందు 1961లో కాలాపానీలో తాము జనాభా లెక్కలు చేపట్టినప్పుడు భారత్ అభ్యంతరం వ్యక్తం చేయలేదని వాళ్లు చెబుతున్నారు. ఈ కాలాపానీ ప్రాంతం తమదేనని నేపాల్ చెప్పడానికి బలమైన కారణం సుగౌలీ ఒప్పందం.
నేపాల్‌కు, ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య 1816లో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం కాళీ నది భారత్‌తో నేపాల్ సరిహద్దుగా ఉందని ఆ దేశం అంటోంది. కాలాపానీ భారత్‌లో ఉండటమంటే సుగౌలీ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని వాదిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- మదర్స్ డే: ‘చంటిపిల్లకు పాలు ఎక్కడ ఇవ్వాలి? టాయ్లెట్లో కూర్చునా?’
- 'నా పాపను బయోవేస్ట్ అన్నారు. ఆ మాటకు నా గుండె పగిలింది‘
- తల్లిపాలు ఎంతకాలం ఇస్తే మంచిది.. రెండేళ్లా? ఐదేళ్లా?
- చనిపోయాడని చెప్పారు.. కానీ పదేళ్ల తర్వాత తిరిగొచ్చాడు
- ఐవీఎఫ్: భర్తలు లేకుండానే తల్లులవుతున్న ఒంటరి మహిళలు
- మదర్స్ డే: అమ్మ కోసం వెదుకులాటలో అనుకోని మలుపులు
- ఈ 'అమ్మ'కు ఒక్క బ్రెస్ట్‌ఫీడింగ్ తప్ప అన్ని పనులూ వచ్చు!
- అమెరికాలో కరోనావైరస్ వల్ల కనీసం 1,00,000 మంది చనిపోతారు: డోనల్డ్ ట్రంప్
- కరోనావైరస్ సంక్షోభం తర్వాత గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్, అమెజాన్ మరింత బలపడతాయా?
- కరోనావైరస్ లాక్‌డౌన్: దేశంలో నిరుద్యోగం, పేదరికం విపరీతంగా పెరిగిపోతాయా? సీఎంఐఈ నివేదిక ఏం చెప్తోంది?
- చైనాలో యాంటీ వైరస్ కార్లు నిజమా? గిమ్మిక్కా?
- ఫేస్ మాస్కులు ధరించిన దేవుళ్లు: కరోనావైరస్ మీద జానపద చిత్రకారుల పోరు
- కరోనావైరస్ లాక్‌డౌన్: విమాన, రైల్వే ప్రయాణాలకు రంగం సిద్ధం... 'ఈ నెలలోనే సేవలు ప్రారంభం'
- కరోనావైరస్ సంక్షోభం తర్వాత తయారీ రంగంలో చైనా స్థానాన్ని భారత్ భర్తీ చేస్తుందా?
- ‘‘మదర్స్ డే’కి ముందే అమ్మకి తుది వీడ్కోలు చెబుతాననుకోలేదు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








