మదర్స్ డే: ‘చంటిపిల్లకు పాలు ఎక్కడ ఇవ్వాలి? టాయ్‌లెట్లో కూర్చునా?’

ఫొటో సోర్స్, Getty Images
నైరోబీలోని ఒక రెస్టారెంట్లో తన పాపకు పాలుపడుతుండగా ఇద్దరు మహిళా సిబ్బంది తన పట్ల అమర్యాదగా ప్రవర్తించారని కెన్యాకు చెందిన ఒక మహిళ చెప్పారు. బెట్టీ కిమ్ అని తనను పరిచయం చేసుకున్న 26 ఏళ్ల ఆ మహిళ ఈ నెల 7న ఆలివ్ రెస్టారెంట్లో తనకు ఎదురైన సంఘటన గురించి ఒక ఫేస్‌బుక్ గ్రూప్‌లో పోస్ట్ చేశారు.
తల్లులంతా ఆమెకు మద్దతు పలకటం, రెస్టారెంట్ పట్ల నిరసన తెలిపేందుకు ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందిస్తుండటంతో ఇప్పుడా పోస్ట్ వైరల్ అయ్యింది.
అయితే, ఈ సంఘటనపై తాము తగిన చర్యలు తీసుకుంటామని, సహకరించాలని రెస్టారెంట్ ప్రకటించింది.
ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు పెడుతూ.. సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు ముందుకురావాలని కిమ్‌ను కోరింది. సోషల్ మీడియాలో పోస్టుల ద్వారానే ఈ సంఘటన గురించి తమకు తెలిసిందని వివరించింది.
‘టాయ్‌లెట్లో పాలు పట్టలేను’
ఏడాది వయసున్న కూతురికి తన పాలు పట్టడం ప్రారంభించగానే ఇద్దరు సిబ్బంది తనతో వాగ్వాదానికి దిగారని బీబీసీతో కిమ్ అన్నారు.
‘‘నేను భోజనం (బీఫ్ వంటకం, క్యాబేజీ, బంగాళదుంపలు, ఇతర కూరగాయలతో చేసిన వంటకాలు) ఆర్డర్ చేసి, దాని కోసం వేచి చూస్తున్నాను. అప్పుడే ఒక మహిళా సిబ్బంది అహంకారంతో మాట్లాడుతూ.. (పాలివ్వడం) ఆపేయాలని, లేదా ఆ భాగాన్ని కప్పుకోవాలని ఆదేశించింది. నేను షాకయ్యాను. ఎందుకంటే నేను ఇలా (పాలు పట్టడం) చాలాసార్లు చేశాను. పైగా, ఈ సంఘటన జరిగిన రోజు వర్షం కురుస్తోంది. నేను వెళ్లేందుకు మరే దారీ లేదు’’ అని ఆమె తెలిపారు.
తన కూతుర్ని అదుపుచేయటం అసాధ్యంగా ఉందని, దాంతో పాలు పట్టడాన్ని కొనసాగించానని ఆమె అన్నారు.
‘‘అలా నేను పాలు పట్టడం కొనసాగిస్తుండగా మరొక మహిళా సిబ్బంది నా భోజనాన్ని తీసుకొచ్చి, నేను చేస్తున్న పని వల్ల చెడ్డ భావన కలుగుతోందని చెప్పింది. నా కూతురికి పాలు పట్టేందుకు ఎక్కడికి వెళ్లాలి అని నేను కూడా మర్యాదగా అడిగాను. అందుకు ఆమె స్పందిస్తూ.. ఏ మాత్రం పద్ధతి లేకుండా టాయ్‌లెట్ వైపు చూపించింది. ఆ క్షణంలో నేను అవమాన భారంతో పాలు పట్టడం ఆపేశాను’’ అని ఆమె తెలిపారు.
రెస్టారెంట్ మేనేజర్ క్షమాపణలు చెప్పాలని కిమ్ ఆశిస్తున్నారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
ఆమెకు మద్దతుగా మే 15న ఒక నిరసన కార్యక్రమం చేపట్టాలని ‘కెన్యా గర్భిణీ, పాలిచ్చే తల్లుల’ ఫేస్‌బుక్ గ్రూప్‌లోని కొందరు మహిళలు నిర్ణయించారు. ఈ గ్రూప్‌లోనే కిమ్ తనకు ఎదురైన సంఘటన గురించి పేర్కొన్నారు.
ఫేస్‌బుక్, ఇస్టాగ్రామ్‌ల్లో పెట్టిన ఒక పోస్టర్ ప్రకారం.. ఫ్రీడమ్ కార్నర్ నుంచి మహిళలంతా ప్రదర్శన మొదలు పెట్టి పార్లమెంటుకు.. అక్కడి నుంచి ఆలివ్ రెస్టారెంట్ వరకు వెళ్లాలని, అక్కడ సామూహికంగా పిల్లలకు తమ పాలివ్వాలని ప్రణాళికలు రచించారు.
ఇవి కూడా చదవండి:
- తల్లిపాలకు టెక్నాలజీ అవసరమా?
- జోల పాటలు, లాలి పాటలతో తల్లికి కూడా లాభమే!
- రేడియో ప్రత్యక్ష ప్రసారంలో బిడ్డకు జన్మనిచ్చిన వ్యాఖ్యాత
- ప్రసవం: సిజేరియన్ కన్నా సహజకాన్పుతోనే శిశువుకు మేలు
- రక్తదానం, అవయవదానాలు సరే.. అండదానం తెలుసా!
- అమ్మానాన్న చనిపోయాక నాలుగేళ్లకు ఈ బుజ్జిగాడు పుట్టాడు!
- ‘వీర్య కణాలు తక్కువగా ఉన్నాయా? ఆరోగ్య సమస్యలు పెరుగుతాయ్’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








