అమెరికా: రేడియో కార్యక్రమంలో పిల్లాడికి జన్మనిచ్చిన వ్యాఖ్యాత

ఫొటో సోర్స్, @radiocassiday/Instagram
అమెరికాలో రేడియో కార్యక్రమ వ్యాఖ్యాత ఒకరు.. రేడియో ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో బిడ్డకు జన్మనిచ్చారు.
అమెరికాలోని సెయింట్ లూయీ నగరంలో ద ఆర్క్ రేడియో స్టేషన్‌లో ఉదయం పూట వ్యాఖ్యాతగా పనిచేస్తున్న కాసిడీ ప్రొక్టార్.. మంగళవారం సిజేరియన్ సెక్షన్ ద్వారా తను బిడ్డకు జన్మనివ్వటాన్ని రేడియోలో ప్రసారం చేశారు.
కాసిడీకి సోమవారం పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆమె పనిచేస్తున్న రేడియో స్టేషన్.. ఆమెకు ఆపరేషన్ నిర్వహించిన ఆస్పత్రితో చర్చించి.. ఆమె బిడ్డకు జన్మనివ్వటాన్ని రేడియోలో ప్రసారం చేసింది.
తన బిడ్డ రెండు వారాల ముందుగానే జన్మించాడని.. అతడి జననం రేడియోలో ప్రసారమవటం చాలా అద్భుతంగా అనిపించిందని కేసిడీ బీబీసీతో పేర్కొన్నారు.
‘‘రేడియో ప్రసారంలో జన్మనివ్వటం.. నేను రోజూ రేడియో కార్యక్రమంలో చేసే పనికి కొనసాగింపే. ఎందుకంటే.. నా జీవితంలోని అన్ని కోణాలనూ నేను మా శ్రోతలతో పంచుకుంటుంటాను’’ అని కాసిడీ తెలిపారు.
ఆమెకు మగబిడ్డ పుట్టగా.. జేమ్సన్ అని పేరు పెట్టారు. ఆ పేరును కూడా జనవరిలో జరిగిన ఒక పోటీలో రేడియో శ్రోతలే ఎంపిక చేశారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది

‘‘ఎంపిక చేసిన 12 కొంటె పేర్లను పోటీకి పెట్టాం. జేమ్సన్ పేరు ఎంచుకునే వరకూ ఓటింగ్ కొనసాగించాం’’ అని ప్రోగ్రామ్ డైరెక్టర్ స్కాట్ రోడీ.. ద రివర్‌ఫ్రంట్ టైమ్స్ వార్తాపత్రికతో పేర్కొన్నారు.
కాసిడీ రేడియో ప్రసారంలో జన్మనివ్వటం ‘‘సమ్మోహితమైన, ఉద్విగ్న క్షణం’’ అని ఆమె సహ వ్యాఖ్యాత స్పెన్సర్ గ్రేవ్స్ బీబీసీతో మాట్లాడుతూ అభివర్ణించారు.
కాసిడీ ఇప్పుడు మాతృత్వ సెలవు తీసుకోనున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఈ పెట్టె బుజ్జోళ్లను బతికిస్తుంది
- తల్లిపాలకు టెక్నాలజీ అవసరమా?
- ‘జైలుకెళ్లడానికైనా సిద్ధం నా బిడ్డకు టీకాలు వేయించను’
- 'నాకు ‘ఖత్నా’ చేశారు.. నా కూతురికి అలా జరగనివ్వను!'
- మహిళలు తమకు నచ్చినట్లు ఉంటే ఏం జరుగుతుంది?
- మహిళలూ మెదడును మీ దారికి తెచ్చుకోండి ఇలా..
- ‘సంప్రదాయ వైద్యంతో గర్భం’.. మోసపోయిన వందలాది మంది మహిళలు
- సైన్స్‌లో చరిత్ర సృష్టించిన ఏడుగురు మహిళా శాస్త్రవేత్తలు
- హిందువుల అబ్బాయి ముస్లింల ఇంట్లో.. ముస్లింల పిల్లాడు హిందువుల ఇంట్లో
- #HerChoice: పెళ్లి కాకుండానే తల్లిగా ఉండాలనుకున్నాను!
- పిల్లలకు కానుకగా ఇచ్చే డబ్బు ఎవరికి చెందుతుంది?
- ‘మీ బిడ్డకు పాలిస్తా.. నా బిడ్డను బతికించండి..!’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








