కాలాపానీని భారత్‌లో చూపించినందుకు నేపాల్‌కు కోపం ఎందుకు?

ఫొటో సోర్స్, SURVEY OF INDIA
- రచయిత, జుబేర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కొన్ని రోజుల క్రితం అంటే అక్టోబర్ 31న భారత ప్రభుత్వం జమ్ము-కశ్మీర్, లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాత అధికారికంగా దేశానికి సంబంధించిన ఒక మ్యాప్ విడుదల చేసింది.
ఈ మ్యాప్‌లో ఉత్తరాఖండ్, నేపాల్ మధ్య ఉన్న కాలాపానీ, లిపు లేఖ్ ప్రాంతాలు భారత్‌లో ఉన్నట్టు చూపించారు.
ఇందులో కొత్తగా ఏం లేదని భారత్ చెబుతోంది. కేవలం, ఒక రాష్ట్రంగా ఉన్న జమ్ము-కశ్మీర్, లద్దాఖ్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చూపించామని తెలిపింది.

ఫొటో సోర్స్, Rss
కానీ, నేపాల్ మాత్రం అవి తమ దేశంలోని ప్రాంతాలను మ్యాప్‌లో చూపించారని వాదిస్తోంది.
"కాలాపానీ నేపాల్‌లోని ప్రాంతం అనే దానిపై నేపాల్ ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉంది" అని నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక మీడియా రిలీజ్‌లో చెప్పింది.
దీనికి సమాధానంగా... "మా మ్యాప్‌లో భారత సౌర్వభౌమాధికార ప్రాంతం గురించి కచ్చితమైన చిత్రణ ఉంది. పొరుగు దేశాలతో ఉన్న సరిహద్దులను సవరించడం జరగలేదు" అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
"కొత్త మ్యాప్‌లో నేపాల్‌తో భారత సరిహద్దులను సవరించలేదు. నేపాల్‌తో ఉన్న సరిహద్దు పరిమితులు ఇంతకు ముందున్న వ్యవస్థ ప్రకారమే ఉన్నాయి. మా మధ్య ఉన్న సన్నిహిత, స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలతో చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు కట్టుబడి ఉంటామని మరోసారి చెబుతున్నాం" అన్నారు.

దీనిపై మాట్లాడిన సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కుమార్... "ఈ ఏడాది మ్యాప్ గతంలో ఉన్న వాటికంటే ఒక్క దగ్గర మాత్రమే వేరుగా ఉంది. అదే, జమ్ము-కశ్మీర్, లద్దాఖ్. ఎందుకంటే అక్టోబర్ 31 నుంచి అది రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారింది" అని చెప్పారు.
"సరిహద్దులో ఒక మిల్లీమీటర్ కూడా మార్పులు చేయలేదు. జమ్ము-కశ్మీర్, లద్దాఖ్‌లో ఏ మార్పులు జరిగాయో అవే కొత్తవి. మిగతా మ్యాప్‌లో ఎలాంటి మార్పూ చేయలేదు" అన్నారు.
2014లో తెలంగాణ రాష్ట్రంలాగే, దేశంలో కొత్త రాష్ట్రాలు, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినపుడు మేం వాటిని మ్యాప్‌లో చూపించాల్సి ఉంటుంది అని ఆయన చెప్పారు.

కానీ నేపాల్ విదేశాంగ శాఖ మాత్రం భారత్ ఈ పటాన్ని ఏకపక్షంగా విడుదల చేసిందని, అలా చేయడానికి దానికి ఎలాంటి అధికారం లేదని అంటోంది.
విదేశాంగ శాఖ ప్రెస్ రిలీజ్‌లో నేపాల్ తమ వాదనను వినిపించింది.
"కాలాపానీ ఒక వివాదాస్పద ప్రాంతం. దానిని ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. ఏకపక్ష తీర్మానాలు నేపాల్‌కు ఆమోదయోగ్యం కాదు. చారిత్రక దస్తావేజులు, సాక్ష్యాల ఆధారంగా, దౌత్యపరంగా ఈ అంశాన్ని పరిష్కరించుకోడానికి నేపాల్ కట్టుబడి ఉంది" అన్నారు.

ఫొటో సోర్స్, Pib
కాలాపానీ, లిపు లేఖ్‌ను తాము అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి ఒక ఒప్పందం ద్వారా పొందామని నేపాల్ చెబుతోంది.
కానీ సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా గిరీష్ కుమార్ మాత్రం.. "ఈ మ్యాప్‌ను మేం ఏకపక్షంగా ప్రచురించలేదు. మేం ప్రతి ఏటా మ్యాప్ విడుదల చేస్తుంటాం. మీరు 2018 లేదంటే అంతకు ముందు ఉన్న మ్యాప్‌లు చూడండి. కాలాపానీ భారత్‌లోనే కనిపిస్తుంది" అని చెప్పారు.
"1962లో చైనాతో జరిగిన యుద్ధం తర్వాత భారత్... కాలాపానీ మినహా, నేపాల్ ఉత్తర బెల్టులో ఉన్న తమ సరిహద్దు పోస్టులన్నీ తొలగించింది. 2014లో నేపాల్ వాదనను వ్యతిరేకించిన భారత్-చైనా లిపు లేఖ్ ద్వారా ద్వైపాక్షిక వాణిజ్య కారిడార్ నిర్మించడానికి అంగీకరించినపుడు దానిపై వివాదం మొదలైంది" అని నేపాల్ అధికారులు చెప్పారు.
ఇవి కూడా చదవండి
- మహిళా మేయర్ జుట్టు కత్తిరించిన నిరసనకారులు
- 30 ఏళ్లొచ్చినా పెళ్లి చేసుకోకపోతే ఒత్తిడి తట్టుకోలేం: హారీపోటర్ నటి ఎమ్మా వాట్సన్
- 18 ఏళ్ల లోపు పిల్లలు ఆన్లైన్ గేమ్స్ ఆడడంపై 'కర్ఫ్యూ' విధించిన ప్రభుత్వం
- ఈయూ ఎంపీలను కశ్మీర్ పర్యటనకు తీసుకొచ్చిన మహిళ ఎవరు
- హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం.. స్కూళ్లన్నీ బంద్
- చైనాలో 5జీ నెట్వర్క్ ప్రారంభం... ప్రపంచ టెక్నాలజీలో భారీ ముందడుగు
- తీవ్రవాద సంస్థలకు నిధులు అందకుండా పాకిస్తాన్ అడ్డుకోగలదా...
- పాకిస్తాన్లో ‘గాంధీ’ని కాపాడిన జిన్నా
- అయోధ్య కేసు: అసలు వివాదం ఏమిటి? సుప్రీం కోర్టు తీర్పు ఎప్పుడు వెలువడుతుంది...
- పిడికెడు మిరపకాయలు, గుప్పెడు అన్నం... అయిదేళ్లు ఆదే ఆమె ఆహారం
- టాకింగ్ బాక్స్: కెన్యాలో బాలికలపై వేధింపులకు ఇవి ఎలా పరిష్కారం చూపిస్తున్నాయి...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








