చైనా: 18 ఏళ్ల లోపు పిల్లలు ఆన్‌లైన్ గేమ్స్ ఆడడంపై 'కర్ఫ్యూ' విధించిన ప్రభుత్వం

ఫొటో సోర్స్, Getty Images
వీడియో గేమ్ వ్యసనాన్ని అదుపు చేయడానికి చైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మైనర్ పిల్లలు ఆన్‌లైన్ గేమ్స్ ఆడే సమయంపై 'కర్ఫ్యూ' విధించామని ప్రకటించింది.
దీని ప్రకారం చైనాలో 18 ఏళ్ల లోపు పిల్లలు రాత్రి 10 నుంచి ఉదయం 8 గంటల మధ్య ఆన్‌లైన్ గేమ్స్ ఆడడంపై నిషేధం విధిస్తారు. పిల్లలు వీక్ డేస్‌లో రోజుకు 90 నిమిషాలు, వారాంతాలు, సెలవుల్లో రోజుకు మూడు గంటలు వీడియో గేమ్స్ ఆడుకోడానికి అనుమతిస్తారు.
రోజురోజుకూ తీవ్రం అవుతున్న వీడియో గేమ్ వ్యసనాన్ని నియంత్రించేందుకు చైనా ఈ చర్యలు తీసుకుంది. ఈ గేమ్స్ ఆడడం పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని అధికారులు చెబుతున్నారు.
ప్రపంచంలోని అతిపెద్ద గేమింగ్ మార్కెట్లలో చైనా ఒకటి.
ప్రభుత్వం తరఫున మంగళవారం జారీ చేసిన అధికారిక మార్గనిర్దేశకాల్లో ఆన్‌లైన్ గేమ్స్ కోసం మైనర్లు ఖర్చు చేస్తున్న మొత్తంపై కూడా పరిమితులు విధించారు.
8 నుంచి 16 ఏళ్ల వయసు పిల్లలు ఆన్‌లైన్ గేమ్స్ కోసం నెలకు 200 యువాన్ల(2000 రూపాయలు) వరకూ ఖర్చు చేయచ్చు. 16 నుంచి 18 ఏళ్ల పిల్లల గేమింగ్ ఖాతాలపై నెలకు 400 యువాన్ల(4000 రూపాయలు ) వరకూ ఖర్చు చేయచ్చు.

ఇంతకు ముందు కూడా నిషేధం
చైనా ప్రపంచంలో రెండో అతిపెద్ద గేమింగ్ మార్కెట్‌గా ఉంది.
న్యూజూ రీసెర్చ్ సంస్థ ప్రకారం గేమింగ్ పరిశ్రమ ద్వారా సంపాదనల్లో అమెరికా మొదటిసారి చైనాను వెనక్కు నెట్టింది.
చైనాలో వీడియో గేమ్స్ వల్ల యువకుల్లో వస్తున్న చెడు ప్రభావాల గురించి విమర్శలు పెరుగుతున్నాయి.
ఈ గేమ్స్ ఆడడం వల్ల పిల్లలకు దగ్గరి దృష్టిలో సమస్యలు రావడంతో 2018లో చైనా ప్రభుత్వం గేమింగ్ నియంత్రణ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.
దీని ద్వారా ఆన్‌లైన్ గేమ్స్ సంఖ్యను పరిమితం చేస్తారు. దానితోపాటు వాటిని ఆడే సమయం, వయసు సంబంధించి నిషేధం అమలు చేస్తారు.
అదే ఏడాదిలో కొత్త వీడియో గేమ్స్‌కు అనుమతులు ఇవ్వడాన్ని కూడా చైనా నిషేధించింది. అది మరో 9 నెలలపాటు అమవలడం దేశంలో గేమింగ్ పరిశ్రమకు తీవ్రంగా నష్టం వచ్చిందని భావిస్తున్నారు.
కొన్ని అగ్ర వీడియో గేమ్ కంపెనీలు ప్రభుత్వ నిబంధనలపై సానుకూలంగా స్పందించాయి. కానీ, ఈ నిషేధం అమలు, వాటిని ఆడేవారి వయసును గుర్తించడం లాంటివి సవాలుతో కూడినవని భావిస్తున్నారు.
టాప్ గేమింగ్ కంపెనీ అయిన టెన్సెంట్ తమ గేమ్ ఆడేందుకు 12 ఏళ్లలోపు పిల్లలకు ఒక గంట, 12 నుంచి 18 ఏళ్ల పిల్లలకు రెండు గంటల సమయం ఇవ్వడంపై విమర్శలు ఎదురవుతున్నాయి.
కానీ, ప్రభుత్వ కొత్త మార్గనిర్దేశకాలు చైనాలోని అన్ని ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్స్‌కూ అమలవుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
వీడియో గేమ్ ఎంత ప్రమాదం?
గత ఏఢాది ప్రపంచ ఆరోగ్య సంస్థ గేమ్ వ్యసనాన్ని( దీనికి గేమింగ్ డిజార్డర్ అనే పేరు పెట్టారు) మానసిక ఆరోగ్య స్థితిగా చెప్పింది.
ఇటీవల విడుదలైన అమెరికా సైకియాట్రీ అసోసియేషన్ మెంటల్ డిజార్డర్ మాన్యువల్‌లో దీన్ని అధికారికంగా గుర్తించలేదు. కానీ, ఇంటర్‌నెట్ గేమింగ్ డిజార్డర్ అనే దానిని మరింత అధ్యయనం చేయాల్సిన ఒక స్థితిగా సూచించింది.
కొన్ని దేశాలు ఎక్కువగా గేమ్స్ ఆడడాన్ని ఒక పెద్ద పబ్లిక్ హెల్త్ అంశంగా భావిస్తాయి. చాలా ప్రాంతాల్లో దీనికి చికిత్స కోసం ప్రైవేటు అడిక్షన్ క్లినిక్స్ కూడా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- ఫేస్‌బుక్ లోగోలో మార్పులు... వాటిలో మాత్రమే కనిపిస్తుంది
- వారానికి నాలుగు రోజులే పని.. 40 శాతం పెరిగిన మైక్రోసాఫ్ట్ అమ్మకాలు
- బగ్దాదీ అక్కను నిర్బంధించిన టర్కీ.. ఐఎస్ రహస్యాలు తెలిసేనా?
- ‘ప్రేమలో పడ్డందుకు నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు’
- పాకిస్తాన్ థార్ ఎడారి ప్రాంతంలో తోడికోడళ్ల ఆత్మహత్యలకు కారణాలేంటి?
- కాక్‌పిట్‌లో ప్రయాణికురాలి ఫొటో తీసిన పైలట్... విమానం నడపకుండా జీవితకాల నిషేధం
- పాస్‌వర్డ్‌లతో భద్రత లేదా? బయోమెట్రిక్స్ సురక్షితమేనా?
- జైలుకు కన్నం వేసి ఈ ఖైదీలు ఎలా పారిపోయారంటే..
- 'ఓ హత్య జరగబోతోంది... అది నాదే'
- వాట్సాప్ మెసేజెస్ మూలాలను తెలుసుకోవాలని భారతదేశం ఎందుకు భావిస్తోంది...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









