మైక్రోసాఫ్ట్‌లో వారానికి నాలుగు రోజులే పని... 40 శాతం పెరిగిన అమ్మకాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జో క్లీన్‌మన్
- హోదా, టెక్నాలజీ రిపోర్టర్, బీబీసీ
వారంలో ఎన్ని రోజులు పనిచేయాలి- ఆరా, ఐదా, నాలుగా?
టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ జపాన్లో వారానికి నాలుగు రోజుల పని విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసింది. సిబ్బంది నాలుగు రోజులే పనిచేసిన సమయంలో అమ్మకాలు దాదాపు 40 శాతం పెరిగాయని మైక్రోసాఫ్ట్ జపాన్ చెప్పింది.
సంస్థ ఈ ఏడాది ఆగస్టులో శని, ఆదివారాలతోపాటు ప్రతి శుక్రవారం కార్యాలయాలను మూసి ఉంచింది. శుక్రవారాన్ని ప్రత్యేక సెలవుగా పరిగణించి, ఉద్యోగులకు ఆ రోజు వేతనాన్ని కూడా చెల్లించింది.
సంస్థ సమావేశాలేవీ 30 నిమిషాలకు మించకుండా చూసింది. ముఖాముఖి సమావేశాలకు ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్లో చర్చించడాన్ని ప్రోత్సహించింది.
ప్రపంచంలో అత్యంత సుదీర్ఘ పనిగంటలున్న దేశాల్లో జపాన్ ఒకటి.

ఫొటో సోర్స్, Reuters
ఉద్యోగులు ఏమన్నారు?
జపాన్ కంపెనీల్లో దాదాపు నాలుగో వంతు కంపెనీల్లో నెలకు 80 గంటలకు పైగా అదనంగా (ఓవర్‌టైమ్) పనిచేస్తున్న ఉద్యోగులున్నారని 2017లో వెలువడిన ఒక సర్వే తెలిపింది. ఈ అదనపు పనికి చాలా సందర్భాల్లో వేతనం చెల్లించడం లేదు.
'మైక్రోసాఫ్ట్ వర్క్-లైఫ్ చాయిస్ చాలెంజ్' అనే ఈ ప్రయోగాత్మక విధానం ఈ ఏడాది వేసవిలో నెలపాటు అమలైంది. తర్వాత దీనిపై సంస్థ నిర్వహించిన సర్వేలో 92 శాతం మంది ఉద్యోగులు సానుకూలత వ్యక్తంచేశారు.
2018 ఆగస్టుతో పోలిస్తే 2019 ఆగస్టులో విద్యుత్ వినియోగం 23 శాతం, పేపర్ ప్రింటింగ్ 59 శాతం తగ్గినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది.
ఈ విధానాన్ని శీతాకాలంలో మరోసారి అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈసారి 'ప్రత్యేక సెలవు' ఉండదని చెప్పింది. అయితే ఉద్యోగులు సరైన రీతిలో విశ్రాంతి తీసుకొనేలా ప్రోత్సహిస్తామని తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
జాక్ మా మాట: ఆరు రోజుల పని
పనిగంటల విషయంలో మైక్రోసాఫ్ట్‌తో పోలిస్తే చైనా ఆన్‌లైన్ వ్యాపార దిగ్గజం అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా పద్ధతి పూర్తి భిన్నంగా ఉంది.
ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు రోజుకు 12 గంటలపాటు ఆరు రోజులు పనిచేసే విధానం మంచిదని ఆయన ఈ ఏడాది ఏప్రిల్లో చెప్పారు. దీనిని '996' విధానంగా పేర్కొన్నారు.
బ్రిటన్లో సంగతి?
వారంలో నాలుగు రోజుల పని విధానం వాస్తవిక దృక్పథంతో కూడినది కాదని బ్రిటన్లో లేబర్ పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబరులో వెలువడిన ఒక నివేదిక చెప్పింది.
"కొంత మంది వారు అనుకొన్న సమయం కన్నా తక్కువ గంటలే పనిచేయాల్సి వస్తోంది. కానీ అత్యధికులు వారు కోరుకొన్నదానికన్నా ఎక్కువ సమయమే పనిచేయాల్సి వస్తోంది" అని నివేదిక వ్యాఖ్యానించింది. పార్ట్‌టైమ్ పని చేసినా, లేదా పనిదినాలు తగ్గినా చేయాల్సిన పని మాత్రం తగ్గదని చాలా మంది ఉద్యోగులు, కార్మికులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
- అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ ముఖద్వారంపై ట్రాన్స్‌వుమన్ రేవతి పేరు
- 'ఆలీబాబా' 996 విధానం: ఉద్యోగులు రోజుకు 12 గంటలు పనిచేయాలా?
- మైక్రోసాఫ్ట్: ‘రష్యా పొలిటికల్ హ్యాక్’ను విజయవంతంగా అడ్డుకున్నాం
- బిగ్‌బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్.. ప్రైజ్‌మనీతో ఏం చేయబోతున్నారు...
- స్టాకర్వేర్: భార్యలు, భాగస్వాములపై నిఘా కోసం పెరుగుతున్న స్పైవేర్ వినియోగం.. రెండో స్థానంలో భారత్
- జపాన్లో భూత్ బంగళాలు... నానాటికీ పెరుగుతున్న సమస్య
- హినా మునావర్: ఈ పాకిస్తాన్ మహిళ గురించి ఇప్పుడు చర్చ ఎందుకు?
- సినీడ్ బుర్కీ: ఫ్యాషన్ మ్యాగజీన్ ముఖచిత్రంగా ఎదిగిన ‘లిటిల్ పర్సన్’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








