హారీపోటర్ నటి ఎమ్మా వాట్సన్: ‘నాకు నేనే భాగస్వామి’గా ఎంతో సంతోషంగా ఉన్నా

ఫొటో సోర్స్, Getty Images
ముప్ఫయ్యేళ్ల వయసులోకి రావడంతో వ్యక్తిగత జీవితం విషయంలో తాను ఒత్తిడికి లోనవుతున్నానని హాలీవుడ్ నటి ఎమ్మా వాట్సన్ అన్నారు.
ఆ వయసుకి ఏం సాధించాలనే దానిపై అంతర్లీన సందేశాల ప్రవాహం ఒత్తిడికి గురిచేస్తోందని అన్నారు.
''భర్త, పిల్లలు లేకపోతే ఒక వయసు వచ్చాక నమ్మశక్యం కానంత ఆందోళన ఉంటుంది'' అని బ్రిటిష్ వోగ్‌తో ఆమె చెప్పారు.
అయితే, తాను 'నాకు నేనే భాగస్వామి'గా సంతోషంగానే ఉన్నానని చెప్పారు.
ఒంటరిగా ఉంటూనే సంతోషంగా ఉండొచ్చని తాను గతంలో అనుకోలేదని ఈ హ్యారీ పోటర్ సినిమాల నటి చెప్పుకొచ్చారు.
మహిళా హక్కుల కోసం కూడా పనిచేసే ఎమ్మా ఏప్రిల్‌లో 30ల్లోకి అడుగుపెట్టారు. ''నాకు 30 ఏళ్లొస్తే ఎందుకంత పెద్ద విషయం చేస్తారు దాన్ని? అదేమైనా పెద్ద విషయమా? ఓరి దేవుడో.. చాలా ఒత్తిడి అనుభవిస్తున్నాను'' అన్నారామె.

ఫొటో సోర్స్, Getty Images
''30ల్లోకి రాగానే హఠాత్తుగా చుట్టూ వినిపించే అంతర్లీన సందేశాల ఫలితంగానే ఒత్తిడికి గురవుతున్నట్లు అర్థం చేసుకున్నాను.. ముఫ్పయ్యేళ్లొచ్చినా పెళ్లి చేసుకుని పిల్లలను కనకపోతే, ఇల్లు కట్టుకోకపోతే, కెరీర్‌లో స్థిరత్వం రాకపోతే.. ఆందోళన, ఒత్తిడి మొదలైపోతుంది'' అన్నారామె.
ఎమ్మా రాబోయే చిత్రం లిటిల్ ఉమెన్ అనుసరణలో, తిమోతీ చలమెట్, సావోయిర్స్ రోనన్, ఫ్లోరెన్స్ పగ్‌లతో కలిసి నటించింది.
సహ-నటులు లారా డెర్న్, మెరిల్ స్ట్రీప్‌తో కలిసి పనిచేశారు. ఇందులో ఆమె నిజంగా ఆనందించినట్లు చెప్పారు.
"మేం లిటిల్ ఉమెన్ చేసే ముందు మా ముగ్గురం ఒకరికొకరు తెలుసు" అని ఆమె డిసెంబర్ సంచిక కోసం బ్రిటిష్ వోగ్‌తో అన్నారు.
"మేం ఉద్యమ ప్రదేశాల్లో కలుసుకున్నాం, కాబట్టి మేం ఎప్పుడైనా కలిసి పనిచేయడానికి ముందు ఒక నిర్దిష్ట ఉద్యమంలో భాగమైన కార్యకర్తలుగా ఈ మిత్రత్వం, సంఘీభావం మా మధ్య ఎప్పుడూ ఉంటుంది."

ఫొటో సోర్స్, Getty Images
ఈ ఏడాది రానున్న 'లిటిల్ ఉమెన్' చిత్రంలో ఎమ్మా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని సహనటులు లారా డెర్న్, మెరిల్ స్ట్రీప్‌లతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పారు.
ఎమ్మా వాట్సన్ యూఎన్ ఉమెన్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వం కోసం పోరాడుతున్న 'హి ఫర్ షీ' ప్రచార కార్యక్రమంలోనూ ఆమె భాగస్వామి.
ఆ ప్రచార కార్యక్రమంలో భాగంగానే ఆమె నోబెల్ శాంతి బహుమతి విజేత మలాలాను ఇంటర్వ్యూ చేశారు.
స్త్రీవాదిగా తనను ప్రపంచమంతా గుర్తించడానికి కారణం ఎమ్మాయేనని.. ఇకపై ఆ గుర్తింపును వాడుకోవడానికి మొహమాటపడనని మలాలా అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అసలైన సూపర్ మ్యాన్, థోర్, వండర్ ఉమన్ ఎవరు.. ఆ సూపర్ హీరోలు ఎక్కడుండేవారు
- అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఆల్‌టైమ్ రికార్డ్.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే
- భూపత్ డాకూ: భారత్ నుంచి పారిపోయిన ఈ దోపిడీ దొంగకు పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది
- రక్తం చిందినట్టు ఎరుపు రంగులోకి మారిపోయిన ఆకాశం.. ‘ఇది అంగారక గ్రహం కాదు.. మా ఊరే’
- వేముగోడులో రజకులను ఎందుకు వెలివేశారు?
- టర్కీ - సిరియా సంఘర్షణ: కుర్దు ఫైటర్ల మీద క్రూరమైన యుద్ధ నేరాలు... వెలుగులోకి దారుణమైన వీడియోలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








