ది జోకర్: నవ్వించాల్సినవాడు ఇంత విలన్ ఎందుకయ్యాడు, విడుదలకు ముందే సినిమా చుట్టూ వివాదాలు

ది జోకర్: విడుదలకు ముందే చుట్టుముట్టిన వివాదాలు

ఫొటో సోర్స్, WARNER BROS

ఫొటో క్యాప్షన్, 'ది జోకర్' సినిమాలో ఆర్థర్ ఫ్లెక్ పాత్రలో ఫినిక్స్

డీసీ కామిక్స్ బ్యాట్‌మెన్‌ కథల్లో విలన్ జోకర్ జీవితం గురించి తీసిన కొత్త సినిమా 'ది జోకర్‌'ను విడుదలకు ముందే వివాదాలు కమ్ముకుంటున్నాయి.

2012లో బ్యాట్‌మెన్‌ను వ్యతిరేకించే ఒక జోకర్ అభిమాని జరిపిన కాల్పుల మృతుల కుటుంబాలు కొత్తగా విడుదలయ్యే 'ది జోకర్' సినిమా విడుదలను ఆపేయాలని దానిని నిర్మించిన వార్నర్ బ్రదర్స్‌కు లేఖ రాశాయి.

'ది డార్క్ నైట్ రైజెస్' విడుదలైన తర్వాత కొలొరాడో, ఆరోరాలోని ఒక సినిమా హాల్లో గ్యాస్ మాస్క్ ధరించిన ఒక యువకుడు తుపాకీతో కాల్పులు జరిపడంతో 12 మంది మరణించారు.

మృతుల్లో 24 ఏళ్ల జెస్సిగా ఘావీ కూడా ఉంది. ఆమె తల్లి శాండీ ఫిలిప్స్ బీబీసీతో మాట్లాడుతూ జోకర్ ట్రైలర్స్ చూస్తుంటే భయమేస్తోందని చెప్పారు.

జోకర్ కొత్త సినిమాలో వాకీన్ ఫినిక్స్ లీడ్ రోల్ చేస్తున్నాడని వార్నర్ బ్రదర్స్ చెప్పింది. వాస్తవంగా జరిగిన హింసాత్మక ఘటనలను ఈ సినిమా ద్వారా తాము సమర్థించడం లేదని చెప్పింది.

ది జోకర్: విడుదలకు ముందే చుట్టుముట్టిన వివాదాలు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, దర్శకుడు టాడ్ ఫిలిప్స్, సహ నటి జాజీ బీట్జ్‌తో ది జోకర్ హీరో ఫినిక్స్(మధ్యలో)

భయపెట్టిన 'ది జోకర్'

ఇదే విషయంపై ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించినపుడు ఫినిక్స్ సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు.

2012 కాల్పుల ఘటన నుంచి ప్రాణాలతో తప్పించుకున్న శాండీ ఫిలిప్స్, ఆమె భర్త లోనీ ఆ హింసకు వ్యతిరేకంగా 'సర్వైవర్స్ ఎంపవర్డ్' అనే ఒక గ్రూప్ నిర్వహిస్తున్నారు.

మొదట జోకర్ ట్రైలర్ చూసినప్పుడు భయమేసింది. తర్వాత దానిని గమనించాక, అందులో అనవసరమైన హింస ఉందని గుర్తించగానే, నా వెన్నులో వణుకు పుట్టింది అని శాండీ చెప్పారు.

"ప్రజల ఆందోళనల గురించి చాలా నిర్మాణ సంస్థలు పట్టించుకోకపోవడం, బాధ్యత తీసుకోకపోవడం నాకు కోపం తెప్పించింది" అని ఆమె చెప్పారు.

"జోకర్ పాత్రను కథానాయకుడుగా చూపిస్తూ వార్నర్ బ్రదర్స్ సానుభూతి కథ ఉన్న జోకర్ సినిమా విడుదల చేస్తోందని తెలీగానే మాకు భయం వేసింది" అని ఈ కుటుంబాలు లేఖలో చెప్పాయి.

ది జోకర్: విడుదలకు ముందే చుట్టుముట్టిన వివాదాలు

ఫొటో సోర్స్, WARNER BROS

హీరోగా చూపించాలనే ఉద్దేశం లేదు

"మీ మాట్లాడే స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛకు మేం మద్దతిస్తున్నాం. కానీ ఆ సినిమాలు చూసే ఎవరైనా ఒక గొప్ప శక్తికి, గొప్ప బాధ్యత కూడా ఉంటుందని మీకు చెప్పగలరు. అందుకే తక్కువ తుపాకులతో సురక్షితమైన సమాజాన్ని నిర్మించుకుందాం, అనే మా పోరాటానికి మీ విశాల వేదికను ఉపయోగించాలని పిలుపునిస్తున్నాం" అని రాశారు.

ఈ లేఖలకు స్పందించిన వార్నర్ బ్రదర్స్ 2012లో కొలరాడోలో జరిగిన కాల్పులతో సహా ఎంతోమంది బాధితులకు తాము విరాళాలు అందించామని చెప్పింది.

"వాస్తవంగా జరిగే ఎలాంటి హింసాత్మక ఘటనలను మా కల్పిత పాత్ర జోకర్‌ గానీ, ఈ సినిమా గానీ సమర్థించవు. ఈ పాత్రను హీరోగా చూపించాలని సినిమాకు, దర్శకులకు, స్టూడియోకు ఎలాంటి ఉద్దేశం లేదు" అని చెప్పింది.

వార్నర్ బ్రదర్స్ కొత్త సినిమా 'ది జోకర్' ఈవారం భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. దీని గురించి గొప్పగా సమీక్షలు రాస్తున్నారు. ఇది ఆస్కార్‌కు కూడా నామినేట్ అవుతుందని చెబుతున్నారు.

కానీ మానసిక అనారోగ్యం, హింస చూపిస్తున్నందుకు దీనిని వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి. ఈ సినిమాలో జోకర్‌కు బ్యాట్‌మెన్‌తో శత్రుత్వం ఎందుకు వచ్చింది అనే కథను చూపించబోతున్నారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

టైటిల్ రోల్ చేస్తున్న ఫినిక్స్ టెలిగ్రాఫ్‌కు ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు, "కొంతమందిని ఇది ప్రేరేపిస్తుందని మీరు భయపడుతున్నారా" అని అడిగితే, అతడు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయాడు. తర్వాత తిరిగి వచ్చి "ఆ ప్రశ్న అర్థం కాకపోవడం వల్లే వెళ్లిపోయాను" అని చెప్పాడు.

డీసీ కామిక్ బుక్‌ విలన్ 'ది జోకర్' మూలాల గురించి చెప్పే ఈ కొత్త సినిమా గురించి విమర్శకులు రకరకాలుగా రాస్తున్నారు.

ది జోకర్‌లో హీరో వాకీన్ ఫీనిక్స్ నటన భయంకరంగా ఉందని కొందరు, అద్భుతంగా ఉందని మరికొందరు ప్రశంసిస్తున్నారు.

దీనిపై సమీక్ష రాసిన మరొకరు ఈ సినిమాను "దూకుడు, బాధ్యతారాహిత్యమైన మూర్ఖత్వం"గా వర్ణించారు.

ది జోకర్: విడుదలకు ముందే చుట్టుముట్టిన వివాదాలు

ఫొటో సోర్స్, WARNER BROS

కమెడియన్ కాబోయి క్రిమినల్‌గా

ది జోకర్ సినిమా డైరెక్టర్ టాడ్ ఫిలిప్స్ గురించి రాసిన టైమ్స్ మ్యాగజీన్.. "మన సంస్కృతిలోని శూన్యత గురించి మనకు ఒక సినిమా తీస్తున్నట్లు తను అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఆయన దానికి మంచి ఉదాహరణ మాత్రమే ఇస్తున్నాడు" అని రాసింది.

గత వారం విడుదలైన "ది జోకర్" ట్రైలర్ ఇప్పటికే దాదాపు 4 కోట్ల 'వ్యూ'లు సంపాదించింది.

ది జోకర్‌లో ఫినిక్స్ 'ఆర్థర్ ఫ్లెక్' అనే పాత్ర చేస్తున్నాడు. ఒక స్టాండప్ కమెడియన్ కావాలనుకున్న ఒక హాస్యగాడిని కొందరు తమవైపు తిప్పుకుని, హింసాత్మక నేరాలు చేసేలా ప్రేరేపించే కథతో ఇది సాగుతుంది.

44 ఏళ్ల వాకీన్ ఫినిక్స్ ఇంతకు ముందు గ్లాడియేటర్, వాక్ ది లైన్, ది మాస్టర్ సినిమాల్లోని పాత్రలకు ఆస్కార్‌కు నామినేట్ అయ్యాడు.

2008లో వచ్చిన 'ది డార్క్ నైట్' సినిమాలో జోకర్ పాత్ర చేసిన హీత్ లెడ్జర్ దాని విడుదలకు ముందే మరణించాడు. ఆ సినిమాలో తన అద్భుత నటనకు అకాడమీ అవార్డు గెలుచుకున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)