అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఆల్‌టైమ్ రికార్డ్.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే

ఫొటో సోర్స్, Marvel
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఇప్పటి వరకూ అవతార్ పేరిట ఉన్న రికార్డును అవెంజర్స్ ఎండ్‌గేమ్ బద్దలు కొట్టింది.
బాక్సాఫీస్ వసూళ్ల పరంగా ఆల్‌టైమ్ రికార్డు గత పదేళ్లుగా అవతార్ పేరిటే ఉంది. అయితే, ఆ రికార్డును జూలై 21వ తేదీ ఆదివారం అవెంజర్స్ ఎండ్‌గేమ్ తిరగరాసింది.
ఆదివారం నాటికి అవెంజర్స్ ఎండ్‌గేమ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.7902 బిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు 1,92,32,98,81,100 రూపాయలు) రాబట్టింది. అవతార్ సినిమా బాక్సాఫీస్ వసూళ్లు 2.7897 బిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు 1,92,29,54,15,850 రూపాయలు).
ఐరన్ మ్యాన్‌గా రాబర్ట్ డౌనీ జూనియర్, బ్లాక్ విడోగా స్కార్లెట్ జాన్సన్, థోర్‌గా క్రిస్ హెమ్స్‌వర్త్‌లు నటించిన ఎండ్‌గేమ్ సినిమా చైనాలో 629 మిలియన్ డాలర్లు, దక్షిణ కొరియాలో 105 మిలియన్ డాలర్లు, బ్రెజిల్‌లో 85 మిలియన్ డాలర్లు ఆర్జించింది.
అవెంజర్స్ ఎండ్‌గేమ్ సినిమా తొలి వారంలో ప్రపంచవ్యాప్తంగా టిక్కెట్ల కొనుగోళ్ల ద్వారా 1.2 బిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు 82,72,68,00,000 రూపాయలు) సాధించిన చిత్రంగా కూడా రికార్డులకెక్కింది.
2008లో ఐరన్ మ్యాన్ చిత్రం విడుదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మార్వెల్ అవెంజర్స్ సిరీస్‌లో భాగంగా 22 చిత్రాలు వచ్చాయి. వీటిలో కెప్టెన్ మార్వెల్, థోర్, బ్లాక్ విడో వంటి సూపర్ హీరోల పాత్రలు ఉన్నాయి. వీరంతా థానోస్ అనే విలన్ పాత్రపై పోరాడారు.
టైటానిక్ సినిమా 12 ఏళ్ల పాటు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ప్రథమస్థానంలో కొనసాగగా, తర్వాత ఆ స్థానంలో అవతార్ సినిమా పదేళ్లు కొనసాగింది.
ఈ రెండు సినిమాలకూ దర్శకత్వం వహించింది జేమ్స్ కామెరూన్.
అవెంజర్స్ ఎండ్‌గేమ్ సినిమాకు జో రుస్సో దర్శకత్వం వహించగా మార్వెల్ స్టూడియోస్ దీనిని నిర్మించింది.

ఏ సినిమా నుంచి మొదలుపెట్టాలి
ఎమ్‌సీయూ చిత్రాలను విడుదలైన క్రమంలో కాకుండా, కథల నేపథ్య సమయాల ప్రకారం చూస్తే మెరుగ్గా అర్థం చేసుకోవచ్చు.
'మార్వెల్ స్టూడియోస్: ద ఫస్ట్ టెన్ ఇయర్స్' అనే పుస్తకంలో ఎమ్‌సీయూ చిత్రాల నేపథ్య సమయాలను అధికారికంగా ఇచ్చారు.
ఏ కథ ఎప్పుడన్న సమాచారం ఇదిగో..
సాంకేతికంగా 'యాంట్-మ్యాన్ అండ్ ద వాస్ప్' చిత్రం కథ 'ఇన్ఫినిటీ వార్' కన్నా ముందు జరుగుతుంది. చివర్లో పేర్లు పడిన తర్వాత వచ్చే సన్నివేశాలు మాత్రం తర్వాత జరుగుతాయి.
పైన సూచించిన క్రమంలో చూస్తే.. వాటిని మెరుగ్గా ఆస్వాదించవచ్చు.
ఇవి కూడా చదవండి:
- అవెంజర్స్: ఎండ్‌గేమ్‌ను అర్థం చేసుకోవాలంటే ముందు వచ్చిన 21 సినిమాలూ చూడాల్సిందేనా?
- అవెంజర్స్ ఎండ్‌గేమ్: భారీ తారాగణం, స్పెషల్ ఎఫెక్ట్స్.. సూపర్ హీరో సినిమాల సక్సెస్‌కు కారణాలివేనా
- బీరు తాగితే చల్లదనం వస్తుందా?
- గ్రాహం స్టెయిన్స్: భారత్‌లో ఫేక్ న్యూస్, వదంతుల కారణంగా జరిగిన మొదటి మూకదాడి, హత్య ఇదేనేమో - Ground Report
- ‘టాలీవుడ్లో హీరోయిన్లకు వేధింపులు ఇలా ఉంటాయ్!‘
- బోరిస్ జాన్సన్: బ్రిటన్‌కు కొత్త ప్రధానమంత్రి
- టిక్‌టాక్ యాప్‌ను ప్రభుత్వం ఎందుకు నిషేధించాలనుకుంటోంది?
- కశ్మీర్ వివాదంపై ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని మోదీ కోరలేదు: భారత్
- ఇరాన్ సీజ్ చేసిన బ్రిటన్ నౌకలోని 18 మంది భారతీయుల పరిస్థితి ఏమిటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








