COP26: వాతావరణ లక్ష్యాలకు భారత్ ఎంత దూరంలో ఉంది

ఫొటో సోర్స్, Getty Images
స్కాట్లాండ్‌లో జరగబోతున్న వాతావరణ సదస్సుకు ముందు గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గింపుపై సమర్పించాల్సిన ప్రణాళికను భారత ప్రభుత్వం ఇంకా సమర్పించలేదు.
కార్బన్ డయాక్సైడ్‌ను ఎక్కువగా విడుదల చేసే దేశాలలో చైనా, అమెరికాల తర్వాత మూడో అతి పెద్ద దేశం భారతదేశమే.
వేగంగా పెరుగుతున్న జనాభా, బొగ్గు, చమురుపై ఎక్కువగా ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ కావడంతో ఈ ఉద్గారాలు తీవ్రస్థాయికి చేరాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఉద్గారాల తగ్గింపు పై ఇండియా ఇచ్చిన వాగ్దానాలేంటి?
కర్బన ఉద్గారాలను మొత్తంగా తగ్గించాలనడాన్ని భారత్ వ్యతిరేకించింది. పారిశ్రామికరణ చెందిన దేశాలు ఎక్కువ ఉద్గారాలకు బాధ్యులు కాబట్టి వారు ఈ బాధ్యతలో ఎక్కువ భాగం తీసుకోవాలని భారత్ వాదిస్తోంది.
2030 నాటికి దాని ఉద్గారాల తీవ్రతను 2005 స్థాయిలలో 33-35% కోతను లక్ష్యంగా పెట్టుకుంది. కర్బన ఉద్గారాలలో కోత అంటే పూర్తిగా ఉద్గారాలను తగ్గించడం కాదు.
ఇటీవలి సంవత్సరాలలో భారతదేశపు ఆర్ధికాభివృద్ధి శిలాజ ఇంధనాలపై ఆధారపడి నడిచింది. దేశంలోని గ్రీన్‌హౌస్-వాయు ఉద్గారాలలో ఎక్కువ భాగం దీని కారణంగానే ఏర్పడింది.
వాతావరణ మార్పులపై ఏర్పాటు చేసిన ఇంటర్-గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (ఐపీసీసీ) గ్లోబల్ నెట్ జీరోను లక్ష్యంగా పెట్టింది. 2050 నాటికి ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 సెంటీగ్రేడ్ లోపు ఉండేలా చూడటానికి ఈ లక్ష్యం అవసరం.
ఈ టార్గెట్‌ను చేరుకునేందుకు ప్రయత్నిస్తామని 130 కంటే ఎక్కువ దేశాలు వాగ్దానం చేశాయి. కానీ, వాటిలో భారత్ లేదు.
పవన, సౌర, చిన్న జల విద్యుత్ ప్లాంట్ల వంటి పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తి సామర్థ్యాన్ని 2022 నాటికి 175 గిగావాట్స్‌కి ఐదు రెట్లు పెంచుతామని 2015లో భారత దేశం మాటిచ్చింది. కానీ, సెప్టెంబర్ 2021 నాటికి, ఇది కేవలం 100 గిగావాట్లకు కాస్త ఎక్కువ మాత్రమే సాధించింది.
అలాగే 2030 నాటికి 40% విద్యుత్‌ను పునరుత్పాదక శక్తి నుండి అందజేస్తానని కూడా ఇండియా వాగ్దానం చేసింది. ఈ లక్ష్యాన్ని ఇప్పటికే సాధించింది.
కానీ, 2015లో నిర్దేశించిన పారిస్ ఒప్పందం లక్ష్యాల ప్రకారం భారత్ ఇప్పటి వరకు సాధించింది సరిపోదని వాతావారణంపై ఒక దేశ విధానాన్ని కొలిచే క్లైమేట్ యాక్షన్ ట్రాకర్ (సీఏటీ) పేర్కొంది.
పారిస్ ఒప్పందం ప్రకారం ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ లోపు అదుపు చేసే క్రమంలో భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థలకు ప్రపంచ దేశాల సహకారం అవసరమని సీఏటీకి చెందిన సిండి బాక్స్‌టర్ అన్నారు.
"డీకార్బనైజ్ చేసే విషయంలో భారతదేశం దగ్గర ఎలాంటి ప్రణాళిక లేదు'' అని కూడా బాక్స్‌టర్ అన్నారు. "ఎక్కడ, ఎంత మద్ధతు అవసరమో గుర్తించే షరతులతో కూడిన లక్ష్యం కూడా దీనికి లేదు" అని బాక్స్‌టర్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశంలో అడవులు విస్తరిస్తున్నాయా?
భూభాగంలో మూడో వంతును అటవీ విస్తీర్ణంలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత్ చాలాసార్లు చెప్పింది. కానీ దీనికి గడువు లాంటిదేమీ లేదు. పురోగతి కూడా అస్పష్టంగా ఉంది.
భారతదేశంలోని దక్షిణ ప్రాంతాలలో రీప్లాంటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ, ఈశాన్య ప్రాంతంలో అటవీ విస్తీర్ణం భారీ ఎత్తున తగ్గింది. కార్బన్ శోషణలో చెట్ల పెంపకం ప్రయోజనకారిగా ఉంటుంది.
వాతావరణం నుండి అదనంగా 2.5 నుంచి 3 బిలియన్ టన్నుల CO2 ని గ్రహించడానికి 2030 నాటికి తగినని చెట్లను నాటాలని భారతదేశం యోచిస్తోంది.
యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్, గూగుల్, యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) సంయుక్తంగా ఏర్పాటు చేసిన గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ అనే సంస్థ అంచనా ప్రకారం 2001 -2020 మధ్య ఇండియా 18% అడవులను, 5% చెట్లను కోల్పోయింది.
కానీ, భారత ప్రభుత్వ సొంత సర్వే డేటా మాత్రం 2001- 2019 మధ్య అటవీ విస్తీర్ణం 5.2% పెరిగినట్లు సూచిస్తోంది.
దీనికొక కారణం ఉంది. గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ నివేదిక 5 మీటర్లు అంటే 16 అడుగులకన్నా ఎత్తున్న వృక్ష సంపదను మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. అందుకు భిన్నంగా భారతదేశపు అధికారిక గణన నిర్దిష్ట విస్తీర్ణంలో భూమిపై చెట్ల సాంద్రతను పరిగణనలోకి తీసుకుంటుంది.
అదనపు పరిశోధన: డేవిడ్ బ్రౌన్
(వాతావరణ మార్పులను అదుపులోకి తీసుకురావడంలో నవంబర్‌లో గ్లాస్గోలో జరిగే కాప్26 సదస్సు కీలకమైనదిగా భావిస్తున్నారు. ఉద్గారాలను తగ్గించడంపై దాదాపు 200 దేశాల నుంచి ఈ సదస్సు ప్రణాళికలనుఆశిస్తోంది. ఈ నిర్ణయాలు రోజువారీ జీవితంలో పెద్ద మార్పులకు దారి తీయొచ్చు.)

ఇవి కూడా చదవండి:
- ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో సమాధానాలు దొరకని 5 కీలకమైన ప్రశ్నలు
- రాజ కుటుంబాన్ని కోట్ల సంపదను వదులుకుని 'సామాన్యుడిని' ప్రేమించి పెళ్లాడిన జపాన్ రాజకుమారి
- సెక్స్ ట్రేడ్ కోసం యూరప్‌కు మహిళల అక్రమ రవాణా... తప్పించుకున్న ఓ బాధితురాలి కథ
- ‘ఎన్ని పంటలు వేసినా రాని డబ్బులు గంజాయి సాగుతో వస్తున్నాయి.. మరో దారి లేకే గంజాయి పండిస్తున్నాం..’
- 'మృతదేహాల అవశేషాలపై ఇళ్లు కట్టుకుని నివసించడం మాకు అలవాటైపోయింది'
- సెక్సువల్ అటానమీ: భార్య శరీరంపై భర్తకు సర్వ హక్కులు ఉంటాయా? సెక్స్ భంగిమల కోసం బలవంతం చేయవచ్చా?
- ఉత్తర కొరియాలో డ్రగ్స్, తీవ్రవాదం, ఆయుధ విక్రయాల గుట్టు విప్పిన ఒక సీక్రెట్ ఏజెంట్
- కోవిడ్-19: మా అమ్మను డాక్టర్లు గినియా పిగ్లా భావించి ప్రయోగాలు చేశారు
- నీళ్లపైనే నగరాలు.. భవిష్యత్తు ఇదేనా? యూరప్ దేశాల్లో ఈ ప్రయోగాలు ఎందుకు జరుగుతున్నాయి?
- కశ్మీర్లో భయాందోళనల్లో హిందువులు.. శాంతి, భద్రతలపై ప్రభుత్వానివి ఉత్తి మాటలేనా?
- లిపులేఖ్ రోడ్డు విషయంలో భారత్ తీరుపై నేపాల్‌లో ఆగ్రహం ఎందుకు
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్‌పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








