అంతరించి పోయిందనుకున్న ఈ ‘పర్వత రత్నం’ మళ్లీ కనిపించింది, ఎక్కడంటే..

ఫొటో సోర్స్, BBC/Gwyndaf Hughes
- రచయిత, జార్జినా రానార్డ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇదో అద్భుతమైన మొక్క. అందుకే దీనిని ‘పర్వత రత్నం’ అంటారు. ఈ మొక్క జాతి పూర్తిగా అంతరించిపోయిందని అంతా భావించారు. కానీ, ఇప్పుడు బ్రిటన్‌లో మళ్లీ ప్రత్యక్షమైంది. అయితే ఇది కచ్చితంగా ఏ ప్రాంతంలో ఉందో మేము బహిర్గతం చేయడం లేదు. ఎందుకంటే ఈ మొక్క భద్రత దృష్ట్యా ఆ వివరాలను రహస్యంగా ఉంచుతున్నాం.
ప్రముఖ హార్టీకల్చరిస్ట్ రాబీ బ్లాక్ హాల్ ఈ మొక్కను అది పుట్టిన ప్రదేశానికి తీసుకొచ్చినప్పుడు మేము అక్కడే ఉన్నాం.
అంతరించిపోతున్న మొక్కల గురించి తెలుసుకునేందుకు రాబీని నేను మొదట నార్త్ వేల్స్‌లోని నిశబ్ధంగా ఉండే ప్రాంతంలో కలిశాను.
ఆయన అక్కడ చాలా విలువైన వాటిని ఉంచారు. ఈ అరుదైన, ప్రత్యేకమైన మొక్కలకు మార్కెట్‌లో భారీ విలువ ఉంది. ఒక్కోసారి వీటిని అక్రమంగా తీసుకెళ్లి వేల పౌండ్లకు అమ్ముకుంటుంటారు.
అందుకే ఈ మొక్క గురించి ఎంత వరకు బహిర్గతం చేస్తారనే దానిపై జాగ్రత్తగా ఉండాలని ఆయన నాతో చెప్పారు.
“ప్రస్తుతం ప్రపంచంలో ఇలాంటి మొక్కలు 30 మాత్రమే ఉన్నాయి” అని కుండవైపు చూపిస్తూ ఆయన నాతో చెప్పారు.

ఫొటో సోర్స్, BBC/Gwyndaf Hughes
మా చుట్టూ మొలకలు ఉన్న ట్రేలు, నేల మీద మట్టి నింపిన సంచులు, మొక్కలు, పూలు ఉన్నాయి. మొక్కలకు అధిక వేడి, అధిక చలి, పొడి వాతావరణం తగలకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు పైకప్పుకు థర్మా మీటర్లను వేలాడదీశారు.
రాబీ పొడవుగా, అథ్లెట్‌లా ఉంటారు. ఆయన ఉత్సాహంతో మాట్లాడారు. నేను ఈ కథనంపై పరిశోధన ప్రారంభించినప్పుడు బొటానికల్ సొసైటీల రికార్డుల్లో రాబీ పేరు వినిపించింది. బ్రిటన్‌లో మొక్కల గురించి ఎక్కువగా తెలిసినవాళ్లు చాలా కొద్ది మంది ఉన్నారు.

ఫొటో సోర్స్, BBC/Gwyndaf Hughes
మొక్కలను కాపాడాలని అనుకున్న తర్వాత ఆయన బోటనీ చదివారు. కొంతకాలం మోడలింగ్ కూడా చేశారు. ప్రస్తుతం ఆయన ప్లాంట్‌లైఫ్ అనే స్వచ్చంధ సంస్థలో పని చేస్తున్నారు.
“మీరు బ్రిటిష్ జీవ వైవిధ్యం గురించి చూస్తే అదొక గజిబిజి పజిల్ మాదిరిగా కనిపిస్తుంది. అన్ని మొక్కలు ముఖ్యమే అనిపిస్తాయి, కానీ కొన్ని మాత్రం కనిపించవు” అని ఆయన చెప్పారు.
నేషనల్ ట్రస్ట్ అండ్ నేషనర్ రిసోర్స్ వేల్స్‌తో కలిసి పని చేస్తూ అంతరించిపోయిన మొక్కల్ని తిరిగి సంపాదించడం, అంతరించిన మొక్కల్లో ‘పర్వత ఆభరణం’ అని పిలిచే రోసీ శాక్సిఫ్రేజ్ అని పిలిచే మొక్కను ఇరియిరి లేదా స్నోడేనియాకు తిరిగి తీసుకు రావడం ఆయన లక్ష్యం.

ఫొటో సోర్స్, BBC/Gwyndaf Hughes
రోసీ శాక్సిఫ్రేజ్ మొక్కను బ్రిటన్‌లోని ఇరియిరి అటవీ సంరక్షణ కేంద్రంలో చివరిసారిగా 1962లో చూశారు.
నేను ఆ స్థలాన్ని చూడాలని అనుకున్నాను. దీంతో రాబీ, నేషనల్ ట్రస్ట్ రేంజర్ రైస్ వెల్డన్ రాబర్ట్స్ నన్ను, నా సహచరుడిని అక్కడికి తీసుకెళ్లారు.
మేము సరస్సు పక్కనే సన్నగా మెలికలు తిరిగి ఉన్న ఓ దారిలో వెళ్లాము. ఆ ప్రాంతాన్ని డెవిల్స్ కిచెన్ అని పిలుస్తారు.
ఇక్కడ అత్యంత అరుదైన, అద్భుతమైన మొక్కలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, BBC/Gwyndaf Hughes
రోసీ శాక్సిఫేజ్ అంతరించిపోతున్న మొక్కల జాబితాలో ఉంది. అయితే రాబీ మాత్రం నిపుణులైన పర్వతారోహకుడిలా వెళుతున్నారు. అయినప్పటికీ ఒకటికి రెండుసార్లు చూసుకుంటున్నారు.
“నేను గతంలో తాళ్లతో పైకి ఎక్కాను. ఆరు వేసవి కాలాల్లో ఆ మొక్క కోసం వెతికాను” అని ఆయన పర్వత శిఖరాలను చూపిస్తూ చెప్పారు.
‘రోసీ శాక్సిఫ్రేజ్ ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన మొక్క, అది బ్రిటన్‌లోనే దొరుకుతుంది’ అని రాబీ చెప్పారు. నాటకీయంగా ఉన్న ల్యాండ్‌స్కేప్ మీద ప్రశాంతంగా ఉన్న ఓ రాయిపై ఆయన కూర్చున్నారు.
మంచు యుగంలో ఉత్తర బ్రిటన్ ఘనీభవించినప్పుడు వృద్ధి చెందిన పర్వత మొక్కల కుటుంబంలో ఇదొక భాగం. హిమానీ నదాలు కరిగిపోయిన తర్వాత సాక్సిఫ్రేజ్‌లు పర్వత వాతావరణంలో పెరుగుతున్నాయి.
అయితే వాటి సున్నితమైన రూపం, అందమైన పూలు వల్ల వాటిని మొక్కలను సేకరించేవారికి లక్ష్యంగా మారుతున్నాయి. ప్రత్యేకంగా విక్టోరియా ప్రాంతం వాళ్లు ఇంట్లో పెట్టుకునేందుకు వాటిని తవ్వి తీసుకెళుతున్నారు.
అప్పట్లో విక్టోరియాలో ప్రజల సంఖ్య తగ్గిపోవడం, సరిగ్గా పెంచకపోవడం వల్ల ఎరిరిలో ఆ మొక్క కనిపించకుండా పోయింది.
బ్రిటన్‌లో అవి కనిపించకుండా పోయే ముందు, వాటి సంఖ్య నాటకీయంగా పడిపోయింది.
దాని కథలో తర్వాతి భాగం జానపదాల మాదిరిగానే ఉంది. 1962లో ఓ టీచర్, వన్య సంరక్షమకుడు డిక్ రాబర్ట్స్ స్కూల్ పర్యటన మీద డెవిల్స్ కిచెన్ ప్రాంతానికి వచ్చారు.
ఆయన దారిలో కొట్టుకుపోయినట్లు కనిపిస్తున్న ఓ మొక్కను తీసుకుని జేబులో పెట్టుకున్నారు. అదేమిటో ఆయనకు తెలియకున్నా, ఇంటికి తీసుకెళ్లి గార్డెన్‌లో పెంచారు.
ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్న రోసీ శాక్సిఫ్రేజ్ మొక్కలన్నీ దాని నుంచే పుట్టాయి. ఆ టీచర్ నాటిన మొక్కే భవిష్యత్ తరాలకు ఈ మొక్కను మిగిల్చింది. దశాబ్ధ కాలం నుంచి రాబీ దాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు.
“డిక్ రాబర్ట్స్ వారసత్వంలో భాగమైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది” అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, BBC/Gwyndaf Hughes
ఆ మొక్క పూలు చిన్న చేతులతో ఆకాశాన్ని పైకి లేపుతున్నట్లు ఉన్నాయని రాబీ వర్ణించారు.
స్థానిక జాతుల జన్యు సంతతికి చెందిన మొక్కల్ని తిరిగి తీసుకురావడం అసాధారణమైన వ్యవహారం.
చాలా సందర్భాల్లో ఆ జాతికి చెందిన వాటిని తీసుకువస్తుంటారు. ఉదాహరణకు బ్రిటన్‌కు బీవర్లను తీసుకువచ్చేందుకు యూరోపియన్ బీవర్‌ను తీసుకువచ్చారు.
అయితే, రాబీ ఈ మొక్కను చేతుల్లో పట్టుకుని “ఇది ఒరిజినల్ వెల్ష్ మెటీరియల్ తరాల నుంచి వచ్చింది” అని చెప్పారు.
బాంగర్ యూనివర్సిటీలో అటవీ సంరక్షణ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న జులియా జోన్స్‌ను నేను ఈ పర్వత ప్రాంతానికి ఆహ్వానించాను. ఒక చిన్న మొక్క ఈ ప్రాంతంలో ఏదైనా పెద్ద మార్పు తెచ్చిందా? అని ఆమెను అడిగాను.
వాస్తవం ఏంటంటే ఆ ఒక్కటే మొత్తం బ్రిటన్ ప్రకృతిని మార్చలేదు. ప్రకృతి సంరక్షణ చాలా క్లిష్టమైనది. దాని కోసం వాతావరణ మార్పుల నుంచి మొక్కల ఆవాసాలను సంరక్షించడంతో పాటు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు చాలా శ్రమించాలి.
మొక్కను మళ్లీ ఇక్కడకు తీసుకురావడం ముఖ్యమైన కార్యక్రమం అని చెబుతూనే ఇది మనం ఎంత నష్టపోయామో గుర్తు చేస్తుందని అన్నారు.
హై ప్రొఫైల్ మొక్కలను తిరిగి తీసుకురావడం చాలా అరుదు. ఇందులో ఎక్కువగా జంతువుల మీద దృష్టి పెడతారు. బ్రిటన్‌లో అలా తీసుకువచ్చిన వాటిలో బీవర్, తెల్ల తోక ఉన్న సముద్ర గద్ద లాంటివి. ప్రజలు ఎక్కువగా మొక్కల కంటే జంతువుల మీదనే ఆసక్తి చూపిస్తుంటారు.
కొంత మంది శాస్త్రవేత్తలు మొక్కలను గుర్తించని అంధకారం గురించి మాట్లాడుతున్నారు. అనేక మంది ప్రజలు తమ చుట్టు ఉన్న మొక్కలను మిగతా జీవుల మాదిరిగా గుర్తించరు. అవి మన ప్రకృతిలో గోడ మీద అతికించిన పేపర్ల లాంటివే. ప్రజలు గుర్తించకున్నా మొక్కలు మన పర్యావరణాన్ని కాపాడుతూనే ఔషధాల తయారీలో కీలకంగా ఉన్నాయి.

ఫొటో సోర్స్, BBC/Gwyndaf Hughes
చివరకు పదేళ్లుగా ఎదురు చూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది.
ఎరిరిలోని ఓ రహస్య ప్రాంతంలో వర్షం కురుస్తున్నప్పటికీ కొంతమంది వ్యక్తులు అక్కడకు వచ్చారు. వారిలో రేంజర్ రైస్ వెల్డన్ రాబర్ట్స్ కూడా ఉన్నారు. ఆయన ఆ మొక్కపై ఓ కన్నేసి ఉంచుతారు.
“అనుకున్న రోజు వచ్చింది, ఇక ఇప్పుడిది అరుదైన అంశం ఏమీ కాదు, ఈ ప్రాంతాన్ని సందర్శించే వారంతా దీన్ని ప్రస్తుతించాలి” అని ఆయన అన్నారు.
శాక్సి ఫ్రేజ్‌ను ఎవరు పర్యవేక్షిస్తారు? రాబీ బ్లాక్ హాల్ మైల్స్‌కు సంబంధించి ఇదే పెద్ద అంశం. 60 ఏళ్ల తర్వాత ఈ మొక్క ప్రకృతిలో బతుకుతుందా?
ఆయన కారులో నుంచి మొక్కలున్న డబ్బా తీసుకొచ్చారు.
నేను చివరిసారిగా చూసినప్పటితో పోలిస్తే ఈ మొక్క ఇప్పుడు కొంత రూపాంతరం చెందింది. దట్టమైన ఆకులు, పొడవాటి కాడలు విస్తరించింది. ఐదు రేకులతో తెల్లటి పువ్వు ఉంది.
“ఈ పూలంటే చాలా నాకు చాలా ఇష్టం. అవి నీవైపు చూసి వెలిగిపోతున్నాయి” అని రాబీ చెప్పారు.
నదిలో అడుగు పెట్టిన రత్వార రాబీ కిందకు వంగి కొంత గడ్డి, మట్టిని తీసుకున్నారు. తర్వాత రాయికేసి కొట్టారు. “ఏం ఫర్వాలేదు, లాటిన్ భాషలో శాక్సిఫ్రేజ్ అంటే రాళ్లను పగలగొట్టేదని అర్థం” అని అన్నారు
కొన్ని నిమిషాల తర్వాత, ఆ చినన ‘పర్వత ఆభరణం’ తను పుట్టిన మట్టిలో ఒదిగింది.
రాబీ భావోద్వేగానికి లోనయ్యారు. ఇది ఆయన కెరీర్‌లోనే అత్యుత్తమైనది. తన సొంత దేశంలో తనకు బాగా ఇష్టమైన భూభాగంలో ఆ అరుదైన మొక్కను మళ్లీ నాటారు.
“వెల్ష్‌లో అడ్‌ఫెరియడ్ అనే అద్భుతమైన పదం ఉంది, ఆ పదానికి అర్థం పునరుద్ధరించడం అని. నేనిప్పుడు చంద్రుడి మీద ఉన్నాను” అంటూ ఆయనింకా చెబుతూనే ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- అర ఎకరంలో 60 బోర్లు, సాగునీటి కష్టాలకు ఐకమత్యంతో చెక్ పెట్టిన అనంతపురం రైతులు
- తెల్ల గుడ్లు, ఎర్ర గుడ్లు: వేటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి?
- పురుగులు పట్టిన బియ్యం తింటే ఏమవుతుంది? పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- ఆంధ్రప్రదేశ్: పింఛన్లు ఇంకా అందకపోవడానికి అసలు కారణమేంటి? ఈసీ ఏం చెప్పింది?
- కుప్పం నియోజకవర్గానికి నీళ్లొచ్చాయా? రాలేదా? బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














