తిరుమల లడ్డూ వివాదం: ‘‘ఆయనకు ఒక మాట చెబుతున్నా..’’ అంటూ పవన్ కల్యాణ్ ఏమన్నారు? ప్రకాష్ రాజ్ కౌంటర్ ఏమిచ్చారు?

ఫొటో సోర్స్, Twitter/Deputy CMO, Andhra Pradesh
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
తిరుమల లడ్డూ వివాదంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సినీ నటుడు ప్రకాష్ రాజ్‌ల మధ్య మరోమారు మాటల యుద్ధం జరిగింది.
ఇతర మతాల ఆచారాలకు, సంప్రదాయాలకు విఘాతం కలిగితే ఎలా స్పందిస్తున్నారో హిందువుల మనోభావాలకు, ఆచారాలకు, సంప్రదాయాలకు, ధర్మాలకు విఘాతం కలిగినా అదే రీతిలో స్పందించాలని పవన్ కల్యాణ్ అన్నారు.
ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్ మంగళవారం విజయవాడ కనకదుర్గ ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ మెట్లను కడిగారు.
అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘సెక్యులరిజం అంటే వన్ వే కాదు, టూ వే’’ అని పవన్ అన్నారు. సున్నిత అంశాలపై ప్రకాష్ రాజ్ జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పారు.

ఫొటో సోర్స్, Twitter/Deputy CMO, Andhra Pradesh
‘‘ప్రసాదం అపవిత్రం గురించి నేను మాట్లాడుతున్నా. ఇందులో ప్రకాష్ రాజ్‌కు సంబంధం ఏంటి? నేను ఇంకో మతాన్నేమైనా నిందించానా? ప్రసాదం అపవిత్రం జరిగింది, కల్తీ చేశారు, ఇలా జరగకూడదని నేను చెబుతుంటే, గోల చేయకూడదని అంటే అర్థం ఏంటి? తప్పు జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా? ప్రకాష్ రాజ్ గారికి చెబుతున్నా సెక్యులరిజం అనేది వన్ వే కాదు టూ వే. హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా మాట్లాడటం తప్పా?’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘ఈ దేశంలో సెక్యులరిజం అనేది వన్ వే కాదు. రెండు వైపుల నుంచి ఉండాలి. ఈ దేశంలో అన్ని మతాలకు సమాన హక్కులున్నాయి. నేను అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాను. తిరుమల ఘటన లాంటి ఘటన ఏ మసీదులోనో, చర్చిలోనో జరిగితే ఇలానే మాట్లాడతారా?
ఇస్లాం మీద గొంతెత్తితే రోడ్ల మీదకు వచ్చి కొడతారని భయం. వారి ఓట్లు పోతాయని భయం. ప్రకాష్ రాజ్ నాకు మంచి మిత్రుడు. ఆయన పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. అయితే సనాతన ధర్మానికి, పవిత్రతకు భంగం కలిగినప్పుడు మాట్లాడటం కూడా తప్పే అని చెబితే ఎలా?
ఇదే తప్పు ఓ మసీదుకు లేదా చర్చికి జరిగితే ఇలాగే మాట్లాడతారా? దేశంలో హిందువులకు ఏం జరిగినా సరే మాట్లాడే హక్కు ఉండకూడదా? హిందూ దేవతలపై ఇష్టానుసారం వ్యంగ్యంగా మాట్లాడుతూ, వారిపై రకరకాల జోకులు వేస్తుంటే మేం చూస్తూ ఊరుకోవాలి. మా మనోభావాలు దెబ్బ తిన్నా నోరు మూసుకొని ఉండాలనడం ధర్మమేనా.?
ఇదేనా మీరు చెబుతున్న లౌకికవాద ధర్మం. ప్రకాష్ రాజ్ గారే కాదు ఆయనతోపాటు అందరికీ చెబుతున్నా, విమర్శలకు ముందు ఏం జరిగిందో తెలుసుకోండి. ఒకటికి వందసార్లు ఆలోచించి మాట్లాడండి. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు’’ అని పవన్ కల్యాణ్ అన్నట్లుగా జనసేన ట్వీట్ చేసింది.

ఫొటో సోర్స్, screengrab
‘‘ప్రతి ప్రశ్నకూ సమాధానమిస్తా’’: ప్రకాష్ రాజ్
విలేఖరుల సమావేశంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ స్పందించారు.
ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు.
‘‘పవన్ కల్యాణ్ గారూ నేను చెప్పింది ఏంటి? మీరు అపార్థం చేసుకొని తిప్పుతున్నది ఏంటి? ప్రస్తుతం నేను విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నా. 30వ తేదీ తర్వాత వచ్చి మీరు అడిగే ప్రతి ప్రశ్నకూ సమాధానం చెబుతాను. ఈ లోగా మీకు వీలైతే నా ట్వీట్‌ను మీరు మళ్లీ చదవండి. అర్థం చేసుకోండి’’ అని ఆ వీడియోలో ప్రకాష్ రాజ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images/Janasena party
అంతకుముందు ఏం జరిగింది?
తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న వివాదం రాజకీయ దుమారానికి కారణం కావడంతో పాటు ఇటు సామాజిక మాధ్యమాలలో చర్చోపచర్చలకు దారితీసింది.
‘ఎక్స్’ వేదికగా ట్వీట్లకు ప్రతి ట్వీట్లు చేస్తూ వివాదాన్ని వేడెక్కిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లడ్డూ తయారీలో ‘కల్తీ నెయ్యి వినియోగం’పై ఐజీ, ఆపై స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేశారు.
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగ వివాదంపై సెప్టెంబరు 19న హిందూ ఐటీ సెల్ తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేసింది.
తిరుపతి లడ్డూ కల్తీకి కారకులను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కోరింది.
‘‘తిరుపతి బాలాజీ ప్రసాదాన్ని కల్తీ చేయడమనేది ఆలయ కమిటీ చేసిన మోసం, అతిపెద్ద పాపం. ఈ విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకుని, దోషులను అరెస్ట్ చేయాలి.’’ అని పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
పవన్ ఏమన్నారు?
హిందూ ఐటీసెల్ ట్వీట్‌కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా సమాధానం ఇచ్చారు.
‘‘తిరుపతి బాలాజీ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలసిందనే విషయంతో మేమంతా చాలా ఆందోళనకు గురయ్యాం. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది. ఈ విషయంలో మా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉంది’’ అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చిందని, దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందంటూ సెప్టెంబరు 20న పవన్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

పోస్ట్ of X ముగిసింది, 3
ప్రకాష్‌రాజ్: #జస్ట్ఆస్కింగ్
అయితే, తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంలో పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ సినీనటుడు ప్రకాష్‌రాజ్ ఓ ట్వీట్ చేశారు.
‘‘ప్రియమైన పవన్ కల్యాణ్, మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలోనే ఈ ఘటన జరిగింది. నిందితులను కనిపెట్టి కఠిన చర్యలు తీసుకోండి. అంతేకానీ, లేనిపోని భయాలను వ్యాప్తి చేస్తూ జాతీయ స్థాయి సమస్యగా ఎందుకు మారుస్తున్నారు. ఇప్పటికే దేశంలో సరిపడినన్ని మతపర ఆందోళనలు ఉన్నాయి (కేంద్రంలోని మీ మిత్రులకు ధన్యవాదాలు)’’ అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.
దేశంలో మతపరమైన ఆందోళనలు ఉన్నాయన్న చోటనే కేంద్రంలోని మీ మిత్రులకు అంటే.. బీజేపీకి ధన్యావాదాలు అంటూ పరోక్షంగా ప్రస్తావించారు.
దీనికి జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
మంచు విష్ణు ట్వీట్‌లో ఏముంది?
అయితే, పవన్‌ను ఉద్దేశిస్తూ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్‌పై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు స్పందించారు.
‘‘తిరుమల లడ్డూ నా లాంటి లక్షల మందికి ప్రసాదం మాత్రమే కాదు, నమ్మకం కూడా. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సరైన రీతిలో సమగ్ర విచారణకు ఆదేశించడంతోపాటు సనాతన సంప్రదాయాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు’’ అని ట్వీట్ చేశారు.
దీనికి స్టే ఇన్ యువర్ లేన్(మీ పరిధిలో ఉండండి) అనే హ్యాష్ టాగ్ జోడించారు విష్ణు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
మంచు విష్ణు ట్వీట్‌పై ప్రకాష్ రాజ్ స్పందించారు. ఆయన ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ.. ‘‘ఓకే శివయ్యా.. నా దృక్పథం నాది.. నీ దృక్పథం నీది..’’ అని రాశారు.
అయితే.. ప్రకాశ్ రాజ్ మంచు విష్ణును శివయ్యా అనడానికి కారణం.. విష్ణు కన్నప్ప సినిమాలో నటిస్తుండడమేనని నెటిజన్లు అంటున్నారు.
ఆ సినిమాలో విష్ణు ‘శివయ్యా’ అని పెద్దగా పిలిచే సన్నివేశం ఒకటి ఉంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
నెటిజన్లు ఏమన్నారు?
‘ప్రసాదంలో గొడ్డు, పంది మాంసం కొవ్వు కలపడం మతపరమైన ఆందోళనలు వ్యాప్తి చేయడం కాదన్నమాట..? దాన్ని బయట ప్రపంచానికి చెప్పడం మతపరమైన సమస్యా..? అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
ప్రకాష్ రాజ్ ట్వీట్ పై గుజరాత్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం చైర్మన్ హితేంద్ర పితాడియా స్పందించారు.
అయోధ్య రామ మందిరాన్ని ఎక్కువగా చూపేందుకు తిరుపతి ఆలయ పేరును చెడగొట్టే కుట్ర ఏమైనా జరిగిందా..? అంటూ ట్వీట్ చేశారు.
గుజరాత్ కు చెందిన నరేంద్ర మోదీ, అమిత్ షాకు రాజకీయ కుట్రలు చేసే చరిత్ర ఉందంటూ ఆరోపణలు చేశారు. దీనిపై బీజేపీ మద్దతుదారులు మండిపడుతున్నారు.

ఫొటో సోర్స్, janasena party
పవన్ ప్రాయశ్చిత్త దీక్ష
మరోవైపు తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో సెప్టెంబరు 22 నుంచి 11 రోజుల పాటు పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు.
గుంటూరు జిల్లాలోని నంబూరు శ్రీ దశావతార వెంకటేశ్వరస్వామి ఆలయంలో పవన్ కల్యాణ్ దీక్షను ప్రారంభించారు
ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై పరోక్షంగా పవన్ కల్యాణ్ స్పందించారు.
‘‘దేశంలో కోట్లాది మంది హిందువుల ప్రసాదం అపవిత్రమైతే, ఒక్కరు కూడా మాట్లాడకూడదా. అలా మాట్లాడటం సెక్యులర్ వ్యవస్థకు విఘాతమంటే ఎలా? హిందువులకు మనోభావాలు ఉండవా..? నేను ఏ ఒక్కరినీ నిందించడం లేదు. అసలు మీరు ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు, ఇది తప్పు అని అంటే ఎలా? ’’అని పవన్ ప్రశ్నించారు.
ప్రకాష్ రాజ్, పవన్ కల్యాణ్ కలిసి చాలా సినిమాల్లో నటించారు.
సుస్వాగతం, బద్రి, జల్సా, కెమెరామెన్ గంగతో రాంబాబు, వకీల్ సాబ్ వంటి సినిమాల్లో నటించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)