యుక్రెయిన్ యుద్ధానికి 500 రోజులు: రష్యా ఆక్రమించిన ప్రతి అంగుళం తిరిగి స్వాధీనం చేసుకుంటాం- జెలెన్‌స్కీ

ఫొటో సోర్స్, Telegram
యుక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధం ప్రారంభమై 500 రోజులు పూర్తయింది. రష్యాపై తమ దేశం విజయవంతంగా ప్రతీకారం తీర్చుకోగలదని యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమీర్ జెలెన్‌స్కీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
తమ భూభాగం మొత్తాన్ని తమ దేశం వెనక్కి తీసుకుంటుందని జెలెన్‌స్కీ అన్నారు. అలాగే, ఇటీవల తుర్కియే పర్యటన వివరాలను కూడా ఆయన తెలియజేశారు.
తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోవాన్‌ను శనివారం ఇస్తాంబుల్‌లో జెలెన్‌స్కీ కలిశారు.
రష్యా సమగ్రతకు మద్దతు ఇస్తున్న రెసెప్ తయ్యిప్ ఎర్దోవాన్ యుక్రెయిన్‌కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటనను జారీ చేశారు.
నాటోలో యుక్రెయిన్ సభ్యత్వం పొందగలదని ఎర్దోవాన్ అన్నారు.
ఈ క్లిష్ట సమయంలో తమకు మద్దతు ఇచ్చినందుకు తుర్కియేకు జెలెన్‌స్కీ ధన్యవాదాలు తెలిపారు.
యుద్ధం మొదలై 500 రోజులైన సందర్భంగా జెలెన్‌స్కీ స్నేక్ ఐల్యాండ్ నుంచి ఒక వీడియోను పోస్ట్ చేశారు.
ఈ దీవికొక ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. రష్యాకు వ్యతిరేకంగా యుక్రెయిన్ సైన్యం తట్టుకుని నిల్చిన సమర్థతకు గుర్తింపుగా ఇది నిలుస్తోంది.
రష్యా-యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత, స్నేక్ ఐల్యాండ్‌కు కాపలాగా ఉన్న యుక్రెయిన్ ఆర్మీని లొంగిపోవాలని రష్యా సైనికుల ఆదేశించారు. ఈ ఆదేశాలను యుక్రెయిన్ ఆర్మీ పట్టించుకోకుండా, వారిపై పోరాడింది. రష్యా సైనికులు దీనిని స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ, యుక్రెయిన్ ఆర్మీ తిరిగి దక్కించుకుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
తుర్కియే వెళ్లిన జెలెన్‌స్కీ
తుర్కియేకి వెళ్లిన జెలెన్‌స్కీ పలు పారిశ్రామిక, టెక్నాలజీ సంబంధ ఒప్పందాలను కుదుర్చుకున్నారు.
యుక్రెయిన్‌ను నాటోలో చేర్చుకోవాలని, మరిన్ని ఆయుధాలను అందించాలని మిత్ర దేశాలను కోరేందుకు జెలెన్‌స్కీ పలు దేశాలలో పర్యటిస్తున్నారు.
తాము ప్రపంచ శాంతి శిఖరాగ్ర సదస్సు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామని, ఈ కాన్ఫరెన్స్‌లో తుర్కియే కూడా పాల్గొనాల్సిన అవసరం ఉందని జెలెన్‌స్కీ చెప్పారు.
రష్యా నియంత్రణ నుంచి తమ కమాండర్లను విడుదల చేయించేందుకు తుర్కియే ప్రమేయాన్ని ఆయన కొనియాడారు.
ఇదే సమయంలో, ఎర్దోవాన్ యుక్రెయిన్ పునర్ నిర్మాణానికి సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
వీడియోలో జెలెన్‌స్కీ ఏం చెప్పారు?
యుద్ధానికి 500 రోజులు పూర్తయిన సందర్భంగా జెలెన్‌స్కీ ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో యుక్రెయిన్ ‘విజయ ప్రదేశం’గా ఆ ద్వీపాన్ని చెప్పారు.
దీన్ని మరోసారి ఎప్పటికీ స్వాధీనం చేసుకోలేని ప్రాంతంగా చెప్పారు.
ఈ వీడియోను టెలిగ్రామ్‌లో ఎప్పుడు పోస్ట్ చేశారో తెలియదు.
యుద్ధం తర్వాత రష్యా స్వాధీనం చేసుకున్న తమ ప్రతి అంగుళం భూమిని వెనక్కి తెచ్చుకుంటామని జెలెన్‌స్కీ ఈ వీడియోలో చెప్పారు.
దీని తర్వాత, తుర్కియే వెళ్లిన విషయాన్ని తెలిపారు.
అక్కడి నుంచి ఐదుగురు కమాండర్లను వెనక్కి తీసుకొచ్చినట్లు చెప్పారు.
గత సంవత్సరం మరియుపోల్‌లోని స్టీల్ ప్లాంట్‌పై దాడి చేసిన సందర్భంగా రష్యా సైనికులు ఈ కమాండర్లను అరెస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, EPA
కానీ, ఆ తర్వాత యుద్ధ ఖైదీలను మార్చుకునే ప్రక్రియ కింద ఈ ఐదుగురు కమాండర్లను విడుదల చేశారు. అప్పటి నుంచి వీరు తుర్కియేలోనే నివసిస్తున్నారు.
అయితే, ఈ కమాండర్లను ఏ నిబంధనల కింద యుక్రెయిన్ తీసుకొచ్చారో తెలియదు. విడుదలకు సంబంధించిన ఒప్పంద నిబంధనల కింద, వీరు తుర్కియేలోనే ఉండాల్సి వచ్చింది.
ఈ కమాండర్లను వెనక్కి తీసుకురావడంపై స్పందించిన రష్యా, దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపింది.
ఈ కమాండర్ల విడుదలకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని రష్యా న్యూస్ ఏజెన్సీ ఆర్ఐఏకి ఆ దేశ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ అన్నారు.
ఒప్పందం ప్రకారం, యుద్ధం ముగిసే వరకు ఈ కమాండర్లు తుర్కియేలోనే ఉండాలని చెప్పారు.
లిథువేనియా రాజధాని విల్నియస్‌లో జులై 11, 12 తేదీల్లో నాటో సదస్సు జరుగనుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
500 మంది చిన్నారులు సహా 9 వేల మంది మృతి
రష్యా-యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన గంటల వ్యవధిలోనే, నల్ల సముద్రంపై ఉన్న రష్యా సైన్యం యుక్రెయిన్ దళాలను లొంగిపోవాలని ఆదేశించింది.
ఆ సమయంలో రష్యా ఆర్మీకి చెందిన అధికారి ఒకరు రక్తపాతం కాకుండా ఉండాలంటే ఆయుధాలను వెంటనే కిందకు పడేసి లొంగిపోవాలని చెప్పారు. లేదంటే బాంబు దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
కానీ, యుక్రెయిన్ సైనికులు ఆయన ఆదేశాలను వినలేదు. ‘గో టూ హెల్’ అన్నారు.
రష్యా సైనికుల కంటే పెద్ద స్వరంతో యుక్రెయిన్ సైనికులు కూడా తమ సమాధానమిచ్చారు. ఆ వీడియో అప్పట్లో బాగా వైరల్ అయింది.
స్నేక్ ద్వీపాన్ని రష్యా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కానీ, ఆ తర్వాత యుక్రెయిన్ సైనికులను విడుదల చేశారు. కానీ, దానికి ప్రతిగా రష్యా సైనికుల్ని కూడా విడిచిపెట్టాల్సి వచ్చింది.
గత సంవత్సరం జూన్‌లో యుక్రెయిన్ సైన్యం ఈ స్నేక్ ద్వీపాన్ని చేజిక్కించుకుంది.
యుద్ధం 500 రోజులను పూర్తి చేసుకోవడం మరో భయానక మైలురాయి అని యుక్రెయిన్‌లో యుద్ధాన్ని పరిశీలిస్తున్న ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల పర్యవేక్షణ బృందానికి చెందిన డిప్యూటీ హెడ్ నోయల్ కాల్హౌన్ అన్నారు.
ఈ యుద్ధం ప్రారంభమైన తర్వాత నుంచి సుమారు 500 మంది చిన్నారులు సహా తొమ్మిది వేల మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది.
అయితే, ఈ మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని కూడా నోయల్ అంచనా వేస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
నాటో శిఖరాగ్ర సదస్సులో ఇదే ప్రధాన అజెండా
నాటో శిఖరాగ్ర సదస్సులో యుక్రెయిన్ యుద్ధం ప్రధాన అజెండాగా ఉండనుంది.
సదస్సుకు ముందే యూరోప్ దేశాల అధినేతలతో సమావేశమవుతూ ఆయన తన అభిప్రాయాన్ని వారి ముందు ఉంచుతున్నారు.
యుక్రెయిన్‌కు అమెరికా క్లస్టర్ బాంబులు ఇచ్చేందుకు ముందుకు వస్తుందన్న వార్తలను జెలెన్‌స్కీ స్వాగతించారు.
అయితే, ఈ బాంబులను ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాల్లో నిషేధించారు.
ఈ యుద్ధంలో రష్యా, యుక్రెయిన్ రెండూ కూడా క్లస్టర్ ఆయుధాలను వినియోగించాయి. కానీ, అమెరికా నిర్ణయం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
అమెరికా తాజా ఆయుధాల ఒప్పందం సరైన, అత్యంత అవసర సమయంలో కుదిరిందని జెలెన్‌స్కీ ఇటీవల ట్వీట్ చేశారు.
తమ భూభాగం నుంచి ఆక్రమణదారుల్ని తరిమికొట్టేందుకు ఈ కొత్త ఆయుధాలను అమెరికా తమకు ఇస్తుందని ఆయన చెప్పారు.
రష్యా ఆక్రమణ నుంచి తమ భూభాగాన్ని వెనక్కి తీసుకునేందుకు గత నెల నుంచి ప్రతీకార దాడులను యుక్రెయిన్ ప్రారంభించింది.
ప్రతీకార దాడులలో తాము నెమ్మదిగా పురోగతి సాధించామని జెలెన్‌స్కీ చెప్పారు.
తూర్పు దోన్యస్క్, ఆగ్నేయ జపోరిఘియా ప్రాంతాలపై ఈ ప్రయత్నాలను చేపట్టారు. బఖ్‌ముత్ నగరంలో కూడా నెమ్మదిగా ఈ ప్రక్రియ సాగుతోంది.
ఇదే సమయంలో, యుక్రెయిన్‌పై రష్యా తన క్షిపణి, డ్రోన్ దాడులను చేపడుతోంది. తూర్పు దోన్యస్క్‌లో సుమారు 8 మంది చనిపోయారు.
ఇవి కూడా చదవండి
- ప్రధాని మోదీపై పొగడ్తల వర్షం కురిపించిన రష్యా అధ్యక్షుడు, సడెన్‌గా ఎందుకింత ప్రేమ?
- 1971 యుద్ధానికి ముందు భారత ఫీల్డ్ మార్షల్ మానెక్షా పాకిస్తాన్ రాయబారిని ఎందుకు కౌగిలించుకున్నారు..
- రష్యా చమురు పాకిస్తాన్‌కు భారత్ నుంచి ఎందుకు వెళ్తోంది?
- చైనా 11 కి.మీ. లోతైన గొయ్యి తవ్వుతోంది, అక్కడ ఏముంది?
- రష్యా - యుక్రెయిన్ యుద్ధం: భారీ డ్యామ్ ధ్వంసం.. ప్రమాదంలో వేల మంది ప్రాణాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














