ఆ బీచ్‌లో మానవ అస్థికలు ఎందుకు దొరుకుతున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
బీచ్‌లో షికారు చేయడం చాలామందికి ఇష్టమే. కానీ, అలా బీచ్‌లో నడుస్తున్నప్పుడు మనుషుల అస్థిపంజరాలు కనబడితే ఎలా ఉంటుంది?
క్రిస్టోఫర్ రీస్‌కు సరిగ్గా ఇలాగే జరిగింది. గత అక్టోబర్‌లో వేల్ ఆఫ్ గ్లామోర్గాన్‌లోని డన్రూవన్ బే బీచ్‌లో నడుస్తుండగా ఈ అనుభవం ఎదురైంది.
వేల్స్‌లో నివసించే క్రిస్టోఫర్ తన ఏడేళ్ల కొడుకు డైలాన్‌తో బీచ్‌లో నడుస్తుండగా ఈ సంఘటన జరగింది. ఇసుకలో వారికొక ఎముక కనిపించింది.
‘‘డైలాన్‌కు చరిత్ర గురించి తెలుసుకోవడం, మ్యూజియంకు వెళ్లడం చాలా ఇష్టం. ఆ ఎముకను చూసి అతను చాలా ఆశ్చర్యపోయాడు’’ అని క్రిస్టోఫర్ చెప్పారు.
డైలాన్ మొదట వాటిని డైనోసార్ ఎముకలుగా భావించి, వాటిని కారులో ఇంటికి తీసుకెళ్లారు.

ఫొటో సోర్స్, Christopher Rees
ఇంటికి చేరుకోగానే, తనకు కనిపించిన ఆ ఎముకలను తన తల్లి సోఫీకి గర్వంగా చూపించాడు డైలాన్. అయితే, వాటిని చూడగానే సోఫీకి అనుమానం వచ్చింది.
‘‘అవి మనిషి ఎముకల్లా ఉన్నాయని సోఫీ అనగానే నాక్కూడా సందేహం వచ్చింది. మొదట వాటిని నేను జంతువుల ఎముకలనే అనుకున్నాను. ’’ అని క్రిస్టోఫర్ చెప్పారు.
‘‘మా సోదరి స్నేహితుల్లో కొందరు డాక్టర్లు, పశువైద్యులు ఉన్నారు. మేమంతా ఒక ఆదివారం రాత్రి భోజనం అనంతరం మాట్లాడుకుంటున్నాం. అప్పుడే వారిలో ఒకరు ఇది మనిషి ఎముకలా ఉంది అన్నారు’’ అని ఆయన చెప్పారు.
అప్పుడే క్రిస్టోఫర్ పోలీసులకు ఫోన్‌చేసి జరిగినదంతా చెప్పారు.
‘‘ మొదట నాకు భయమేసింది. సమస్యలో ఇరుక్కుంటున్నానా అనిపించింది’’ అని ఆయన వివరించారు.
‘‘పోలీసులకు జరిగిందంతా చెప్పాను. ఇవి ఎక్కడ దొరికాయో కూడా చెప్పాను’’ అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Christopher Rees
ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ నియంత్రణలోకి తీసుకున్నారు. మేం సేకరించిన వాటిని వారు కూడా జాగ్రత్తగా పరిశీలించారు.
కొన్ని వారాల తర్వాత, క్రిస్టోఫర్, డైలాన్‌లు పురాతన అవశేషాలు కొనుక్కొన్నారని అధికారులు ధ్రువీకరించారు.
‘‘ఇదేదో బాగుందే అని నేను డైలాన్ అనుకున్నాం’’ అని క్రిస్టోఫర్ వివరించారు.
ఈ తీర ప్రాంతంలో పురాతన అవశేషాలు కనుగొనడం ఇదేమీ తొలిసారి కాదు.
ఈ నెల మొదట్లో అక్కడున్న ఒక గోడ కూలినప్పుడు వందేళ్ల కిందటి కొన్ని మానవ అవశేషాలు కనిపించాయి.

ఫొటో సోర్స్, Christopher Rees
తాజాగా లభించిన ఎముకలను విశ్లేషణ కోసం పంపించారు. అయితే, 16 శతాబ్దంలో ఒక పడవ ప్రమాదంలో మరణించిన బాధితుల అస్థిపంజరాల అవశేషాలు ఇవి అయ్యుండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
అయితే, ఈ అస్థి పంజరాలు ఆ నౌకలో మరణించినవారికి కాకపోయేందుకు మరో రెండు అవకాశాలు కూడా ఉన్నాయని చరిత్రకారుడు గ్రాహం లవ్‌లక్-ఎడ్వర్డ్స్ అన్నారు.
‘‘శతాబ్దాలకు ముందు ఈ ప్రాంతాల్లో ప్రజలు చనిపోయినవారికి గుహల్లో అంత్యక్రియలు నిర్వహించేవారు. గోవర్‌పై ఉన్న పేవిలాండ్‌లో దానికి సంబంధించి ఆధారాలు మాకు కనిపించాయి’’ అని ఆయన అన్నారు.
‘‘1వ శతాబ్దంలో ఇక్కడకు సమీపంలో ఒక యుద్ధం కూడా జరిగినట్లు కొన్ని పురావస్తు ఆధారాలు లభించాయి’’ అని ఆయన తెలిపారు.
అయితే, వాటిన్నింటిలో పడవ ప్రమాదం జరిగి ఉండే అవకాశమే ఎక్కువని మేం భావిస్తున్నామని ఎడ్వర్డ్స్ చెప్పారు.
ఆయన వాదనతో ద ట్రస్ట్ ఫర్ వెల్ష్ ఆర్కియాలజీకి చెందిన క్లాడైన్ జెరార్డ్ కూడా ఏకీభవించారు.
‘‘నౌకలు, పడవల ప్రమాదాల తర్వాత, మానవ శిథిలాలు ఇలా తీరాలకు కొట్టుకుని వస్తాయి. వీటిని ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లోనే ఖననం చేస్తుంటారు’’ అని ఆమె చెప్పారు.
గ్లామోర్గాన్ తీర ప్రాంతంలో చాలా పురావస్తు అన్వేషణలు జరిగాయి. వీటిలో ఇనుప యుగం నిర్మాణాలతోపాటు ఓడ శిథిలాలు బయటపడ్డాయి.
2019లో డన్‌రావెన్ తీరం నుంచి కొన్ని మైళ్ల దూరంలో ఉన్న నాష్ బీచ్‌లో ఆరుగురు వ్యక్తుల అస్థి పంజరాల అవశేషాలు కనిపించాయి. వాటిని ఓడ ప్రమాద బాధితులవిగా భావిస్తున్నారు.
2014లో కూడా ఇక్కడే ఒక కొండ పై మనుషుల కాలు ఎముకలు రెండింటిని గుర్తించారు.
- ఇరాన్ ఎందుకు ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది? ఆరు ప్రశ్నలు, సమాధానాలు..
- వెయ్యేళ్ల నాటి ఈ అస్థిపంజరం కోసం నాజీలు, సోవియట్లు ఎందుకు పోరాడారు?
- గాజా యుద్ధం: ఇజ్రాయెల్‌కు ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: వైసీపీకి చిక్కవు, టీడీపీకి దొరకవు
- 'ఇంట్లో చొరబడి చంపేస్తాం' అన్న మోదీ వ్యాఖ్యలపై అమెరికా ఏమందంటే..
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















